India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ‘ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్’ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జగనన్న విద్యాదీవెన పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా, YSR కల్యాణమస్తుని చంద్రన్న పెళ్లి కానుకగా, YSR విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న విదేశీ విద్యాదీవెనను అంబేడ్కర్ ఓవర్సీన్ విద్యా నిధిగా ప్రభుత్వం మార్చింది.
మూడో టర్మ్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ₹1500కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సహా ఆరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక రేపు శ్రీనగర్‌లో జరిగే ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో పాల్గొంటారు. ఇటీవల ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
TG: రైతుభరోసా (ఇదివరకు రైతుబంధు) మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములకు రైతుభరోసా ఇవ్వొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. సాగు చేసే రైతుకు మాత్రమే పెట్టుబడి సాయం దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతుభరోసా పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది.
కొరియర్ డెలివరీ సంస్థ బ్లూడార్ట్ దేశవ్యాప్తంగా డ్రోన్ల సేవలను ప్రారంభించింది. దీని కోసం డ్రోన్ టెక్నాలజీ సంస్థ స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు కూడా తెలిపామని చెప్పింది. ఒకరోజులోనే డెలివరీ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ ఓ ప్రకటనలో వివరించింది. 2021లో తెలంగాణలో ఔషధాలను డ్రోన్లద్వారా ప్రయోగాత్మకంగా డెలివరీ చేశామని గుర్తుచేసింది.
మక్కా వద్ద నెలకొన్న తీవ్ర వేడిగాలులు హజ్ యాత్రికుల్ని బలి తీసుకుంటున్నాయి. ఈ ఏడాది 645మంది యాత్రికులు చనిపోగా వారిలో కనీసం 90మంది భారత ముస్లింలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో కొంతమంది వృద్ధాప్య కారణాలతో కన్నుమూసినవారూ ఉండొచ్చని పేర్కొన్నారు. అనేకమంది భారతీయుల ఆచూకీ గల్లంతైందని వెల్లడించారు. మొత్తంగా ఈ ఏడాది 18 లక్షలమంది యాత్రికులు హజ్ సందర్శించారని స్పష్టం చేశారు.
NEET పేపర్ లీక్ సూత్రధారి అమిత్ ఆనంద్ పరీక్షకు ఒక రోజు ముందే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు అంగీకరించాడు. రూ.30 లక్షలు తీసుకొని ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాలను అభ్యర్థులకు ఇచ్చినట్లు పోలీసుల అంగీకార పత్రంలో వెల్లడించాడు. దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో JE సికందర్‌తో కలిసి నలుగురికి ప్రశ్నాపత్రం ఇచ్చాడట. అతని ఫ్లాట్‌లో జవాబు పత్రం కాలిపోయిన అవశేషాలను పోలీసులు కనుగొన్నారు.
AP: YCP సోషల్ మీడియా వ్యవహారాలకు ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతలను నాగార్జున యాదవ్‌కు జగన్ అప్పగించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం జగన్‌ని కలుస్తూ పార్టీ వ్యవహారాలపై సమీక్షిస్తున్నా.. భార్గవ్ దూరంగా ఉంటున్నారట. YCP హయాంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ విపక్షాలు భార్గవ్‌పై తీవ్ర విమర్శలు చేశాయి.
TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరి ఆల్ఫా హోటల్‌లో పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు ఫుడ్ టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో తేలింది. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ వండి ఫ్రిజ్‌లో పెడుతున్నారని, కస్టమర్లు రాగానే వేడి చేసి ఇస్తున్నారని అధికారులు తెలిపారు. కిచెన్‌లో దారుణమైన వాసన వస్తోందని, నాణ్యతాప్రమాణాలు ఏమాత్రం లేవని వెల్లడించారు. కేసు నమోదు చేసి రూ.లక్ష ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వస్తున్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అనురాగ్ యాదవ్ (22) అనే విద్యార్థి లీకైన పేపర్‌ను బయటపెట్టాడు. అది ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్‌తో సరిపోలిందని అంగీకరించాడు. జూనియర్ ఇంజినీర్ అయిన తన అంకుల్ మే 4న పేపర్ ఇవ్వడంతో ఆ రాత్రికి రాత్రే పూర్తిగా ప్రిపేర్ అయ్యానని నేరాంగీకార పత్రంలో పేర్కొన్నాడు.
AP: రాష్ట్రంలోనే పేరొందిన ఉలవపాడు బంగినపల్లి మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను రూ.90 వేలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో గరిష్ఠ ధర రూ.50 వేలు. ఇటు కవర్ కట్టిన కాయలైతే టన్ను రూ.లక్షపైనే పలుకుతుండగా స్టాక్ ఉండటం లేదు. కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడమే ఇందుకు కారణం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనేందుకు ఎగబడుతున్నారు.
Sorry, no posts matched your criteria.