India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌తో పాటు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, కాలును సాగదీసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనే ముందుజాగ్రత్తలు పాటించాలని వారు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా అయ్యర్ ఇటీవల వెన్నునొప్పితో సతమతమయ్యారు. దీంతో ఇంగ్లండ్‌తో సిరీస్ మధ్యలో వైదొలిగిన విషయం తెలిసిందే.
నిన్న ప్రధాని మోదీ ఏపీ పర్యటన వివాదాస్పదంగా మారింది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాని ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉపయోగించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ TMC ఎంపీ సాకేత్ గోఖలే ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ కారణంతోనే 1975లో ఇందిరాగాంధీపై అనర్హత వేటు పడిందని చెప్పారు. ఒక వేళ బీజేపీ IAF చాపర్‌కు రెంట్ చెల్లించి ఉంటే.. దానికి గల కారణాలను కూడా ఈసీ వెల్లడించాలని కోరారు.
ఆర్సీబీ మహిళల జట్టు WPL కప్పును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అందుకు శుభాకాంక్షలు చెప్పే బదులు పురుషుల జట్టును ట్రోల్ చేసేలా రాజస్థాన్ రాయల్స్ ఓ ట్వీట్ చేసింది. పురుషులు చేయలేనిది మహిళలు చేశారన్న అర్థం వచ్చేలా ఆ పోస్టు ఉంది. దానిపై ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం తీరు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.
AP: బొప్పూడిలో నిన్న జరిగిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలున్నాయని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘దేశ ప్రధాని హాజరైన ప్రజాగళం సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కలెక్టర్, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేర్లు, ఫొటోలు లేకుండానే ఇష్టారీతిన పాస్‌లు జారీ చేశారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు.
మంచు ఖండం అంటార్కిటికాలో ఓ జాబ్ ఆఫర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ అక్కడ పోర్ట్ లాక్‌రాయ్‌లోని పోస్ట్ ఆఫీసులో పనిచేసేందుకు ఐదుగురు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది. మెయిల్స్ నిర్వహణ, పెంగ్విన్లను లెక్కపెట్టడమే వీరి పని. ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య ఐదు నెలల పాటు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే కోసం పనిచేయాలట. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
AP: 23 ప్రభుత్వ వెబ్‌సైట్లలో CM జగన్, మంత్రుల ఫొటోలు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి TDP రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ‘ఈ నెల 16వ తేదీ మ.3 గంటల నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫొటోలు ఉండరాదు. కానీ ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఇంకా సీఎం, మంత్రుల చిత్రాలు ఉన్నాయి. వెంటనే వాటిని తొలగించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
AP: ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి 20 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని, 25 సభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్నికల బహిరంగసభల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నాయి.
బ్రెజిల్‌లోని రియోలో రికార్డు స్థాయిలో 62.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తాజాగా నమోదైంది. 2014లో రియో ఉష్ణోగ్రత నమోదు ప్రక్రియ మొదలైన తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఉష్ణోగ్రత 60ల్లో ఉన్నా, ఉక్కబోత కారణంగా 100 డిగ్రీల సెల్సియస్‌లా అనిపిస్తుందని అధికారులు తెలిపారు. అక్కడ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు తరచూ నమోదవుతున్నాయన్నారు. వేడికి తాళలేక రియో వాసులు భారీ సంఖ్యలో బీచ్‌లకు చేరుకుంటున్నారు.
సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని పలు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ (CSITE) సమీక్ష నిర్వహించిన అనంతరం RBI ఈ సూచనలు చేసింది. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని RBI డిప్యూటీ గవర్నర్ రవి శంకర్ సైతం ఇటీవల పేర్కొనడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.