News November 22, 2024

రేపే ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా..

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలను వే2న్యూస్ యాప్‌లో వేగంగా చూడొచ్చు. శనివారం ఉదయం 8 గంటల నుంచి నాన్-స్టాప్ కవరేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫలితాలతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్స్, విశ్లేషణాత్మక స్టోరీలు అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్రలో 288, ఝార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉ.9 గంటల కల్లా ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది.

News November 22, 2024

చెట్లు నరికేయకుండా కర్ర వాడుకోవచ్చు!

image

పచ్చదనాన్ని పరిరక్షించేందుకు జపాన్ ప్రభుత్వం పాటిస్తోన్న పద్ధతిని నెటిజన్లు అభినందిస్తున్నారు. అక్కడ చెట్లను నరకకుండానే కలపను పొందుతుంటారు. అది ఎలా అనుకుంటున్నారా? దైసుగి అనే పురాతన ప్రక్రియలో ఉత్తమమైన దేవదారు వృక్షాలను ఎంపిక చేస్తారు. పొడవుగా పెరిగేందుకు పైన కొమ్మలను కట్ చేస్తుంటారు. ఏపుగా పెరిగిన వృక్షాలను పైనుంచి కత్తిరించి చెక్కను వాడుకుంటారు.

News November 22, 2024

అదానీ లంచాల వ్యవహారం: స్పందించిన తమిళ సర్కారు

image

Adani Groupతో త‌మ‌కు ఎలాంటి ప్ర‌త్య‌క్ష బంధాలు లేవ‌ని తమిళనాడు ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECIతో 2021లో యూనిట్‌ ₹2.61తో 1,500MW Solar Power 25 ఏళ్లపాటు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి సెంథిల్ తెలిపారు. అవినీతిమ‌య‌మైన గ్రూప్‌ను BJP ఎందుకు స‌మ‌ర్థిస్తోంద‌ని DMK ప్ర‌తినిధి శ‌ర‌వ‌ణ‌న్ ప్ర‌శ్నించారు. అదానీపై విచార‌ణ జరిపించే దమ్ముందా అని BJPకి సవాల్ విసిరారు.

News November 22, 2024

మమ్మల్ని రెచ్చగొట్టకండి: రష్యా హెచ్చరిక

image

ఉక్రెయిన్‌కు సాయం చేయడం మానుకోవాలని పశ్చిమ దేశాలకు రష్యా తాజాగా సూచించింది. తమను రెచ్చగొట్టొద్దని పేర్కొంది. ‘మా గడ్డపై జరిగే దాడుల్లో పశ్చిమ దేశాలు జోక్యం చేసుకోవద్దు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయొద్దు. మీ వైఖరి ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్‌పై మరిన్ని క్షిపణి దాడులు చేస్తాం’ అని హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో జనావాసాల మీదకు రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడి చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

News November 22, 2024

బియ్యంలో పురుగులు.. ఇలా చేస్తే దరిచేరవు!

image

ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆందోళనకరం. ఈ నేపథ్యంలో బియ్యంలో పురుగులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చిట్కాలను పలువురు సూచిస్తున్నారు. బియ్యం నిల్వ ఉంచే డబ్బాల్లో ఘాటైన వాసన ఉండేవాటిని వేయాలని చెబుతున్నారు. వేపాకు, బిరియానీ ఆకు, లవంగాలు, ఇంగువ, కర్పూరం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, రాతి ఉప్పు పొట్లాలను వాటిలో ఉంచాలని చెబుతున్నారు.

News November 22, 2024

ఛాంపియన్స్ ట్రోఫీపై 26న ICC అత్యవసర సమావేశం

image

వచ్చే ఏడాది పాక్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో అనిశ్చితి నెలకొనడంతో ఐసీసీ ఈ నెల 26న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బీసీసీఐ, పీసీబీ పెద్దలు ఇందులో పాల్గొంటారు. భద్రతాకారణాల రీత్యా పాక్‌కు క్రికెటర్లను పంపేదే లేదని భారత్ చెబుతుండగా, పంపాల్సిందేనని పాక్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రెండింటి మధ్య సయోధ్యకు యత్నిస్తోంది.

News November 22, 2024

మరోసారి తల్లి కాబోతున్న హీరోయిన్

image

హీరోయిన్ సనా ఖాన్ మరోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ముగ్గురం నలుగురం కాబోతున్నాం అని పేర్కొన్నారు. 2005లో ‘యేహై హై సొసైటీ’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సనా ఖాన్.. కళ్యాణ్ రామ్ ‘కత్తి’ మూవీతో తెలుగులో అరంగేట్రం చేశారు. తెలుగులో గగనం, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాల్లో నటించారు. 2020లో ముస్లిం మతగురువు అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకోగా 2023లో పాప జన్మించింది.

News November 22, 2024

ఫిల్ హ్యూస్ జ్ఞాపకార్థం క్రికెట్ ఆస్ట్రేలియా కార్యక్రమాలు

image

క్రికెట్ బాల్ తగిలి ఫిల్ హ్యూస్ కన్నుమూసి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అతడి జ్ఞాపకార్థం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. వచ్చే 3 షెఫీల్డ్ షీల్డ్ మ్యాచుల్లో ఆటగాళ్లు నల్ల బ్యాండ్స్ ధరిస్తారని తెలిపింది. 2014లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న సమయంలో షాన్ అబాట్ వేసిన బంతి హ్యూస్ ఎడమ చెవి కింద తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవంబరు 27న కన్నుమూశారు.

News November 22, 2024

మణిపుర్‌‌కు మ‌రో 10,800 మంది జవాన్లు

image

మ‌ణిపుర్‌కు కేంద్రం మ‌రో 90 కంపెనీల నుంచి 10,800 మంది జవాన్లను పంప‌నుంది. మే, 2023 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో 258 మంది మృతి చెందారు. తాజాగా CRPF, BSF, ITBP, SSB నుంచి అద‌న‌పు బ‌ల‌గాల మోహ‌రింపుతో మొత్తం 288 కంపెనీల సిబ్బంది అక్కడి ప‌రిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు. Nov 7న జిరిబమ్‌‌లో హ్మర్ తెగకు చెందిన మహిళను అనుమానిత మైతేయి మిలిటెంట్లు రేప్ చేసి కాల్చి చంపడంతో తిరిగి ఘర్షణ చెలరేగింది.

News November 22, 2024

ఇటలీ ప్రధాని మెలోనికి PM మోదీ గిఫ్ట్

image

నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలకు బహుమతులు ఇచ్చారు. జీ20 సమావేశాల్లో ఇటలీ ప్రధాని మెలోనికి సిల్వర్ క్యాండిల్ స్టాండ్, పోర్చుగల్ ప్రధానికి సిల్వర్ చెస్ సెట్, ఆస్ట్రేలియా ప్రధానికి సిల్వర్ క్యామెల్ హెడ్ అందజేశారు. మోదీ విదేశాలకు వెళ్లేటప్పుడు MH, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, యూపీ, లద్దాక్, ఒడిశాకు చెందిన హస్తకళలు తీసుకెళ్లారు.