India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించింది. వారికి సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్‌కు రాష్ట్రం నుంచి 135 మంది అర్హత సాధించగా, వారందరికీ సింగరేణి సంస్థ ద్వారా ఆర్థికసాయం అందజేశారు.
సొంత పార్టీ ఎంపీ కంగనా రనౌత్‌కు బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. పార్టీ పాలసీ విషయాలపై మాట్లాడే అధికారం, అనుమతి ఆమెకు లేదని అధిష్ఠానం స్పష్టం చేసింది. రైతుల ఉద్యమానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల ఉద్యమంలో విదేశాల కుట్ర ఉందని, వారిని అదుపు చేయకపోతే బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు వస్తాయని కంగన వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
విమాన ప్రయాణాల్లో తినే ఆహారం రుచికరంగా ఎందుకు ఉండదో తెలుసా? అధిక ఎత్తుకు చేరుకున్న తర్వాత మన ఇంద్రియాల పనితీరు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. క్యాబిన్‌లో తేమ లేకపోవడం, శబ్దం స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల వాసన చూసే సామర్థ్యం తగ్గుతుంది. వాసన, రుచికి ఒకదానితో ఒకటి సంబంధం ఉండటం వల్ల ఆహారం రుచికరంగా అనిపించదు. 30 వేల అడుగుల ఎత్తులో తీపి, ఉప్పు, కారాన్ని 20-30% తక్కువగా గ్రహిస్తామని తెలిపారు.
TG: హైదరాబాద్‌లో ‘హైడ్రా’ కూల్చివేతలను సీపీఐ నేత నారాయణ సమర్థించారు. ‘హైడ్రా’ ఏర్పాటుతో సీఎం రేవంత్ పులి మీద స్వారీ చేయడం ప్రారంభించారని అన్నారు. ఒకవేళ స్వారీ ఆపేస్తే పులి తినేస్తుందని నారాయణ హెచ్చరించారు. ఈ కూల్చివేతలతో బడా బాబులైనా జైలుకెళతారు లేదా వారి ఒత్తిళ్లతో రేవంత్ జైలుకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్‌లోని ముగ్ధుమ్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
AP: రాష్ట్రంలో భూ బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. రెవెన్యూ శాఖలో ఆన్‌లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వీఆర్వోల నుంచి కలెక్టర్ల వరకు అధికారులందరూ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
TG: ఈ మూడింటిపై చర్యలు తీసుకుంటే హైడ్రా అసలు ఉద్దేశమేంటో తెలుస్తుందని బీజేపీ ట్వీట్ చేసింది.
1.సలకం చెరువులో అక్బరుద్దీన్ ఒవైసీ విద్యాసంస్థలు
2.జన్వాడలోని కేటీఆర్, ఇతర ప్రాంతాల్లోని BRS నేతల ఫామ్‌హౌస్‌లు
3.కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు
ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం బలమైన బుల్ ట్రెండ్‌ను ప్రదర్శించాయి. సెన్సెక్స్ 611 పాయింట్ల లాభంతో 81,698, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 25,010 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో, NTPC, HCL టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటొకార్ప్, అదానీ పోర్ట్స్, ఐచర్, మారుతీ సుజుకీ నష్టపోయాయి.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ CBIకి మరిన్ని సంచలన విషయాలు వెల్లడించినట్లు INDIA TODAY తెలిపింది. నేరం చేయడానికి ముందు అతడు స్నేహితుడితో కలిసి 2 రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లివచ్చాడని, అయితే అక్కడ సంభోగం చేయలేదని CBIకి చెప్పినట్టు పేర్కొంది. సంజయ్ దారిలో ఓ అమ్మాయిని వేధించాడని, తన గర్ల్ ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడినట్లు వివరించింది.
భారత క్రికెట్ బోర్డు ప్రస్తుత సెక్రటరీ జైషా ICC ఛైర్మన్ పోస్టుకు నామినేషన్ వేయనున్నారు. ఆయన స్థానంలో రోహన్ జైట్లీ BCCI సెక్రటరీ అయ్యేందుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. BJP దివంగత నేత అరుణ్ జైట్లీ కుమారుడే రోహన్ జైట్లీ. ప్రొఫెషనల్ లాయర్ అయిన రోహన్ ప్రస్తుతం ఢిల్లీ & జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అటు ICC ఛైర్మన్ అయ్యేందుకు షాకు సైతం సరిపడా మద్దతున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించడంపై హీరోయిన్ మాళవికా మోహన్ స్పందించారు. కల్కి విడుదలకు ముందు నుంచే ప్రభాస్‌తో రాజాసాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు. కల్కి భారీ విజయం పొందిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని, అంతే వినయంగానే ఉంటున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలో తన తొలి సినిమాలోనే ఆయనతో నటించడం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.