India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(CMAT)కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏదైనా డిగ్రీ పాసైన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఏప్రిల్ 18లోపు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.2,000, మిగతా అందరూ రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలి. మేలో పరీక్ష జరిగే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: <
‘జయం’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో నితిన్. నేడు ఆయన పుట్టినరోజు. దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, ఆ ఆ, భీష్మ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో రాబోయే సినిమాలపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నారు.
యూపీలో విషాదం చోటు చేసుకుంది. దేవరియా(D) డుమ్రిలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి తల్లితో సహా ముగ్గురు చిన్నారులు మరణించారు. చాయ్ పెడుతున్న సమయంలో గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. స్టార్ బాయ్ సిద్ధూ రికార్డులు బద్దలు కొడుతున్నాడని పేర్కొంది. కాగా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది.
IPL: ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 5 సార్లు టైటిల్ సాధించిన ముంబైపై భారీ స్కోర్ సాధించిందని గుర్తు చేస్తున్నారు. వరల్డ్ కప్ హీరోలు కమిన్స్, హెడ్‌తో పాటు ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ టీ20 బ్యాటర్ క్లాసెన్ జట్టులో ఉన్నారని చెబుతున్నారు. దేశీయ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా రాణిస్తున్నారని.. బౌలింగ్ కాస్త మెరుగు పడితే తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు.
స్మార్ట్ టీవీల ధరలు ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్స్ ఐవోటీ సర్వీస్ వెల్లడించింది. అయితే ప్రీమియం మోడల్స్‌కు దేశంలో డిమాండ్ ఉండడంతో స్మార్ట్‌టీవీ దిగుమతులు 9శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో టీవీల విక్రయాలు దూసుకుపోతున్నాయి.
ప.బెంగాల్‌లోని బెర్హంపూర్ TMC MP అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కి ఈసీ షాకిచ్చింది. 2011 WC ఫొటోలను ఎన్నికల ప్రచారంలో వాడొద్దని తెలిపింది. ఆ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించింది. సచిన్ ఫొటోలతో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అతనిపై ఫిర్యాదు చేయగా, EC చర్యలు తీసుకుంది. కాగా తానూ WCలో ఆడినందున ఆ చిత్రాలను వాడుకునే హక్కు తనకు ఉందని యూసుఫ్ అంటున్నారు.
టాలీవుడ్ హీరో నితిన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ‘తమ్ముడు’ టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
RCBపై గెలుపు తర్వాత KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆట సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో బౌండరీలు కొట్టడం చాలా కష్టమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది’ అని చెప్పారు. RCB ఓటమికి ఇదే కారణమని, ఒకవేళ ఛేజింగ్ అయితే పక్కా గెలిచేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు?
వివాహ వేడుకలో భార్య డాన్స్ చేయొద్దన్నందుకు మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(D) చిన్నఆరేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో కూలీ పని చేసే అనిల్ దంపతులు స్వగ్రామం చిన్నఆరేపల్లిలోని బంధువుల పెళ్లికి వెళ్లారు. రాత్రి బరాత్‌లో డాన్స్ వెయ్యొద్దని భార్య చెప్పడంతో ఆవేశంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.