News March 19, 2024

కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

image

AP: నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్‌కు కేటాయించడం, బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది.

News March 19, 2024

‘అదానీ గ్రూప్‌పై US దర్యాప్తు’.. కొట్టిపారేసిన సంస్థ

image

అదానీ గ్రూప్‌‌పై US అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొంది. కాగా భారత్‌లో ఓ విద్యుత్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ అధికారులకు ముడుపులు చెల్లించి అవినీతికి పాల్పడిందనే ఆరోపణలపై US దర్యాప్తు చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రభావంతో అదానీ షేర్లు, బాండ్లు భారీగా పడిపోయాయి.

News March 19, 2024

జగన్ బస్సుయాత్ర షెడ్యూల్ ఖరారు

image

AP: సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. పులివెందుల, కమలాపురం మీదుగా సీఎం ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడే తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం ప్రాంతాల్లో ప్రయాణిస్తారు. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు యాత్రపై పూర్తి వివరాలను వైసీపీ నేతలు ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు.

News March 19, 2024

పార్టీ మారడం లేదు.. బీఆర్ఎస్‌లోనే ఉంటా: ఎర్రబెల్లి

image

TG: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. ‘నేను పార్టీ మారడం లేదు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు. క్యాడర్ అవన్నీ నమ్మవద్దు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తా’ అని ఆయన స్పష్టం చేశారు.

News March 19, 2024

మెయిన్స్ రద్దు అప్పీల్‌పై విచారణ వాయిదా

image

AP: గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మెయిన్స్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. కాగా మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం 2 సార్లు చేశారంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్షను కోర్టు రద్దు చేసింది.

News March 19, 2024

ఆధార్: సందేహాలుంటే అడిగేయండి

image

ఆధార్ కార్డుకు సంబంధించిన సందేహాల నివృత్తికి ‘ఆధార్ మిత్ర’ పేరుతో కొత్త ఫీచర్‌‌ చాట్ బాట్‌ను UIDAI తీసుకొచ్చింది. దీంతో ఆధార్ PVC కార్డ్ స్టేటస్, ఎన్‌రోల్మెంట్/అప్డేట్ స్టేటస్, ఎన్‌రోల్మెంట్ సెంటర్ లొకేషన్, రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల స్థితి తెలుసుకోవచ్చు. ఇందుకు మీరు https://uidai.gov.inలోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ Frequently asked questionsలో Have any Question? దగ్గర మీరు ప్రశ్నలు అడగవచ్చు.

News March 19, 2024

షారుఖ్ నాకు చెప్పిన సందేశం అదే: గంభీర్

image

గౌతమ్ గంభీర్ ఈ సీజన్‌ నుంచి KKR మెంటార్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. టీమ్‌లో తిరిగి చేరాక జట్టు యజమాని షారుఖ్‌ తనతో అన్న మాటల్ని ఆయన తాజాగా వెల్లడించారు. ‘2011లో ఆటగాడిగా జట్టులో చేరినప్పుడు చెప్పిన విషయమే ఇప్పుడు కూడా షారుఖ్ నాకు చెప్పారు. ఇది నీ జట్టు. పాల ముంచినా, నీట ముంచినా నీదే అన్నారు. ఇక్కడ ఎన్నాళ్లు ఉంటానో తెలీదు కానీ.. వెళ్లేలోపు మరింత మెరుగుపరిచే వెళ్తాను’ అని స్పష్టం చేశారు.

News March 19, 2024

ఢిల్లీకి పురందీశ్వరి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ

image

AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఢిల్లీకి వెళ్లారు. TDP-JSPతో పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ సీట్లలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి అందించనున్నారు. అలాగే పొత్తుపై విమర్శలు చేస్తూ పలువురు బీజేపీ రాష్ట్ర నేతలు రాసిన లేఖపైనా సమాలోచనలు చేస్తారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల లిస్టును విడుదల చేసి ప్రచారం ప్రారంభించాలని జాతీయ నేతలు యోచిస్తున్నారు.

News March 19, 2024

ఈ షూ విలువ రూ.164 కోట్లు

image

సాధారణంగా రూ.164 కోట్లు అంటే ఏదో బిలియనీర్ నెట్ వర్త్ అనే అనుకుంటారు. అయితే అంత ఖరీదైన షూ ఉన్నాయనే విషయం మీకు తెలుసా? వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఖరీదైన షూ తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా పేరున్న ఇటాలియన్ షూ డిజైనర్ ఆంటోనియా వైట్రీ వీటిని రూపొందించారు. ఈ ‘మూన్ స్టార్ షూ’ ప్రపంచంలోనే ఖరీదైన షూగా ఫోర్బ్స్ గుర్తించింది. వీటి హీల్స్ గోల్డ్, డైమండ్స్(30 క్యారట్స్)తో చేశారు.

News March 19, 2024

నేను వైసీపీ కోవర్టు కాదు: ఎమ్మెల్యే ఆరణి

image

AP: పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరానని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. తాను వైసీపీ కోవర్టు కాదని స్పష్టం చేశారు. తిరుపతి సీటు తనకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. 24 గంటలూ ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలన అవినీతిమయమని, తిరుపతిని గంజాయి వనంగా మార్చారని ఆరోపించారు.