News December 6, 2024

‘హ్యుందాయ్’ రేట్లు రూ.25వేలు పెంపు

image

తమ అన్ని రకాల వాహన మోడళ్ల ధరలను జనవరి 1 నుంచి రూ.25వేల వరకు పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది. ముడి సరకు, రవాణా ఖర్చులు పెరగడం, మారకపు రేట్లు అనుకూలంగా లేకపోవడంతోనే ధరలను పెంచాల్సి వచ్చిందని తెలిపింది. పలు నివేదికల ప్రకారం రబ్బరు రేట్లు 26.8 శాతం, అల్యూమినియం 10.6%, జింక్ 16.5%, టిన్ 13.3%, కాపర్ ధర 5.3% పెరిగింది.

News December 6, 2024

సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం?

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. నెల రోజుల్లో కొత్తగా వెయ్యి బస్సులు, మరిన్ని అద్దె బస్సులు సమకూర్చుకుని ఉచిత ప్రయాణం హామీని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

News December 6, 2024

టీచర్‌పై విద్యార్థుల దాడి కేసులో విస్తుపోయే అంశాలు?

image

AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఉర్దూ పాఠశాలలో నిన్న టీచర్ ఏజాష్ అహ్మద్ (42) మరణించిన విషయం తెలిసిందే. కాగా స్కూల్లో తొమ్మిదో తరగతి చదివే కవల పిల్లలు దాడి చేయడంతో అవమానానికి గురై కూర్చున్న కుర్చీలోనే అహ్మద్ కుప్పకూలారు. వారిలో ఒకరు చేతి కడియంతో దాడి చేయడంతో టీచర్ కంటికి దెబ్బ తగిలింది. వీరు దురలవాట్లకు బానిసలయ్యారని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నారు.

News December 6, 2024

బ్రాండ్ వ్యాల్యూలో సీఎస్కేనే టాప్

image

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల బ్రాండ్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. క్యాష్ రిచ్ లీగ్‌లో సీఎస్కే అత్యధిక బ్రాండ్ విలువ కలిగి ఉంది. ఈ జట్టు బ్రాండ్ వ్యాల్యూ ప్రస్తుతం 122 మిలియన్ డాలర్లుగా ఉంది. 119 మిలియన్ డాలర్లతో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత ఆర్సీబీ (117M), కేకేఆర్ (109M), ఎస్ఆర్‌హెచ్ (85M), ఆర్ఆర్ (81M), డీసీ (80M), జీటీ (69M), పీబీకేఎస్ (68M), ఎల్ఎస్‌జీ (60M) ఉన్నాయి.

News December 6, 2024

రేపు రాష్ట్రానికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

image

TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు హైదరాబాద్ వస్తున్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ మీటింగ్‌లో ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ అన్న నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారు. ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ కూడా హాజరవుతారు.

News December 6, 2024

హిందీలో చరిత్ర సృష్టించిన పుష్ప-2!

image

పుష్ప-2 మూవీ హిందీలో చరిత్ర సృష్టించింది. నాన్ హాలిడే(గురువారం) రోజున విడుదలై ఫస్ట్ డే రూ.65-67 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచినట్లు బాలీవుడ్ సినీ విశ్లేషకులు వెల్లడించారు. రూ.70 కోట్ల మార్క్‌నూ దాటి ఉండొచ్చని అంచనా వేశారు. ఒక టాలీవుడ్ డబ్బింగ్ మూవీ హిందీలో అదరగొట్టడం అద్భుతమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఓ తెలుగు చిత్రం డామినేట్ చేస్తోందని పేర్కొంటున్నారు.

News December 6, 2024

నేటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 8 వరకు 17,564 గ్రామాల్లో ఈ సదస్సులు కొనసాగుతాయి. భూముల రికార్డులను అప్డేట్ చేసేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి భూసమస్యలను పరిష్కరిస్తారు. అసైన్డ్, డొంక, వాగు పోరంబోకు, ఇనాం, దేవదాయ, వక్ఫ్, 22 ఏ, ఫ్రీ హోల్డ్ భూముల వివరాలు సేకరిస్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది.

News December 6, 2024

1,600 మంది MPHAల తొలగింపు

image

AP: దాదాపు 1,600 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 3నెలల ముందస్తు నోటీసు ఇచ్చాకే తొలగించాలని కోర్టు తీర్పు ఉన్నప్పటికీ పట్టించుకోలేదని MPHAలు వాపోతున్నారు. వీరి అర్హతలపై 2002లో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వీరిని తొలగించాల్సి ఉండగా 2013లో GO1207 కింద తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ GO చెల్లదని తాజాగా తీర్పు వెలువడింది.

News December 6, 2024

నేటి నుంచే పింక్ బాల్ టెస్ట్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌ను పింక్ బాల్‌తో ఆడతారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్, డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. తొలి టెస్టు గెలిచిన జోష్‌లో టీమ్ ఇండియా రెండో టెస్టుకు సిద్ధమైంది. మరోవైపు ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సమం చేయాలని భావిస్తోంది.

News December 6, 2024

మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. ప్రాణాలు కాపాడిన పోలీసులతో బాదల్

image

గోల్డెన్ టెంపుల్‌లో తనపై జరిగిన హత్యాయత్నం నుంచి కాపాడిన ASIలు జ‌స్వీర్ సింగ్‌, హిరా సింగ్‌ల‌కు జీవితాంతం రుణప‌డి ఉంటాన‌ని SAD Ex చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. మ‌త‌ప‌ర‌మైన శిక్ష అనుభ‌విస్తున్న ఆయ‌న‌పై బుధ‌వారం ఓ వ్య‌క్తి కాల్పుల‌కు తెగ‌బ‌డిన విష‌యం విదిత‌మే. జీవితాన్ని ప‌ణంగా పెట్టి ఒకరి ప్రాణాన్ని కాపాడ‌డం అసాధార‌ణ చ‌ర్య అన్నారు. ఆ పోలీసుల‌ను హ‌త్తుకున్న ఫోటోలను బాద‌ల్ పంచుకున్నారు.