India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న CSK ఇవాళ్టి మ్యాచ్‌లో ధోనీకి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కి కెప్టెన్ కూల్ దూరంగా ఉండగా.. తెలుగు క్రికెటర్ అరవెల్లి అవనీశ్‌రావు కీపింగ్ ప్రాక్టీస్ చేశారు. దీంతో ఇవాళ ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో అవనీశ్ అరంగేట్రం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ యంగ్ క్రికెటర్ U-19 వరల్డ్ కప్‌లో బ్యాటింగ్, కీపింగ్‌లో సత్తా చాటారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 రోజుల వ్యవధిలోనే రైతులు ఏడ్చే పరిస్థితికి వెళ్తారని తాను అనుకోలేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వైఖరి కారణమని దుయ్యబట్టారు. అనేక జిల్లాల్లో పంటలు ఎండిపోయాయని దుయ్యబట్టారు.
TG: పల్లెల్లో బోరు బండ్ల హోరు వినిపిస్తోందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ‘గత ఎనిమిదేళ్లు బోరు బండ్లు కనపడలేదు. ఇప్పుడు లక్షల ఎకరాల పంటలు ఎండుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టట్లేదు. అసత్య ప్రచారాలు చేయడమే వారికి పనిగా మారింది. రాజకీయాలు చేద్దాం. మేమూ పదేళ్లు అధికారంలో ఉన్నాం. అధికారం వస్తుంది.. పోతుంది. అది గొప్ప విషయం కాదు. రైతులు ముఖ్యం’ అని కేసీఆర్ తెలిపారు.
AP: పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘వైసీపీపై వ్యతిరేకత ఉంటే పవన్ మళ్లీ భీమవరం, గాజువాకలో ఎందుకు పోటీ చేయడం లేదు? ఇప్పుడు పిఠాపురంలో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. చంద్రబాబువి నీచ రాజకీయాలు. వాలంటీర్లపై ఆయన కక్ష పెంచుకున్నారు. కక్షతోనే పెన్షన్లు అడ్డుకోవాలని చూశారు.’ అని ఆయన మండిపడ్డారు.
తమ పాలనలో లేని ట్యాంకర్లు, బిందెలు ఇప్పుడు ఎందుకు బయటికొచ్చాయంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘రూపాయికే నల్లా కనెక్షన్, ఫ్రీ వాటర్ ఇచ్చాం. 35వేల కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్ రంగాన్ని బాగుచేశాం. 24 గంటలూ కరెంట్ ఇచ్చాం. స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే అధికార పార్టీ అవివేకం, తెలివితక్కువతనం, అవగాహనారాహిత్యం క్లియర్‌గా కనిపిస్తోంది. ఉన్న కరెంటును, మిషన్ భగీరథను వాడే తెలివి లేదు’ అని మండిపడ్డారు.
AP: వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి విమర్శలు చేశారు. నా బీసీ అంటూ సీఎం జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ మాట ఆయన పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2లక్షలకు పైగా రుణ భారం ఉందన్నారు. ఇవి సరిపోవన్నట్టుగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నారని విమర్శించారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమవ్వగా.. సమద్(29*) అభిషేక్(29), క్లాసెన్(24) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ 3, ఒమర్జాయ్, ఉమేశ్, రషీద్, నూర్ తలో వికెట్ తీశారు. GT టార్గెట్ 163.
AP: వాలంటీర్లపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ‘కోడ్ ఉల్లంఘనపై మేం ఫిర్యాదు చేస్తే ఈసీ ఒక్క నోటీసు కూడా ఇవ్వదు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వెంటనే నోటీసులు ఇస్తోంది. ఈసీకి ఎందుకింత పక్షపాత ధోరణి? నారా భువనేశ్వరి ప్రలోభాలకు పాల్పడితే ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎన్ని కుట్రలు చేసినా పేదవాడి గుండెల్లో ఉన్న జగన్‌ను ఏమీ చేయలేరు. కూటమికి ఓటమి తప్పదు’ అని పేర్కొన్నారు.
రేపటి నుంచి క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు రానున్నాయి.
★ అద్దె చెల్లింపులపై SBI కార్డు రివార్డ్ పాయింట్లు నిలిచిపోనున్నాయి.
★ బీమా, గోల్డ్, ఫ్యూయల్ కోసం AXIS క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు లభించవు. ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో ₹50వేలు ఖర్చు చేయాలి.
★ ICICI లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో కనీసం ₹35వేలు, YES కార్డుపై ₹10వేలు ఖర్చు చేయాలి.
నకిలీ IPL టిక్కెట్లతో సైబర్ మోసగాళ్లు దోచేస్తున్నారు.. జాగ్రత్త. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో జరిగే సన్‌రైజర్స్, చెన్నై మ్యాచ్ టికెట్లు పేటీఎంలో విక్రయించగా అమ్ముడైపోయాయి. అయితే ఇంకా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయంటూ నేరగాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రూ.1000 పంపితే టికెట్ పంపిస్తామని.. ఆ తర్వాత మిగిలిన డబ్బు చెల్లించాలని చెబుతున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.