India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఈరోజు కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్సుందని HYD IMD పేర్కొంది.

* ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవాలి. రోజంతా ఆహ్లాదంగా ఉంటుంది.
* రోజూ సూర్యరశ్మిలో కాసేపు ఉండాలి. D విటమిన్ లభిస్తుంది.
* నిద్రలేవగానే హఠాత్తుగా బెడ్‌పై నుంచి లేవకూడదు. కళ్లు తిరిగే ప్రమాదం ఉంటుంది.
* మార్నింగ్ 30ని.లు ఎక్సర్‌సైజ్ చేస్తే మంచిది.
* ఆ రోజు ఏం చేయాలో పొద్దున్నే ప్లాన్ చేసుకోవాలి.

AP: రబీ సీజన్‌కు సంబంధించి సాగుచేసిన ప్రతి పైరునూ నమోదు చేసే ఈ-పంట కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ఠ నిడివి 50 మీటర్లలోపు పంట వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 15 నాటికి జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. ఏవైనా ప్రభుత్వ పరిహారాలు అందాలంటే ఇందులో నమోదుచేసుకోవడం తప్పనిసరి.

మూడో టీ20లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 145/8 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా 5 మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.

TG: కులగణన వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగిపోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్ లాంటిదని చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన జరగాలని అన్నారు. కొంత మంది దీనిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు APSRTC ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ RTC బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది. సీనియర్ సిటిజన్లకు 60ఏళ్ల వయసు పైబడి ఉండాలి. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని APSRTC తెలిపింది.

AP: గత వైసీపీ ప్రభుత్వం విమర్శించిన వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టిందని విశాఖ BJP MLA విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎన్నికల సమయంలో ఓ MLAపై విమర్శలు చేసినందుకు తనపైనా కేసులు పెట్టారని, అయితే తాను BJPలో ఉండటం వల్ల తప్పించుకోగలిగానని అన్నారు. లేకపోతే రఘురామకృష్ణరాజుకు ఇచ్చిన ట్రీట్మెంటే తనకూ తప్పేది కాదన్నారు.

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య చివరిదైన 4వ టీ20 జరగనుంది. ఈరోజు రాత్రి 8.30గంటలకు జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. జరిగిన 3 టీ20ల్లో 2 గెలిచిన భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆతిథ్య సఫారీ జట్టేమో ఇందులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.
> ALL THE BEST INDIA

AP: మొన్న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ సమాధానం ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బిల్లు, ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు.

AP: రాష్ట్రంలో ఆటిజం లక్షణాలున్న పిల్లలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ వెల్లడించారు. మొదటి రెండేళ్లలో లక్షణాలను గుర్తిస్తే దీన్ని నివారించగలమని అసెంబ్లీలో అన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లో పాటిస్తున్న తీరును పరిశీలిస్తామని తెలిపారు. ఆటిజం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చేందుకు యత్నిస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.