News March 31, 2024

యశ్‌కు సిస్టర్‌గా కరీనా కపూర్?

image

యశ్ హీరోగా మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ‘టాక్సిక్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించనుందంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. మూవీలో కరీనా యశ్‌ సోదరి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక యశ్ సరసన కియారా అద్వానీ నటించనుందని సమాచారం. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

News March 31, 2024

నేడు హస్తినకు షర్మిల

image

APCC చీఫ్ షర్మిల ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. AICC నేతలతో ఆమె భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇటీవల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర కాంగ్రెస్.. వాటిని స్క్రూటినీ చేసింది. ఇవాళ ఢిల్లీ పెద్దలతో చర్చించి, ఆ జాబితాను ఫైనల్ చేయనున్నారు. మరోవైపు మరో నలుగురు MP అభ్యర్థులను ఖరారు చేసేందుకు TG CM రేవంత్ రెడ్డి కూడా హస్తిన వెళ్లనున్నారు.

News March 31, 2024

OTTలోకి బ్లాక్‌బస్టర్ మూవీ!

image

మాలీవుడ్‌లో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ ఏప్రిల్ 5 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో మలయాళంలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనుంది. లోతైన గుహలో జారిపడిన యువకుడిని స్నేహితులు ఎలా కాపాడారన్న అంశంతో వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

News March 31, 2024

మెడికల్ కాలేజీల్లో 5,819 పోస్టుల భర్తీకి ఈసీ అనుమతి

image

TG: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5,819 ఉద్యోగాల భర్తీకి ఈసీ అనుమతి ఇచ్చింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్సుల పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలని స్పష్టం చేశారు.

News March 31, 2024

సత్తెనపల్లి గడ్డపై సత్తా చాటేదెవరో?

image

AP: రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న నియోజకవర్గం పల్నాడు(D) సత్తెనపల్లి. ఇక్కడ అభ్యర్థికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఇక్కడి నుంచే 2సార్లు ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాంగ్రెస్ 4సార్లు, స్వతంత్రులు 3సార్లు, CPM, TDP 2సార్లు, CPI, YCP ఒక్కోసారి నెగ్గాయి. ఈసారి రాజకీయాల్లో తలపండిన అంబటి రాంబాబు (YCP), కన్నా లక్ష్మీనారాయణ(TDP) ఢీకొంటున్నారు.
#ELECTIONS2024

News March 31, 2024

ఉద్యోగులకు రేపు ఆప్షనల్ సెలవు

image

TG: షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా ఉద్యోగులకు ఏప్రిల్ 1న ఆప్షనల్ సెలవును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో మార్చి 31న సెలవును(ఇవాళ) ప్రకటించగా, తాజాగా దాన్ని సవరించింది.

News March 31, 2024

యుద్ధప్రాతిపదికన పెన్షన్లు పంపిణీ చేయాలి: అచ్చెన్నాయుడు

image

AP: సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒకటో తేదీనే యుద్ధప్రాతిపదికన పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వాలంటీర్లను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం వల్లే వారిని పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించిందన్నారు. వారు సస్పెన్షన్‌కు గురి కావడానికి సీఎం జగన్ కారణమయ్యారని విమర్శించారు.

News March 31, 2024

విమానం ఒక రోజు ఆలస్యం.. ఎయిర్ ఇండియాకు రూ.85,000 ఫైన్

image

విమాన ఆలస్యంపై ఓ ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుపై ముంబై వినియోగదారుల కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అతనికి రూ.85,000 పరిహారం చెల్లించాలని ఎయిర్ ఇండియాకు స్పష్టం చేసింది. 2018లో బ్యాంకాక్ నుంచి ముంబై బయలుదేరాల్సిన విమానం ఒక రోజు ఆలస్యమైంది. సంస్థ నిర్లక్ష్యానికి తాను మానసిక వేదనకు గురయ్యానని, ఒక వర్క్ డే‌ను కోల్పోయానని మోహిత్ నిగమ్(33) ఫిర్యాదు చేశారు. సుదీర్ఘంగా విచారించిన కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

News March 31, 2024

AP, TG సీపీఎం ఎంపీ అభ్యర్థుల ప్రకటన

image

దేశంలో 44 లోక్‌సభ స్థానాలకు CPM అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలోని అరకుకు పాచిపెంట అప్పలనరస, TGలోని భువనగిరికి జహంగీర్‌ పేర్లను ఖరారు చేసింది. బెంగాల్‌లో 17, కేరళలో 15, తమిళనాడులో 2, మిగతా రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థిని CPM ప్రకటించింది. బిహార్, రాజస్థాన్, బెంగాల్, త్రిపురలో INDIA కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న CPM.. అండమాన్, అస్సాం, ఝార్ఖండ్, కర్ణాటక, పంజాబ్‌లోవామపక్ష కూటమితో బరిలోకి దిగుతోంది.

News March 31, 2024

ఎన్నికల్లో పోటీపై 3న నిర్ణయం: సుమలత

image

లోక్‌సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి మరోసారి పోటీపై వచ్చే నెల 3న తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సిట్టింగ్ ఎంపీ, సినీ నటి సుమలత పేర్కొన్నారు. 2019లో బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా నెగ్గిన ఈమె.. ఈసారి ఎన్డీఏ తరఫున టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఈ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడంతో మాజీ సీఎం కుమారస్వామి పోటీ చేస్తున్నారు.