News May 25, 2024

పాక్ మంత్రికి కేజ్రీవాల్ చురకలు

image

పాక్ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్‌కి CM కేజ్రీవాల్ చురకలంటించారు. కేజ్రీవాల్ <<13312956>>ట్వీట్‌పై<<>> ఫవాద్ స్పందిస్తూ ‘శాంతి, సామరస్యం చేతిలో ద్వేషం, తీవ్రవాద శక్తులు ఓడిపోతాయి’ అని కామెంట్ చేశారు. ఆ కామెంట్‌పై కేజ్రీవాల్ ప్రతిస్పందించారు. ‘చౌదరీ సాబ్.. మా సమస్యలు పరిష్కరించుకోవడంలో నేను, నా దేశ ప్రజలు సమర్థులం. మీ ట్వీట్లు అవసరం లేదు. PAK పరిస్థితి బాగాలేదు. మీ దేశాన్ని జాగ్రత్తగా చూసుకోండి’ అని బదులిచ్చారు.

News May 25, 2024

SRHకు హీరోయిన్ సపోర్ట్.. విమర్శలు!

image

హీరోయిన్ సంయుక్త మేనన్ నిన్న SRHకు సపోర్ట్ చేయడంపై కొందరు సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన సంయుక్త.. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసమే చెపాక్ స్టేడియానికి వెళ్లి SRHకు మద్దతు తెలిపారని ఓ తమిళ సినిమా పేజీ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కేరళకు IPL టీమ్ లేదని.. తన ఇష్టమున్న జట్టుకు సపోర్ట్ చేసుకునే హక్కు ఆమెకు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

News May 25, 2024

బలమైన ప్రతిపక్షం లేకపోవడం బాధాకరం: మోదీ

image

2014 నుంచి ఇప్పటివరకు బలమైన ప్రతిపక్షం ఉండాలనే కోరుకున్నానని కానీ అది లోపించడం తనకు బాధ కలిగిస్తోందన్నారు ప్రధాని మోదీ. తన జీవితంలో ఏదైనా వెలితి ఉంటే అది మంచి ప్రతిపక్షం లేకపోవడమే అని అన్నారు. ప్రస్తుత ప్రతిపక్షం తనకు ఎప్పుడూ ఉపయోగపడలేదని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసం వ్యతిరేకిస్తోందన్నారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

News May 25, 2024

‘కల్కి’ బుజ్జి ప్రత్యేకతలు ఇవే!

image

‘కల్కి 2898 ఏడీ’లోని కారు ‘బుజ్జి’ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు కోసం సియట్ వారు ప్రత్యేకంగా టైర్లు తయారు చేశారు. విదేశీ అల్యూమినియంతో అలాయ్ వీల్స్ డిజైన్ చేశారు. కారుకు 34.5 అంగుళాల రిమ్స్ అమర్చారు. దీనిని సులువుగా నడిపేందుకు ఎలక్ట్రో హైడ్రాలిక్ స్టీరింగ్ ఏర్పాటు చేశారు. ఇంజిన్ కూల్‌గా ఉండేందుకు ఎయిర్ కూల్డ్ క్రిల్లోస్కర్ ఇండక్షన్ మోటార్స్‌ అమర్చారు. 47 కేవీ బ్యాటరీ ప్యాక్ కనెక్ట్ చేశారు.

News May 25, 2024

ఓటేసేందుకు వెళ్లిన మంత్రి జైశంకర్‌కి ఊహించని పరిణామం

image

లోక్‌సభ ఆరో దశ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు వెళ్లిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. తన ఓటు ఉన్న పోలింగ్ బూత్‌కి బదులు మరో కేంద్రానికి రావడంతో ఆయన్ను ఎన్నికల అధికారులు తిరిగి పంపించేశారు. దీంతో అక్కడి నుంచి ఓటున్న కేంద్రానికి వెళ్లి ఓటేశారు. అక్కడ ఓటు వేసిన మొదటి పురుష ఓటరు జైశంకర్ కావడంతో అధికారులు సర్టిఫికెట్‌ను అందజేశారు.

News May 25, 2024

గూగుల్‌ తల్లిని నమ్మి.. నేరుగా కాల్వలోకి..!

image

కొత్త చోట్లకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్‌ను వాడటం పరిపాటే. అలా వాడటమే హైదరాబాద్‌కు చెందిన నలుగురి ‘కారు’ముంచింది. కేరళలోని అలప్పుళకు వారు టూర్‌ వెళ్లారు. ఆ సమయానికి భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డుపై వరద కనిపిస్తున్నా గూగుల్‌పై నమ్మకంతో వారు ముందుకే వెళ్లారు. ఈ క్రమంలో వరద నీటి నుంచి కాల్వలోకి వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ అందరూ బయటపడ్డారు కానీ కారు నీట మునిగింది.

News May 25, 2024

వెజి‘ట్రబుల్స్’.. రేట్లు డబుల్!

image

TG: వేసవి కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 2 నెలల కిందట KG ₹20 ఉన్న టమాటా ధర ₹40కి చేరింది. క్యారెట్ ₹30 నుంచి ₹50కి, వంకాయ ₹30 నుంచి ₹60కి, పచ్చి మిర్చి ₹60 నుంచి ₹120కి, బీన్స్ ₹80 నుంచి ₹140కి రేట్లు పెరిగాయి. అన్ని వెజిటెబుల్స్ ధరలు రెట్టింపు అయ్యాయి. అన్ని మార్కెట్లలో ధరలు ఇలాగే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మీ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి?

News May 25, 2024

ప్రతిపక్షాలు నా శత్రువులు కాదు: మోదీ

image

ప్రతిపక్ష నేతలను శత్రువులుగా భావించబోనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వారితో కలిసి పని చేయాలని భావిస్తానన్నారు. వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయబోనని, వాళ్లు దాదాపు 70ఏళ్లు ఏ దేశాన్ని పాలించారని అన్నారు. వాళ్ల నుంచి మంచి గ్రహించేందుకు ప్రయత్నిస్తానని మోదీ అన్నారు. NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ.. తనపై ప్రతిపక్షాల దాడులు, డెవలప్మెంట్ ఫిలాసఫీ, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు వంటి అంశాలపై మాట్లాడారు.

News May 25, 2024

నేటి సాయంత్రం నుంచి వైన్స్ బంద్

image

TG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు. కాగా మే 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BRS నుంచి రాకేశ్ రెడ్డి, BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.

News May 25, 2024

విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

image

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ విడుదలైంది. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. 2025 ఫిబ్రవరి 28లోపు టెన్త్ ప్రిఫైనల్, మార్చిలో ఫైనల్ పరీక్షలు ఉంటాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఉ.9.30 నుంచి సా.4.45 వరకు ఉన్నత పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తారు.