News May 15, 2024

పుష్ప-2లో అనసూయ లుక్

image

పుష్ప-2లో అనసూయ భరద్వాజ్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ దాక్షాయణి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. టేబుల్‌పై ఠీవిగా కూర్చొన్న అనసూయ మాస్ స్టిల్‌ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీ ఆగ‌స్టు 15న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

News May 15, 2024

ఇండియా కూటమికి బయటి నుంచే మద్దతిస్తాం: మమత

image

ఇండియా కూటమికి తాము బయటి నుంచే సాయం చేస్తామని బెంగాల్ CM మమతా బెనర్జీ ప్రకటించారు. అధీర్ రంజన్ నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్, CPM మాత్రం ఇండియా కూటమితో లేవని ఆరోపించారు. అవి బీజేపీతో జత కట్టాయని దీదీ మండిపడ్డారు. తామే మరోసారి బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడంతో ఇండియా కూటమికి దీదీ దూరంగా ఉంటున్నారు.

News May 15, 2024

పీవోకేను తప్పక స్వాధీనం చేసుకుంటాం: అమిత్ షా

image

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పీవోకేను పాకిస్థాన్ నుంచి తిరిగి తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పామని చెప్పారు. పీవోకేలో ప్రజలు కూడా తమను భారత్‌లో విలీనం చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. అక్కడి ప్రజలకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.

News May 15, 2024

IPL: ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఏ జట్టుకు ఎలా?

image

ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ చేరుకునే ఛాన్స్ హైద‌రాబాద్‌కు 87.3శాతం ఉన్నట్లు స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. చెన్నై-72.7%, బెంగళూరు- 39.3%, ఢిల్లీ-0.7%, ల‌క్నోకు 0.2 శాతం మేర అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇప్పటికే రాజస్థాన్, కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. మరోవైపు రేసు నుంచి ముంబై, గుజరాత్, పంజాబ్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. మరో 2 బెర్తుల కోసం SRH, CSK, RCB, DC, LSG పోటీ పడుతున్నాయి.

News May 15, 2024

రాష్ట్ర వ్యాప్త నిరసనలకు KCR పిలుపు

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను ఖండిస్తూ రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. క్వింటా వరి ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ రైతాంగాన్ని మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.

News May 15, 2024

టికెట్ కలెక్షన్ల కంటే పాప్‌కార్న్ ఆదాయమే ఎక్కువ!

image

అసలు కంటే సైడ్ బిజినెస్ నుంచే లాభాలను ఆర్జించింది PVR ఐనాక్స్ సంస్థ. బాక్సాఫీసు కలెక్షన్లు తగ్గడంతో FY24ను నష్టాలతో ముగించిన PVRకు పాప్‌కార్న్ సేల్స్ ఊరటనిచ్చాయి. FY24లో ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగం 21% వృద్ధిని నమోదు చేసింది. ఇది టికెట్ సేల్స్ (19%) కంటే ఎక్కువ. FY23లో రూ.1,618 కోట్లు ఉన్న ఆదాయం ఈసారి రూ.1,958 కోట్లకు చేరింది. కాగా B.O రెవెన్యూ రూ.3,915 కోట్ల నుంచి రూ.3,295 కోట్లకు తగ్గింది.

News May 15, 2024

వీసీల నియామకానికి ఈసీ అనుమతి

image

తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి ఇచ్చినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే వీసీల నియామకం జరగుతుందన్నారు. ఇప్పటికే అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. JNTUH, ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మ గాంధీ, ఆర్కిటెక్చర్(JNAFAU), తెలుగు, అంబేడ్కర్ వర్సిటీలకు కొత్త VCలను నియమించనున్నారు.

News May 15, 2024

మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ

image

వారణాసిలో PM మోదీపై ఇండిపెండెంట్‌గా పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. అతను అఫిడవిట్ సమర్పించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా తనను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వచ్చిన శ్యామ్.. ఆఖరి రోజైన నిన్న నామినేషన్ వేశారు. మోదీ, రాహుల్‌లను అనుకరిస్తూ ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ పేరు సంపాదించాడు. కొద్దికాలంగా మోదీ విధానాలను విమర్శిస్తూ వీడియోలు చేశాడు.

News May 15, 2024

EC వైఫల్యంతోనే అరాచకం: సజ్జల

image

AP: ఈసీ వైఫల్యంతోనే రాష్ట్రంలో దాడులు, అరాచకాలు జరిగాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనంతటికీ ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలన్నారు. ‘ఈసీ పక్షపాత ధోరణితోనే YCP నేతలపై దాడులు జరిగాయి. అధికారులను మార్చిన చోటే హింస చెలరేగింది. వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి.. టీడీపీ నేతలను యథేచ్ఛగా బయట తిరగనిచ్చారు. కౌంటింగ్ సందర్భంగా కూడా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News May 15, 2024

‘దేవర’ నుంచి క్రేజీ అప్‌డేట్

image

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ ‘దేవ‌ర‌’ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా ఒకరోజు ముందే 19న FearSongను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘పెను తుఫాను కోసం అంతా సెట్ చేశాం. FearSong మే 19న తీరాన్ని చుట్టుముట్టి సునామీని సృష్టిస్తుంది’ అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ కత్తి పట్టుకున్న మాస్ పోస్టర్‌ను జత చేశారు.