News April 29, 2024

రీల్స్ చేస్తూ.. కాలువలో పడి కొట్టుకుపోయింది

image

UPలోని లక్నోలో విషాదం జరిగింది. 19ఏళ్ల మనీషా ఖాన్ ఇందిరా కెనాల్‌పై తన సోదరి, స్నేహితురాలితో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం డాన్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో సోదరి నిషా ఖాన్, దీపాలి 112 ఎమర్జెన్సీ సర్వీస్‌ను సంప్రదించారు. అయితే కాలువలో గజ ఈతగాళ్లతో వెతికించినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు.

News April 29, 2024

బాబుకి ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి: CM జగన్

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుకి ఓటేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లిలోని చోడవరంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2014లో చంద్రబాబుకి ఓటేస్తే అన్ని వర్గాలను మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని జగన్ ఆరోపించారు. భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. బాబు వస్తే వర్షాలు కూడా రావని అన్నారు.

News April 29, 2024

రివేంజ్ తీర్చుకున్న CSK ఫ్యాన్స్

image

హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ రివేంజ్ తీర్చుకున్నారు. గత మ్యాచ్‌లో SRH గెలవడంతో ‘సైలెన్స్’ అంటూ చెన్నై అభిమానులను హైదరాబాద్ ఫ్యాన్స్ నోరుమూయించారు. నిన్న CSK గెలవడంతో చెన్నై ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సైలెన్స్ అంటూ SRH ఫ్యాన్స్‌పై రివేంజ్ తీర్చుకున్నారు. స్టేడియంలో సీఎస్‌కే.. సీఎస్‌కే అంటూ నినదించారు. భీకర ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

News April 29, 2024

హార్వర్డ్‌లో అమెరికా పతాకం స్థానంలో పాలస్తీనా జెండా

image

పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొంతమంది దుండగులు అమెరికా జెండాను దించి, పాలస్తీనా పతాకాన్ని ఎగురవేశారు. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలు తెంచుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. హార్వర్డ్ మేనేజ్‌మెంట్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. దీనికి కారణమైన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేసింది.

News April 29, 2024

ఒక్కసారి.. ఆలోచించండి, పరిశీలించండి!

image

Way2News పాపులారిటీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మా లోగోతో ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. వాటిని విశ్వసిస్తే ఇబ్బంది పడే ప్రమాదముంది. Way2News లోగోతో మీరు పొందే ఫార్వర్డ్ స్క్రీన్‌షాట్లను సులువుగా వెరిఫై చేయొచ్చు. మా ప్రతి వార్తకు యునిక్ కోడ్ ఉంటుంది. fc.way2news.comలో ఆ కోడ్ ఇస్తే సేమ్ ఆర్టికల్ చూపాలి. లేదంటే ఆ స్క్రీన్‌షాట్ ఫేక్. అలాంటి వాటిని grievance@way2news.comకు మెయిల్ చేయండి.

News April 29, 2024

తగ్గిన బంగారం ధరలు

image

ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.330 తగ్గి రూ.72,600కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.66,550గా నమోదైంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కేజీ వెండి ధర రూ.87,500గా ఉంది.

News April 29, 2024

GREAT: గురుదక్షిణగా రూ.12 లక్షల కారు

image

AP: చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పి తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువును మరువలేదు ఈ పూర్వ విద్యార్థులు. గురువు రిటైర్మెంట్ అవుతుండటంతో గురుదక్షిణగా రూ.12 లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. పల్నాడు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు జేమ్స్‌ గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయలో పనిచేశారు. ఏప్రిల్‌ 30తో ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఆ నవోదయ పూర్వ విద్యార్థులు తమ గురువును సత్కరించి కారు అందజేశారు.

News April 29, 2024

రేప్ చేసి.. రాడ్డుతో ముఖంపై పేరు రాసి

image

UPలోని లఖీంపుర్ ఖేరీలో అమన్(22) ఓ యువతిని(17) ప్రేమిస్తున్నానని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఈనెల 19న బంధించి 3రోజులు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై ఇనుప రాడ్డుతో తన పేరు రాసి రాక్షసానందం పొందాడు. ఎట్టకేలకు బాధితురాలు ఆ చెర నుంచి బయటపడటంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అతడు HYDలోని ఓ సెలూన్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

News April 29, 2024

ఒక్కప్పుడు అవినీతి ఆరోపణలే సంచలనం.. కానీ ఇప్పుడు: మోదీ

image

అవినీతి ఈరోజుల్లో సర్వసాధారణంగా పరిగణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు ప్రధాని మోదీ. ‘ఒకప్పుడు ఆరోపణలే దేశాన్ని కుదిపేసేవి. కానీ ఇప్పుడు నేరం రుజువై శిక్ష అనుభవించినా కొందరు చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులు ఇస్తున్నారు. అది అవినీతిని గొప్పగా చెప్పుకుంటున్నట్లు కాదా? అవినీతిని సర్వసాధారణంగా పరిగణించొద్దు. అలా చేస్తే దేశానికి ఎంతో నష్టం. ఇది కేవలం బీజేపీ vs ప్రతిపక్షాలు కాదు’ అని పేర్కొన్నారు.

News April 29, 2024

‘వాషింగ్ మెషీన్’ ఆరోపణలపై స్పందించిన మోదీ

image

బీజేపీతో చేతులు కలిపితే నేతలపై ఉన్న కేసులు తొలగిపోతాయని, ఆ పార్టీ ‘వాషింగ్ మెషీన్’ అని వస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. BJPలో చేరిన 25 మందిలో 23 మందిపై దర్యాప్తు నిలిచిపోయిందన్న ఓ మీడియా కథనంపై స్పందిస్తూ.. ఒక్క కేసు దర్యాప్తు కూడా ఆగలేదన్నారు. ‘కోర్టులు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. అయినా ఇలాంటి కేసులు కేవలం 3శాతమే ఉన్నాయి. వాటి విషయం ఏజెన్సీలు, కోర్టులు చూసుకుంటాయి’ అని తెలిపారు.