India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నరసాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నారాయణ నాయికర్ గెలుపొందారు. తన ప్రత్యర్థి వరప్రసాద్ రాజు(వైసీపీ)పై 49738 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 94116 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి వర ప్రసాద్‌కి 44378 ఓట్లు పడ్డాయి. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు 44,107 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఉత్తరాంధ్ర ఎంపీ స్థానాలకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. శ్రీకాకుళం TDP MP అభ్యర్థి రామ్మోహన్ నాయుడు (2,66,574), విజయనగరం TDP అభ్యర్థి అప్పలనాయుడు 1,74,499.. విశాఖపట్నం TDP అభ్యర్థి భరత్ 2,89,331.. అనకాపల్లి BJP MP అభ్యర్థి C.M.రమేష్ 2,06,951 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అరకులో మాత్రం YCP అభ్యర్థి తనూజ రాణి 45,860 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ఎన్నికల ఫలితాలపై సా.5.30 గంటలకు వారు మాట్లాడనున్నారు. బీజేపీకి టఫ్ ఫైట్ ఇస్తున్న కాంగ్రెస్.. మిత్రపక్షాలతో కలిసి ఎలాగైనా అధికారం చేపట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.
మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఆయనకు 3.50లక్షల ఓట్లకుపైగా మెజారిటీ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేశారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ సాధించిన విజయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ‘సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం, నిబద్ధత ఎల్లప్పుడూ నా హృదయాన్ని హత్తుకుంటాయి. ప్రజా సేవలో మీ ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని Xలో శుభాకాంక్షలు తెలియజేశారు.
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో 59 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2019తో పోలిస్తే భారీగా మెజార్టీ తగ్గడం గమనార్హం. అప్పుడు 90,110 మెజార్టీ రాగా, ఇప్పుడు 30 వేల ఓట్లు తగ్గిపోయాయి. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోయినా భారీగా ఓట్లను కొల్లగొట్టారు.
టీడీపీ భారీ విజయం సాధిస్తుండటంపై చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి ఉత్సాహంగా కనిపించారు. కుటుంబ సభ్యులందరూ విక్టరీ సింబల్ చూపిస్తూ ఫొటోకు పోజులిచ్చారు. మరోవైపు ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
AP: తునిలో టీడీపీ అభ్యర్థి యనమల దివ్య విజయం సాధించారు. మంత్రి దాడిశెట్టి రాజాపై 14,541 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆమెకు మొత్తం 95,836 ఓట్లు పోలయ్యాయి. ఇటు మంత్రి దాడిశెట్టి రాజాకు 81,295 ఓట్లు పడ్డాయి. ఈమె టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కూతురు.
AP: నంద్యాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలిపిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓటమి చవిచూశారు. రవిచంద్రపై టీడీపీ అభ్యర్థి మహ్మద్ ఫరూక్ 11000+ మెజార్టీతో ఘన విజయం సాధించారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి తరఫున బన్నీ ప్రచారం చేయడాన్ని చాలామంది జనసైనికులు తప్పుబట్టారు. కుటుంబానికి చెందిన జనసేనకు మద్దతివ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.
విశాఖ నగరంలో కూటమి హవా కొనసాగింది. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు(TDP), విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్(JSP), విశాఖ వెస్ట్ నుంచి పీజీవీఆర్ నాయుడు (TDP), గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు (TDP) విజయం సాధించారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు (TDP), విశాఖ నార్త్ నుంచి పి. విష్ణు కుమార్ రాజు (BJP) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు విశాఖ స్థానంలో TDP అభ్యర్థి భరత్ భారీ ఆధిక్యంలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.