India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఫెంగల్ తుఫాన్ తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ APలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల్లో భారీ, కోస్తా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. అటు TGలోని ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మహారాష్ట్ర CM పీఠంపై ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఇవాళ జరిగే సమావేశంలో దేవేంద్ర ఫడణవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని BJP వర్గాలు తెలిపాయి. దీంతో CMగా ఆయన పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక బెట్టువీడిన ఏక్‌నాథ్ శిండే తన కొడుకుకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 5న MH సీఎం ప్రమాణస్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

TG: రాష్ట్రంలో నవంబర్ నెలలో GST ద్వారా రూ.5,141కోట్లు వసూలైంది. గతేడాది ఇదే నెల రూ.4,986 కోట్లు ఉండగా, ప్రస్తుతం 3% పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. SGST, IGSTలో SGST వాటా పంచిన తర్వాత రాష్ట్రానికి 2024-25లో రూ.29,186కోట్లు వచ్చాయి. గతేడాది కంటే ఇది 9% ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి NOV వరకు CGST, SGST, IGST, సెస్ రూపంలో మొత్తం రూ.41,065 కోట్లు వసూలైంది. అటు, APలో GST వసూళ్లు 10% తగ్గాయి.

AP: రాజమండ్రి, తిరుపతి నుంచి ముంబైకి కొత్తగా రెండు ఇండిగో విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ సా.4.50కి ముంబైలో బయలుదేరి రా.6.45కు రాజమండ్రికి, తిరిగి అక్కడి నుంచి రా.7.15 ప్రారంభమై రా.9.05 గంటలకు ముంబై చేరుకుంటుంది. మరో విమానం ఉ.5.30కు ముంబై నుంచి బయలుదేరి ఉ.7.15కు తిరుపతికి, అక్కడి నుంచి ఉ.7.45కు బయలుదేరి ఉ.9.25కు ముంబైకి చేరుకుంటుంది.

పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5000, వన్‌టైమ్ గ్రాంట్ కింద రూ.6000 ఇచ్చే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. 21-24 ఏళ్ల మధ్య వయసుండి, నవంబర్ 30 వరకు ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అయినవారు దీనికి అర్హులు. దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ <

TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన వారికి నేడు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. అలాగే 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేస్తారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఈ కార్యక్రమం జరగనుంది. 28 పారా మెడికల్, 16 నర్సింగ్ కాలేజీలు, 32 ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్, 213 అంబులెన్స్‌లను కూడా CM ప్రారంభిస్తారు.

రాత్రంతా పడుకుని ఉదయం ప్రశాంతంగా నిద్ర లేస్తే రోజంతా సంతోషంగా గడపొచ్చు. కానీ కొందరు నిద్ర లేవగానే బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇవి తాగితే అసిడిటీ ఎదురవుతుంది. లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్ తీసి చెక్ చేయడం మానుకోవాలి. కొద్ది సమయంపాటు దానికి దూరంగా ఉండాలి. కాసేపు వార్మప్ చేసుకుంటే నిద్ర మత్తు పోతుంది. ఆ తర్వాత యోగా, వ్యాయామం వంటివి చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర లేవడం ఉత్తమం.

AP: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ‘సంకల్ప్-2025’ అనే కార్యక్రమాన్ని విద్యామండలి రూపొందించింది. క్వార్టర్లీ పరీక్షల్లో ఫెయిలైన స్టూడెంట్లను ప్రోత్సహించేందుకు లెక్చరర్లు, ఇతర సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించింది. వీరికి ప్రత్యేకంగా క్వశ్చన్ బ్యాంకులు ఇస్తారు. ప్రతి రోజూ సా.3 నుంచి 5గంటల వరకు స్టడీ అవర్లు నిర్వహిస్తారు. ఇవాళ్టి నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది.

ఐసీసీ నూతన చీఫ్‌గా జైషా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. 36 ఏళ్లకే ఆయన ఆ పదవి చేపట్టిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. కాగా ఇంతకుముందు భారత్ నుంచి మరో నలుగురు ఐసీసీ ఛైర్మన్‌గా సేవలందించారు. వీరిలో జగ్‌మోహన్ దాల్మియా (1997-2000), శరద్ పవార్ (2010-2012), ఎన్ శ్రీనివాసన్ (2014-2015), శశాంక్ మనోహర్ (2015-2020) ఉన్నారు.

AP: భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కచ్చితంగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ సెలవు ప్రకటించాలని పేరెంట్స్, విద్యార్థులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.