India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
INDIA కూటమి అధికారానికి చేరువకాదని, అందుకే దానికి ఓటు వేయడం వ్యర్థమని ప్రజలు గ్రహించారని ప్రధాని మోదీ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈసారి కూడా ఎన్డీఏ సంఖ్య మెరుగ్గా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. మరోవైపు భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఔటర్ రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. గత 10 రోజుల్లో శ్రీవారి మెట్లు, అలిపిరి నడక మార్గాల్లో తిరుమలకు దాదాపు 2.60 లక్షల మంది భక్తులు చేరుకున్నట్లు టీటీడీ పేర్కొంది.
గత ఏడాది జులై- డిసెంబర్ మధ్య నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మూవీలు, సిరీస్‌లకు బిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చినట్లు సంస్థ తెలిపింది. జానే జాన్ సినిమా అత్యధికంగా 20.2M వ్యూస్ సాధించగా, ఆ తర్వాత జవాన్(16.2M), కుఫియా(12.1M), OMG-2(11.5M), లస్ట్ స్టోరీస్-2(9.2M) ఉన్నాయని పేర్కొంది. సిరీస్‌లలో ది రైల్వే మెన్ 10.6M వ్యూస్‌తో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత కొహ్రా(6.4M), గన్& గులాబ్స్(6.4), కాలా పానీ(5.8M) ఉన్నాయంది.
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. <
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం రూ.430 కోట్లు కేటాయించింది. అనాథలుగా మారిన 382 మంది చిన్నారుల ఖాతాల్లో రూ.5 లక్షలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన 13,682 మంది పిల్లల పేరున రూ.3 లక్షలు డిపాజిట్ చేయనుంది. 18 ఏళ్లు వచ్చాక ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. దీనికి అదనంగా బాలికల సంరక్షణకు రూ.239 కోట్లు కేటాయించింది.
రేవ్ పార్టీలో డ్రగ్స్‌కు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు నటి హేమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించాలి. ఆమె ఇమేజ్‌ను దెబ్బ తీయడం అన్యాయం. పోలీసులు కచ్చితమైన సాక్ష్యాలను అందజేస్తే ఆమెపై ‘మా’ తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటివరకు నిరాధారమైన వార్తలను ప్రసారం చేయకండి’ అని కోరారు.
ఆదిత్య బిర్లా గ్రూప్ మార్కెట్ విలువ $100 బిలియన్ల మార్క్ (రూ.8,51,460 కోట్లు) దాటింది. దీంతో టాటా గ్రూప్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ తదితర సంస్థల జాబితాలో చేరింది. ఈ గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్‌కో సహా 12 సంస్థల షేర్లు పుంజుకోవడంతో ఈ ఘనత సాధించింది. మార్కెట్ విలువ దాదాపు 35% అల్ట్రాటెక్ సిమెంట్‌దే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.2.95లక్షల కోట్లుగా ఉంది.
పదవి మర్యాద పాటించాల్సిన అవసరం ప్రధాని మోదీకి లేదా? అని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫైరయ్యారు. బిహార్ సభలో ప్రధాని మోదీ అభ్యంతరకర <<13314526>>భాష<<>>ను ఉపయోగించారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో మోదీ అసలు స్వరూపం బయటపడిందని, దేశానికి ప్రతినిధి అనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఏ ప్రధాని అయినా ఇలాంటి పదాలు ఉపయోగించారా అని ప్రశ్నించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుఫాన్(రెమాల్)గా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. రేపు ఉదయం ఇది తీవ్ర తుఫాన్‌గా మారి అర్ధరాత్రికి బెంగాల్ సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఫలితంగా బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత హిందుత్వ నాయకురాలని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరణంతో అన్నాడీఎంకే హిందుత్వానికి దూరమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఖాళీని పూరించేందుకు బీజేపీకి అవకాశం దక్కిందన్నారు. కాగా అన్నామలై వ్యాఖ్యలను జయలలిత సన్నిహితురాలు శశికళ ఖండించారు. జయ ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదన్నారు. అందరినీ సమానంగా చూసిన ఏకైక నాయకురాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.