India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బోర్డు తీపికబురు అందించింది. నిన్నటితో ముగిసిన ఫీజు చెల్లింపు గడువును ఇవాళ్టి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థుల ప్రయోజనం కోసం కల్పించిన ఈ అవకాశం వినియోగించుకోవాలని.. ఇవాళ సాయంత్రం 6 గంటల్లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.
తెలుగు రాష్ట్రాల సీఎంలు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్మిక సోదరుల శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం ఎదుగుతోంది. సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘చెమట చుక్క.. కరిగిన కండరం.. శ్రమైక జీవన సౌందర్యం సకల తెలంగాణ ఆహార్యం. మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు’ అని సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ పెట్టారు.
‘హ్యారీపోటర్’ సినిమాలోని కోటను పోలిన కోట ఉక్రెయిన్‌లో ఉంది. ఆ సినిమా పేరిటే దాన్ని పిలుస్తున్నారు. తాజాగా రష్యా చేసిన దాడిలో ఆ కోట ధ్వంసమైంది. నలుగురు మృతిచెందగా 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 20 వరకు భవనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఈ దాడిలో ఇస్కందర్ బాలిస్టిక్ క్షిపణిని రష్యా వాడి ఉండొచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేశారు.
ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఫైన్ పడింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో ‘స్లో ఓవర్ రేట్’ కింద కెప్టెన్ పాండ్యకు రూ.24లక్షల జరిమానా పడింది. జట్టు ఆటగాళ్లకు సైతం 25% మ్యాచ్ ఫీజు లేదా రూ.6లక్షల ఫైన్ పడింది. ఈ సీజన్‌లో పాండ్యకు ఇది రెండో ఫైన్. మరోసారి ఇలాగే జరిగితే.. మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంటుంది. కాగా LSGతో మ్యాచ్‌లో ముంబై ఓడిన విషయం తెలిసిందే.
T20WC కోసం నిన్న ప్రకటించిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ ఎంపిక చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఫామ్‌లో లేకున్నా, MI కెప్టెన్‌గా ఫెయిల్ అవుతున్నా అతడికి BCCI ఛాన్స్ ఇచ్చింది. అయితే.. సీనియర్లు రోహిత్, కోహ్లీ తర్వాతి WCలో ఉండకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాండ్యను VCగా తీసుకొంటే రాబోయే WCలో కెప్టెన్‌గా అనుభవం సాధిస్తారనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కొందరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపరు. నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించగలదు. అనర్హులు ప్రజాప్రతినిధులుగా అందలమెక్కుతారు. ఓటు వేయకుంటే ప్రశ్నించే తత్వం కోల్పోతారు. ధైర్యంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులతో పోరాడలేరు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లే. అభ్యర్థుల పనితీరు నచ్చకపోతే నోటాకు ఓటేయొచ్చు. అందరూ బాధ్యతతో ఓటు వేయాలి.
127ఏళ్లుగా వ్యాపార రంగంలో రాణిస్తున్న ప్రతిష్ఠాత్మక గోద్రేజ్ గ్రూప్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. ఈ మేరకు కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. జమ్‌షెద్ గోద్రేజ్, ఆయన మేనకోడలు నైరికా హోల్కర్ సహా పలువురు గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌ను పర్యవేక్షిస్తారు. మరోవైపు గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG) ఛైర్మన్‌గా నాదిర్ గోద్రేజ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన అన్న ఆది గోద్రేజ్ కూడా GIGని పర్యవేక్షిస్తారు.
టీ20 వరల్డ్ కప్‌నకు పోటీ పడే జట్లలో ఇంగ్లండ్ టీమ్ భీకరంగా కనిపిస్తోంది. తుది జట్టులో 11మందిని చూస్తే.. బట్లర్, సాల్ట్, విల్ జాక్స్, బెయిర్‌స్టో, బ్రూక్, లివింగ్‌స్టన్, మొయిన్ అలీ, కరన్, ఆర్చర్, రషీద్, రీస్ టాప్లే ఉన్నారు. 10వ స్థానం వరకు బ్యాటింగ్ ఉండటం, ప్రతి ఆటగాడూ విధ్వంసకరంగా ఆడగలగడం ఈ టీమ్ ప్రత్యేకత. పేపర్‌పై బలంగా కనిపిస్తున్న ఈ ఇంగ్లండ్ జట్టు గ్రౌండ్‌లో ఎలా ఆడుతుందో చూడాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ నుంచి చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ విడుదల చేసింది. మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘ధర్మం కోసం యుద్ధం’ అని దీనికి క్యాప్షన్ ఇస్తూ పవన్ కత్తి పట్టుకుని నిల్చున్న పోస్టర్‌ను పోస్ట్ చేసింది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
దేశంలోని కీలక బ్యాంకులైన ICICI, ఎస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించాయి. సేవింగ్స్ అకౌంట్ లావాదేవీలు, చెక్ బుక్ జారీ, IMPS ట్రాన్స్‌ఫర్స్, డెబిట్ రిటర్న్‌ల ఛార్జీలు పెంచుతూ ICICI నిర్ణయం తీసుకుంది. ఎస్ బ్యాంకు కూడా సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలను సవరించింది. మినిమం బ్యాలెన్స్, ఏటీఎం, డెబిట్ కార్డు ఫీజు, క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచింది. నేటి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.
Sorry, no posts matched your criteria.