India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తన టీంలోకి కీలక వ్యక్తిని తీసుకోనున్నారు. డెమొక్రటిక్ అధ్యక్ష మాజీ అభ్యర్థి, యాంటీ వ్యాక్సిన్ యాక్టివిస్ట్ రాబర్ట్ కెన్నెడీని నామినేట్ చేశారు. ఆయనకు ఆరోగ్యశాఖను అప్పగించనున్నారు. మరోవైపు, జార్జియాకు చెందిన కాంగ్రెస్‌మెన్ డగ్ కొలిన్స్‌ను వెటరన్స్ ఎఫైర్స్ కోసం నామినేట్ చేశారు. ట్రంప్ ఈసారి తన క్యాబినెట్‌లోకి మస్క్ వంటి ప్రముఖులను తీసుకుంటున్న విషయం తెలిసిందే.

AP: కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ(D)లోని అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ వేడుక ఇవాళ జరగనుంది. లక్షన్నర మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఉ.8 గంటలకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, మ.2కు కొండ దిగువన సత్యరథం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే 9.2KM మేర గిరిప్రదక్షిణ జరగనుంది. భక్తులకు ఆహారం, పండ్లు, తాగునీరు, మజ్జిగ అందించేందుకు స్టాల్స్ సిద్ధం చేశారు.

SBI మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను 5 బేసిస్ పాయింట్ల(0.05 శాతం) మేర పెంచింది. దీంతో హౌస్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన ఏడాది కాల వ్యవధి MCLR 9 శాతానికి చేరింది. అలాగే 3, 6 నెలల రుణ రేట్లను అదే మేర పెంచింది. అయితే ఓవర్‌నైట్, నెల, రెండేళ్లు, మూడేళ్ల MCLR రేట్లను సవరించలేదు. పెరిగిన రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని SBI ప్రకటించింది.

జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పవర్ స్టార్ లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌లో పవన్ పాల్గొంటారని, దీంతో షూటింగ్ పూర్తవుతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది మార్చి 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూవీ విడుదల కానుంది.

TG: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రేపటి నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో ప్రతిరోజు ఉ.11:30 నుంచి మ.3 గంటల వరకు ప్రజల నుంచి సలహాలు, వినతులు స్వీకరించనుంది. రేపు నల్గొండ, ఈనెల 17న ఖమ్మం, 18న మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ విచారణ నిర్వహించనుంది.

AP: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు నేడు శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు గంధం, ఎల్లుండి ఉరుసు, 18న ముషాయిరా ఉంటాయని చెప్పారు. 20వ తేదీన రాత్రి ఊరేగింపు ఉంటుందన్నారు. ఇందుకోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ ఉత్సవాలకు రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

కేంద్రం అమలు చేస్తున్న ‘పీఎం ఇంటర్న్ షిప్’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో (నవంబర్ 15) ముగియనుంది. దీని ద్వారా ప్రభుత్వం టాప్-500 కంపెనీల్లో యువతకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివి, 21-24 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి ప్రభుత్వం నెలకు రూ.5వేలు స్టైఫండ్ ఇస్తుంది. https://pminternship.mca.gov.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

AP: గత ఏడాది జనవరి 22న నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’కి సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు APSLPRBని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఏడు ప్రశ్నలకు ‘కీ’లో ఇచ్చిన సమాధానాలు సరైనవి కావని, దీనివల్ల తాము అనర్హులయ్యామంటూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. కాగా 6,100 కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు.

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. <<14591707>>’భైరవం’ సినిమాలో<<>> వెన్నెల అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకుడు. ఇందులో సాయి శ్రీనివాస్‌కు ఆమె జంటగా నటిస్తున్నట్లు సమాచారం.

ఉదయం బ్రష్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం ప్రమాదకరమని డెంటిస్టులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల దంతాల ఎనామెల్‌ను దెబ్బతింటుందట. బ్రష్ చేయడం వల్ల దంతాలపై బ్యాక్టీరియా తొలగిపోయి సెన్సిటివ్‌గా మారతాయి. దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందట. అందుకే బ్రష్ చేసిన 30ని.షాల తర్వాత టీ లేదా కాఫీ తీసుకోవడం ఉత్తమం అంటున్నారు.
Sorry, no posts matched your criteria.