News June 3, 2024

నోటా ఓటుతో కలవరపాటు!

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. కాగా ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నోటా ఓట్లు కూడా అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే.. గత రెండు ఎన్నికల్లోనూ నోటా ఓట్లు భారీగానే పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60,02,942 మంది, 2019లో 65,22,772 మంది నోటా బటన్ నొక్కేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ ఓట్లు అభ్యర్థులకు పడితే ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ కూడా ఉండేది.

News June 3, 2024

BREAKING: పాలిసెట్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ పాలిసెట్ ఫలితాలను విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. Way2News యాప్‌లో సులభంగా, వేగంగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. మే 24న జరిగిన ఈ పరీక్షకు 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు.

News June 3, 2024

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన.. బీఆర్ఎస్ MLAపై కేసు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లను మభ్యపెట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

News June 3, 2024

21 స్థానాల్లో జనసేన పోటీ.. ఎక్కడెక్కడ గెలుస్తుంది?

image

AP: జనసేన పోటీ చేసిన 21 MLA స్థానాల్లో 14-15 సీట్లు, 2 ఎంపీ స్థానాల్లో గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. పిఠాపురం, పెందుర్తి, విశాఖ సౌత్, యలమంచిలి, అనకాపల్లి, నెల్లిమర్ల, పాలకొండ, రాజానగరం, పి.గన్నవరం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం, అవనిగడ్డ, తెనాలి, తిరుపతి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో JSP ఎక్కడెక్కడ గెలుస్తుందో కామెంట్ చేయండి.

News June 3, 2024

BREAKING: పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు

image

AP: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే <<13354570>>పిన్నెల్లి<<>> రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆయనను ఆదేశించింది. అలాగే బెయిల్‌ను పొడిగించకుండా ఈ నెల 6న నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. EVM ధ్వంసం కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News June 3, 2024

వరల్డ్ కప్ చూడాలనే లేదు: రియాన్

image

టీ20 వరల్డ్ కప్‌ను చూడాలనే లేదని క్రికెటర్ రియాన్ పరాగ్ వ్యాఖ్యానించారు. ‘జట్టులో నేను ఉండి ఉంటే ఏమవుతుందనే కంగారు ఉండేది. టీమ్‌లో నేను లేను కాబట్టి మ్యాచ్‌లపై పెద్దగా ఆసక్తి లేదు. చివరకు ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దానితోనే సంతోష పడతా’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా ఐపీఎల్‌లో రియాన్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. WCకి ఎంపిక చేస్తారనే చర్చ నడిచినా జట్టులో చోటు దక్కలేదు.

News June 3, 2024

పాక్ బ్రిగేడియర్‌గా తొలిసారి మహిళ నియామకం

image

పాకిస్థాన్ ఆర్మీలో బ్రిగేడియర్‌గా తొలిసారి ఓ మహిళ, క్రైస్తవ వర్గానికి చెందిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ నియమితులయ్యారు. ఆర్మీ మెడికల్ కేర్‌లో సీనియర్ పాథాలజిస్ట్‌గా 26 ఏళ్లుగా పనిచేస్తున్న ఆమెకు తాజాగా పదోన్నతి లభించింది. దీంతో మేరీకి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. కాగా 2021 గణాంకాల ప్రకారం పాక్‌లో 96.47 శాతం ముస్లింలు, 2.14 శాతం హిందువులు, 1.27 శాతం క్రైస్తవులు ఉన్నారు.

News June 3, 2024

T20WCలో అరుదైన రికార్డు

image

ఇవాళ ఒమన్-నమీబియా మధ్య జరిగిన T20WC మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఒమన్ టీమ్‌లోని ఆరుగురు బ్యాటర్లు LBWగా వెనుదిరిగారు. మెన్స్ T20లో ఇంతమంది ఇలా ఔటవడం ఇదే తొలిసారి. గతంలో నెదర్లాండ్స్(vsశ్రీలంక), స్కాట్లాండ్(vsఅఫ్గాన్) బ్యాటర్లు ఐదుగురు LBWగా ఔటయ్యారు. ఇవాళ మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్‌లో నమీబియా <<13366862>>గెలిచిన<<>> విషయం తెలిసిందే.

News June 3, 2024

‘ఓజీ’ పోస్ట్‌పోన్.. ‘దేవర’ ప్రీపోన్?

image

NTR హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. అక్టోబర్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ డేట్‌లో రామ్‌చరణ్ నటిస్తోన్న గేమ్‌ఛేంజర్‌ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో ముందుగా సెప్టెంబర్ 27న దేవర విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డేట్‌లో రిలీజ్ అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ డిసెంబర్‌కు పోస్ట్‌పోన్ అవ్వొచ్చని తెలుస్తోంది.

News June 3, 2024

వీరికి ఓటమే: టైమ్స్ నౌ

image

లోక్‌సభ-2024 ఎన్నికల్లో కీలక నేతలు ఓటమి పాలవుతారని టైమ్స్ నౌ-ETG ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలిపింది. కృష్ణానగర్‌లో టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా, తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మండీలో కంగనా రనౌత్, కన్నౌజ్‌లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కోయంబత్తూరులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తదితర నేతలకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పింది.