News June 4, 2024

BREAKING: ఖాతా తెరిచిన BRS

image

మెదక్‌ పార్లమెంట్ స్థానంలో బీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. ఆ పార్టీ నుంచి పి.వెంకట్రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. తొలుత వెనుకంజలో ఉన్నా ఆ తర్వాత లీడ్‌లోకి వచ్చారు.

News June 4, 2024

మంత్రులకు షాక్.. అందరూ వెనుకంజే

image

ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తోంది. దాదాపు అందరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు వైసీపీ మంత్రులు, సీనియర్లకు షాక్ ఇస్తున్నారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూటమి హవా కొనసాగుతోంది. పలువురు వైసీపీ అభ్యర్థులు ఇప్పుడే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు.

News June 4, 2024

కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ముందంజ

image

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ 855 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత వెనుకంజలో ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత మరణంతో ఉప ఎన్నిక జరిగింది.

News June 4, 2024

ఇది ట్రైలర్ మాత్రమే: జైరాం రమేశ్

image

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజలో ఉండటంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్.. బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీపై 6223 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేసిన బీజేపీకి వారణాసి ప్రజలు షాక్ ఇస్తున్నారు.

News June 4, 2024

బెంగాల్‌లో హోరాహోరీ

image

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. 42 లోక్‌సభ స్థానాల్లో కాషాయ పార్టీ 21 స్థానాల్లో, TMC 18 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కౌంటింగ్ కొనసాగే కొద్ది ఈ స్థానాలపై మరింత క్లారిటీ రానుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా సర్వేలు ఈ రాష్ట్రంలో బీజేపీకే మెజారిటీ సీట్లు వస్తాయని అంచనా వేసిన సంగతి తెలిసిందే.

News June 4, 2024

CM రేవంత్ ఇలాకాలో BJP ముందంజ

image

సీఎం రేవంత్‌ సొంతగడ్డ మహబూబ్‌నగర్, ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి నియోజకవర్గాల్లో BJP ఆధిక్యంలో కొనసాగుతోంది. మహబూబ్‌నగర్లో డీకే అరుణ, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థులపై పైచేయిలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

రాయలసీమలో ఆధిక్యంలో ఉన్నది వీరే..

image

✒ జమ్మలమడుగు-మూలె సుధీర్ రెడ్డి(YCP)
✒ కడప-మాధవీరెడ్డి 3,919 ఓట్లు(TDP)
✒ ప్రొద్దుటూరు- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(YCP)
✒ చంద్రగిరి- పులివర్తి నాని(TDP)
✒ అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్(TDP)
✒ నగరి- గాలి భాను ప్రకాశ్(TDP)
✒ పూతలపట్టు- మురళీ మోహన్(TDP)

News June 4, 2024

మంత్రి బొత్స వెనుకంజ

image

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు. తొలుత మంత్రి ఆధిక్యంలో కొనసాగగా.. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఆధిక్యంలోకి వచ్చారు. అటు గాజువాక నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధిక్యంలోకి వచ్చారు.

News June 4, 2024

సికింద్రాబాద్: కిషన్‌రెడ్డి ఆధిక్యం

image

సికింద్రాబాద్ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో సిట్టింగ్ ఎంపీ కిషన్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. BRS నుంచి పద్మారావుగౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బరిలో నిలిచారు.

News June 4, 2024

UP: స్మృతి, రాజ్‌నాథ్ వెనుకంజ

image

ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. బీజేపీ అనూహ్యంగా వెనకబడింది. మొత్తం 80 స్థానాల్లో కేవలం 37లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. విపక్ష ఇండియా కూటమి ఏకంగా 41 స్థానాల్లో దూసుకుపోతోంది. అమేథీలో స్మృతి ఇరానీపై కిశోరీలాల్ ఆధిక్యం కనబరుస్తున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం వెనుకంజలో ఉన్నారు.