News March 30, 2024

తాగునీటికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

image

TG: వేసవిలో నీటిఎద్దడి లేకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సీజన్‌లో తాగునీటి అవసరాలకు రూ.140 కోట్ల నిధులు విడుదల చేసింది. పురపాలక శాఖకు రూ.40 కోట్లు, గ్రామపంచాయతీలకు రూ.100 కోట్లు కేటాయించింది. మరోవైపు నీటి సరఫరాపై అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ విషయమై సీఎస్ శాంతికుమారి అధికారులతో రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

News March 30, 2024

డీఎస్సీ వాయిదా.. నిరుద్యోగుల ఆవేదన

image

AP: డీఎస్సీ వాయిదా పడటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 23వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డీఎస్సీ వేస్తామని ఐదేళ్ల క్రితం సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ వేయలేదని ఫైరవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఫిబ్రవరిలో 6,100 పోస్టులకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఆగిపోయిందంటున్నారు.

News March 30, 2024

డిసెంబర్‌లో ప్రభాస్-సందీప్ సినిమా ప్రారంభం

image

సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించనున్నారు.

News March 30, 2024

మేం తలచుకుంటే 60మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి: ఈటల

image

తాము తలచుకుంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి 60మంది ఎమ్మెల్యేలను చేర్చుకోగలమని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌తో మా ఎమ్మెల్యేలు 8మంది టచ్‌లో ఉంటే, మాకు 60మంది కాంగ్రెస్ వాళ్లను తీసుకోవడం పెద్ద విషయం కాదు. కేసీఆర్‌ తరహాలోనే రేవంత్ సర్కారు కూడా నేతల్ని కొంటోంది. వారు వచ్చి 100 రోజులు దాటింది. హామీల్ని ఎందుకు నెరవేర్చడం లేదు?’ అని ప్రశ్నించారు.

News March 30, 2024

భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు

image

TG: రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకు రూ.20కి అరడజను పెద్దసైజు నిమ్మకాయలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.40-రూ.50కి అమ్ముతున్నారు. విడిగా అయితే పెద్దసైజు నిమ్మకాయ రూ.10, చిన్న సైజుదైతే రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

News March 30, 2024

కేజ్రీవాల్‌ కోసం రేపు ఢిల్లీలో ‘ఇండియా’ సభ

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 13పార్టీల నేతలు దీనిలో పాల్గొననున్నారు. తాన్‌షాహీ హఠావో-లోక్‌తంత్ర బచావో అన్న నినాదంతో ఈ సభను నిర్వహిస్తామని కూటమి నేతలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, తృణమూల్ ఎంపీ ఒబ్రెయిన్ సహా పలువురు ప్రముఖులు సభకు హాజరుకానున్నారు.

News March 30, 2024

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఉ.10 నుంచి మ.12 గంటల వరకు నిర్వహిస్తామంది. ఐదో తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎంపికైన వారికి విద్యాభ్యాసం ఇంగ్లిష్‌లోనే ఉంటుందని వెల్లడించింది.
వెబ్‌సైట్: <>https://apms.apcfss.in/<<>>

News March 30, 2024

ఫసల్ బీమా స్కీమ్.. రాష్ట్ర వాటా రూ.1500 కోట్లు!

image

TG: రాష్ట్రంలో PM ఫసల్ బీమా యోజన పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రీమియంలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రతి సీజన్‌కు ₹1500 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అలాగే రాష్ట్రమంతటా ఒకే బీమా విధానం కాకుండా ప్రాంతం, పంటల ఆధారంగా వేర్వేరు ప్రీమియంలు ఉండాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక ఇచ్చింది.

News March 30, 2024

జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం: ఈసీ

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై EC ఆంక్షలు విధించింది. తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19 నుంచి చివరి దశ పోలింగ్ రోజైన జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి లేదని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల అంచనాలు, సర్వేలు ప్రసారం చేయొద్దని ఆదేశించింది.

News March 30, 2024

బీజేపీ ఎమ్మెల్యేలూ టచ్‌లో ఉన్నారు: కోమటిరెడ్డి

image

బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. విపక్షాల నేతలు వారి వారి పార్టీలతో విసుగెత్తిపోయారని అభిప్రాయపడ్డారు. ‘ఈ వరద ఇప్పట్లో ఆగదు. ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అవుతున్నాయి. మేం గేట్లు తెరవలేదు. నేతలే గేట్లను బద్దలుగొట్టి మరీ పార్టీలో చేరుతున్నారు. 12మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’ అని స్పష్టం చేశారు.