India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రెండు రోజుల పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, లలన్ సింగ్‌తో వరుసగా భేటీ కానున్నారు. రేపు పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించనున్నారు.

అలాంటి నిబంధనేమీ లేదు. రాజకీయ అనిశ్చితిని బట్టి గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపిస్తారు. స్థిరత్వం ఉంటే ఆపద్ధర్మ CMను నియమిస్తారు. లేదంటే రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతారు. <<14711279>>మహారాష్ట్ర<<>>లో 4 సందర్భాల్లో అసెంబ్లీ గడువు ముగిశాకా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారు. 2004, 2009, 2014, 2019లో అసెంబ్లీ గడువులు ముగిసినా 7-30 రోజులు వ్యవధి తర్వాత కొత్త సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారీ అలాగే జరగొచ్చు.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.70,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గడంతో రూ.77,240 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది. 9 రోజుల తర్వాత సిల్వర్ రేటు రూ.లక్ష దిగువకు పడిపోవడం గమనార్హం.

మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నేటితో ముగుస్తుండటంతో CM ఏక్‌నాథ్ శిండే రాజీనామాకు సిద్ధమయ్యారని తెలిసింది. ఉదయం 11 గంటల తర్వాత ఆయన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తారని సమాచారం. కొత్త సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. బీజేపీ పెద్దలు, శివసేన, ఎన్సీపీ నేడు సమావేశమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది. అప్పటి వరకు శిండేను ఆపద్ధర్మ సీఎంగా గవర్నర్ కొనసాగిస్తారని తెలుస్తోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త, Essar గ్రూప్ కో-ఫౌండర్ శశికాంత్ రుయియా(81) కన్నుమూశారు. ఈమేరకు ఆయన కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. 1969లో ఎస్సార్ సంస్థను తన సోదరుడు రవి రుయియాతో కలిసి ఆయన స్థాపించారు. వీరిద్దరూ 2012 ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇంధనం, విద్యుత్, కార్గో, కోల్ మైనింగ్, షిప్పింగ్, IT రంగాల్లో ఎస్సార్ గ్రూప్‌ను శశికాంత్ విస్తరించారు.

కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై పన్నుల పెంపునకు ట్రంప్ సిద్ధమయ్యారు. మెక్సికో, కెనడాలపై 25%.. చైనాపై 10% పన్నులు విధించే పత్రాలపై జనవరి 20న సంతకాలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ టారిఫ్ విధానం దేశ అభివృద్ధి, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎకనమిస్టులు హెచ్చరిస్తున్నారు. కానీ, ఈ విధానమే వాణిజ్య భాగస్వాములతో బేరసారాల్లో కీలకమవుతుందని ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు.

మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీకి ఇవాళే చివరి పనిదినం. మహాయుతికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి హడావిడీ కనిపించడం లేదు. దీంతో నేడు కొత్త CMను ఎంపిక చేయకుంటే రాష్ట్రపతి పాలన విధిస్తారేమోనన్న ఆందోళన మొదలైంది. సాధారణంగా చివరి పనిదినం తర్వాత ప్రభుత్వం ఏర్పడకుంటే అందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు హంగ్ పరిస్థితి లేకపోవడంతో శిండేను ఆపద్ధర్మ CMగా కొనసాగాలని గవర్నర్ అడగొచ్చని తెలిసింది.

దేశీయ స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, నిన్నటి లాభాల తర్వాత మదుపర్ల అప్రమత్తత, సూచీలు కీలక రెసిస్టెన్సీ స్థాయులకు చేరడమే ఇందుకు కారణాలు. సెన్సెక్స్ 80,368 (+263), నిఫ్టీ 24310 (+88) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మెటల్, రియాల్టి రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. ULTRACEMCO, EICHERMOT, BAJAJ AUTO, TRENT, BAJAJ FINSERV టాప్ లూజర్స్.

రీసెర్చ్, లెర్నింగ్, నాలెడ్జ్‌కు మన దేశాన్ని కేంద్రంగా మార్చే లక్ష్యంతో ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’(ONOS)కు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు PM మోదీ తెలిపారు. విద్యావ్యవస్థ, యువత సాధికారతకు ఇదొక గేమ్‌ఛేంజర్ అని ట్వీట్ చేశారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థలకు వేలాది అంతర్జాతీయ జర్నల్స్ అందుబాటులో ఉంటాయి. ఇది 1.8 కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు.

AP: వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యర్రావారిపాలెం పోలీసులు పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగిందంటూ దుష్ప్రచారం చేశారని, తమ పరువుకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.