News March 31, 2024

ట్విటర్‌లో ‘Click Here’ మీరూ ట్రై చేయండి..

image

మొదటగా Click Here ఇమేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత <<12959778>>ట్విటర్<<>> ఖాతా ఓపెన్ చేయగానే ‘పోస్ట్‌’ని క్లిక్ చేయండి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ హియర్ ఇమేజ్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇమేజ్ కింద ట్యాగ్, డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ సెలక్ట్ చేసుకోండి. పైన Alt అని చూపిస్తుంది. ఆ తర్వాత డిస్క్రిప్షన్‌ ఇవ్వండి. రైట్ కార్నర్‌లో సేవ్ చేసిన తర్వాత మీరు పోస్ట్ చేయాలి.

News March 31, 2024

BREAKING: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

image

TG: రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. తన కూతురు కావ్యతో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. నిన్న హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరగా.. ఆమె తండ్రి, సీనియర్ నేత కె.కేశవరావు త్వరలోనే ఆ పార్టీలోకి వెళ్లనున్నారు.

News March 31, 2024

పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. వన్డేలు, టీ20లకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్ కమిటీలోని సభ్యులందరూ బాబర్ పేరునే ప్రతిపాదించారని, దీంతో పీసీబీ ఛైర్మన్ అతడిని కెప్టెన్‌గా నియమించినట్లు పేర్కొంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ అనంతరం బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

News March 31, 2024

ఇప్పుడే పెళ్లి చేసుకో.. లేదంటే ఎన్నికల తర్వాత జైలుకే: అస్సాం సీఎం

image

తనకు 74 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకునేంత సత్తా ఉందని దుబ్రి ఎంపీ, AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం హిమంత సెటైర్లు వేశారు. ‘ఆయన కావాలనుకుంటే ఇప్పుడే మరో పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఎన్నికల తర్వాత జైలుకు వెళ్లాల్సి వస్తుంది. త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్‌ను రాష్ట్రంలో అమలు చేస్తాం. అప్పుడు బహుభార్యత్వం చట్టవిరుద్ధం అవుతుంది’ అని తెలిపారు.

News March 31, 2024

వాలంటీర్లూ జర జాగ్రత్త

image

AP: వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సస్పెన్షన్‌కు గురవుతున్న సంఘటనలు చూస్తున్నాం. అయితే ఇది వారి భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. చాలా మంది వాలంటీర్లుగా పని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. పబ్లిక్ సర్వెంట్ కేటగిరీలోకి వచ్చే వీరిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెన్షన్ వేటు పడినా, ఉద్యోగం కోల్పోయినా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరిస్తున్నారు.

News March 31, 2024

వామ్మో.. ఉబర్ ప్రయాణికుడికి రూ.7.6 కోట్ల బిల్

image

ఉబర్ ఛార్జీ చూసి ప్రయాణికుడి గుండె గుభేల్‌మంది. ఉబర్ ఆటోలో ప్రయాణించిన అతడికి ఏకంగా ₹7.6 కోట్ల ఛార్జీ చూపించింది. నోయిడాకు చెందిన దీపక్ ఆఫీస్‌కు వెళ్లేందుకు ఉబర్ ఆటో బుక్ చేసుకున్నారు. మొదట ఛార్జీ ₹62 చూపించగా.. ట్రిప్ పూర్తయ్యేసరికి రూ.7,66,83,762లు చూపించింది. దీంతో షాక్‌కు గురైన దీపక్ ఈ విషయాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. టెక్నికల్ ఇష్యూతోనే ఇలా జరిగిందని ప్రయాణికుడికి ఉబర్ క్షమాపణలు చెప్పింది.

News March 31, 2024

ట్విటర్‌ ట్రెండింగ్‌లో ‘Click Here’

image

ట్విటర్‌లో ‘Click Here’ అనే ఇమేజ్ ట్రెండ్ అవుతోంది. రాజకీయ, సినీ ప్రముఖులు, సంస్థలు, ఎంటర్‌టైన్మెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. అయితే ఇది కేవలం Alt ఇమేజ్ టెక్స్ట్ అన్నమాట. ‘Click Here’ ఇమేజ్ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో Alt అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ ట్విటర్ యూజర్ చెప్పాలనుకున్న సందేశం కనిపిస్తుంది. దీన్ని Alt Text లేదా ఇమేజ్ డిస్క్రిప్షన్ అని కూడా అంటారు.

News March 31, 2024

స్కాలర్‌షిప్ దరఖాస్తుకు నేడు చివరి తేదీ

image

TG: SC, ST, BC, PWD విద్యార్థుల ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. 5-10 తరగతులు చదువుతోన్న వారు 2024-25 విద్యాసంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినందున మరో ఛాన్స్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. స్కాలర్‌షిప్ రెన్యువల్ చేసుకోవాల్సిన వారికీ ఇదే చివరి అవకాశం.
రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వెబ్‌సైట్: https://telanganaepass.cgg.gov.in/

News March 31, 2024

ముగిసిన టెన్త్ పరీక్షలు.. రేపటి నుంచి మూల్యాంకనం

image

AP: నిన్నటితో రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 18న ప్రారంభమైన ఎగ్జామ్స్‌కు 6,18,822 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. సుమారు 50 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి 25వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

News March 31, 2024

BIG ALERT: ఈ మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. నిన్న 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 52 మండలాల్లో వడగాలులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 33 మండలాలు, రేపు 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వడగాలుల ప్రభావం ఉండే మండలాల జాబితాను ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుసుకోండి.