India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్‌లో తాను ఏక్‌నాథ్ షిండే అవుతానంటూ BJP MLA మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటరిచ్చారు. ‘నాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సత్యదూరమైనవి. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరతానని ఆయనే అడిగారు. మాకు మెజార్టీ ఉంది కాబట్టి అవసరం లేదని చెప్పా. పార్టీలో చేర్చుకోలేదని ఏదేదో మాట్లాడుతున్నారు. అమిత్ షా, గడ్కరీ వద్దకు వెళ్లి ఏదో చెప్పానని అంటున్నారు’ అని మండిపడ్డారు.
క్లిష్టమైన పరీక్షల్లో సివిల్స్ ఒకటి. ఈ పరీక్షలో ఫెయిల్ అయినా.. IAS అయిన కేరళకు చెందిన అబ్దుల్ నాసర్ గురించి మీకు తెలుసా? ఆయన 5 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగారు. ఎన్నో సవాళ్ల నడుమ పీజీ పూర్తి చేశారు. 1994లో ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన.. వృత్తిపరంగా కనబర్చిన నిబద్ధత, కృషికి గాను 2006 నాటికి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. 2017లో IAS హోదా పొంది తన కలను నెరవేర్చుకున్నారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు పోలీస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరిద్దరూ 48 గంటలపాటు జైలులో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత లంచగొండుల గురించి ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోన్న ఎస్సై సైదులు లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు. ఓ రియల్టర్‌పై నమోదైన కంప్లైంట్‌ను ఉపసంహరించుకునేందుకు సైదులు రూ.10వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.
AP: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.
USలో పూర్వం సంచరించిన భారీ మనుషుల అస్థిపంజరాలపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. 1912-1924 మధ్య కాలంలో నెవాడాలో మైనింగ్ చేస్తుండగా 8 నుంచి 10 అడుగుల ఎత్తు మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్టులో మాదిరిగానే మమ్మిఫికేషన్ చేశారు. Si-Te-Cah అని పిలిచే ఈ నరమాంస భక్షకులు 15 అంగుళాల చెప్పులు, ఒక ముద్ర కలిగిన పెద్ద బండరాయిని ధరించేవారట. వీరు నివసించిన ప్రాంతంలోనే Paiute తెగ జీవించిందని గుర్తించారు.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతను ఝార్ఖండ్ మాజీ CM హేమంత్ సోరెన్ భార్య కల్పన కలిశారు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో సునీతకు తన సానుభూతిని తెలిపారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత స్పందించిన కల్పన.. సునీత బాధను తాను అర్థం చేసుకోగలనంటూ మద్దతుగా నిలిచారు.
AP: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం పోలీసులు షాక్ ఇచ్చారు. ‘వారాహి’ సభకు అనుమతి నిరాకరించారు. వారాహి వాహనంపై నిల్చొని మాట్లాడొద్దని సూచించారు. నిర్ణీత సమయంలో వాహనం కోసం దరఖాస్తు చేసుకోనందుకే అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు. చిన్నపాటి వాహనానికి అనుమతించారు. కాగా పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో(LSG) జట్టు ప్లేయర్‌ను మార్పు చేసింది. వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్న డేవిడ్ విల్లీ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్‌ను తీసుకుంది. రూ.1.25 కోట్ల బేస్ ప్రైజ్‌తో NZ బౌలర్ హెన్రీ లక్నో జట్టుతో చేరారు. గతంలో పంజాబ్ కింగ్స్, CSK జట్లలో భాగమైన హెన్రీ.. పంజాబ్ తరఫున మాత్రమే 2 మ్యాచ్‌లు ఆడారు.
అమెరికాకు చెందిన యూట్యూబర్ ఓ టెర్రరిస్ట్ నాయకుడిని ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారాడు. హైతీకి చెందిన గ్యాంగ్ లీడర్ బార్బెక్యూను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్ హైతీకి వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లిన కాసేపటికే మరో గ్యాంగ్ అతడిని కిడ్నాప్ చేసి 6 లక్షల డాలర్లు డిమాండ్ చేసింది. కాగా అడిసన్‌కు యూట్యూబ్‌లో 1.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇతడు భయంకర ప్రదేశాలను అన్వేషిస్తుంటాడు.
Sorry, no posts matched your criteria.