India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జకోవిచ్ ఈ మ్యాచ్ గెలిచేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. సెరున్‌డొలోపై (అర్జెంటీనా) గెలిచేందుకు ఐదు సెట్లు (6-1, 5-7, 3-6, 7-5, 6-3) పోరాడాల్సి వచ్చింది. మరోవైపు స్టార్ ఆటగాడు డానియల్ మెద్వెదెవ్ (రష్యా) సీడ్ డిమెనార్ (ఆసీస్) చేతిలో ఓడటంతో ఇంటిముఖం పట్టారు.
ఎల్-నినో ప్రభావంతో నమోదవుతున్న రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలకు ఇక తెరపడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. ‘జూలై-సెప్టెంబరు మధ్య లా నినా ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు పడొచ్చు. జూలై-ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి, లా నినా ఏర్పడటానికి 50-50 అవకాశాలు ఉన్నాయి. లా నినా ఏర్పడటానికి JUL-SEP మధ్య 60%, ఆగస్టు నుంచి NOV మధ్య 70% ఛాన్స్ ఉంది’ అని తెలిపింది.
లోక్‌సభ ఎన్నికల్లో 2014 నుంచి రాజస్థాన్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న BJP మరోసారి క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో 25 సీట్లలో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయింది. మోదీ ఇమేజ్, అయోధ్య రామమందిరం మొదలైన అంశాలు పార్టీకి కలిసొచ్చాయి. కాగా ఈసారి విజయాన్ని కూడా బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
హ్యాట్రిక్‌పై బీజేపీ ధీమా వెనుక ఐదు ప్రధాన అంశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ‘మోదీ ఇమేజ్ కీలక పాత్ర పోషించింది. కార్యకర్తలు, RSS అండ ఆ పార్టీకి బలంగా మారింది. ఆర్థికంగా బలంగా ఉండటమూ పార్టీకి కలిసొచ్చింది. మహిళలు, యువత, రైతులు, పేదలే లక్ష్యంగా ప్రచారం చేసి ఓటర్ బేస్ పెంచుకునే ప్రయత్నం చేసింది. 2019 ఎన్నికల్లో ఓట్ షేర్ 45%కు పెరగడంతో ఈసారి కూడా ఆ ప్రభావం ఉండొచ్చని ధీమాగా ఉంది’ అని పేర్కొన్నారు.
రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా మొదలైన రాష్ట్రాలు ఈ రెండో జాబితాలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు ఆ 119 స్థానాలు గెలవడం సవాల్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ 2019 లెక్కలను మార్చగలిగితే ఇప్పుడు ఆశిస్తున్న టార్గెట్‌ను చేరుకునే అవకాశం ఉందంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే మళ్లీ అధికారమని అంచనా వేస్తున్నా ఇండియా కూటమి మాత్రం తాము 295 సీట్లు సాధిస్తామని ధీమాగా ఉంది. అయితే కూటమికి అంతమొత్తంలో సీట్లు రావడం సవాల్‌తో కూడుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘దక్షిణాది రాష్ట్రాలు, యూపీ, బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, లక్షద్వీప్, అండమాన్, జమ్మూకశ్మీర్ నుంచి 295 స్థానాల్లో 176 గెలిచినా మిగతా రాష్ట్రాల్లో 119 సీట్లు గెలవాలి’ అని పేర్కొన్నారు.
కృత్రిమంగా తయారైన ఫ్రూట్ జ్యూస్‌లను ‘100% ఫ్రూట్ జ్యూస్’గా పేర్కొంటూ మార్కెట్లో సంస్థలు విక్రయించడాన్ని FSSAI తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాగ్‌ను తొలగించాలని తయారీ సంస్థలను ఆదేశించింది. ఇప్పటికే ప్రింట్ చేయించిన ఉత్పత్తులపైనా ట్యాగ్స్‌ను తొలగించేందుకు SEP 1 వరకు గడవు ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ప్రకారం కృత్రిమ పానీయాలను ‘100% ఫ్రూట్ జ్యూస్’గా పేర్కొనడం సరికాదని తెలిపింది.
నేడు వెల్లడికానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు NDAదే విజయమని, ఆ కూటమికి 350కిపైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ అంచనాలను తలకిందులు చేస్తూ తాము గెలుపొందుతామని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంచనాలకు తగినట్టు బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? లేక ఫలితాల్లో ట్విస్ట్ ఉంటుందా? అనేది చర్చనీయాంశమైంది.
ఇకపై టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్‌లో టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రసారభారతి ప్రకటించింది. జులై 26న ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌నూ ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు 28-సెప్టెంబరు 8 మధ్య జరిగే పారాలింపిక్స్ గేమ్స్ కూడా లైవ్ చూడొచ్చని పేర్కొంది. మరోవైపు ఫ్రెంచ్ ఓపన్, వింబుల్డన్ ఫైనల్స్ కూడా టెలికాస్ట్ చేస్తామని వెల్లడించింది.
* 1897: స్వాతంత్ర్య సమరయోధుడు వెన్నెలకంటి రాఘవయ్య జననం
* 1946: గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం జననం
* 1961: సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి జననం
* 1968: నటుడు తొట్టెంపూడి వేణు జననం
* 1984: సినీ నటి ప్రియమణి జననం
* 1998: సాహితీవేత్త ఆరుద్ర మరణం
Sorry, no posts matched your criteria.