News June 2, 2024

జైలులో ముంబై బాంబు పేలుళ్ల దోషి హత్య

image

ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి మున్నా అలియాస్ మహ్మద్ అలీఖాన్ జైలులో హత్యకు గురయ్యారు. బాత్‌రూమ్ ప్రాంతంలో స్నానం చేయడంపై ఇతర ఖైదీలతో మున్నాకు వాగ్వాదం చెలరేగింది. దీంతో కొందరు ఖైదీలు అతణ్ని రాడ్‌తో తలపై కొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 1993 MAR 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మరణించారు. ఈ కేసులో దోషి మున్నా కొల్హాపూర్‌ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

News June 2, 2024

ఈ విజయం చరిత్రాత్మకం: పెమా ఖాండు

image

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని సీఎం పెమా ఖాండు అన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందించిన సహకారానికి ప్రజలు తిరిగి చెల్లించారని చెప్పారు. బీజేపీకి మరో ఐదేళ్లు అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. జూన్ 4న వెలువడే లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో దేశం మొత్తం ఇదే జోరు విస్తరిస్తుందని పేర్కొన్నారు.

News June 2, 2024

సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్

image

AP: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై హైకోర్టు <<13358298>>తీర్పును<<>> సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అధికారిక సీల్, హోదా లేకున్నా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ రేపు తమ పిటిషన్ విచారించాలని YCP సుప్రీంకోర్టును కోరింది. కాగా ఎల్లుండి కౌంటింగ్ జరగనుంది.

News June 2, 2024

ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా మహిళా వ్యాపారవేత్త

image

ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా టోమస్‌డోత్తిర్ ఎన్నికయ్యారు. ఆగస్టు 1న ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని స్థానిక మీడియా పేర్కొంది. మాజీ ప్రధాని కత్రిన్ జాకోబ్స్‌డోత్తిర్‌పై ఆమె విజయం సాధించారు. 55 ఏళ్ల హల్లాకు 34.3 శాతం ఓట్లు రాగా, కత్రిన్‌కు 25.5 శాతం వచ్చాయి. కాగా హల్లా B టీమ్ కంపెనీ సీఈవోగా ఉన్నారు.

News June 2, 2024

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో చెత్త రికార్డు

image

కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డాన్ టీ20 వరల్డ్ కప్‌లో చెత్త రికార్డు నమోదు చేశారు. USAతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ తొలి స్థానంలో ఉన్నారు. 2007 T20 WCలో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్ ఒకే ఓవర్‌లో 36 పరుగులు ఇచ్చారు.

News June 2, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు

image

భారత బాక్సర్లు జైస్మిన్ లంబోరియా, అమిత్ పంఘల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ పురుషుల క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ లియు చువాంగ్‌పై అమిత్ విజయం సాధించారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో మరైన్ కమరాను 5-0 తేడాతో జైస్మిన్ చిత్తు చేశారు. దీంతో వీరిద్దరూ పారిస్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. కాగా ఈ ఒలింపిక్స్ జులై 26న ప్రారంభం కానున్నాయి.

News June 2, 2024

చిన్న ఘటనపై రాద్ధాంతం చేశారు: అంజలి

image

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ తనను తోసేసిన ఘటనపై హీరోయిన్ అంజలి మరోసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు మాత్రమే తెలుసు. కొద్దిగా జరగాలంటూ బాలయ్య నెట్టారు. నేను వెంటనే నవ్వేశా. చాలా చిన్న సంఘటనపై సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేశారు’ అని పేర్కొన్నారు. బాలకృష్ణకు, తనకు పరస్పర గౌరవం ఉందని ఇటీవల <<13346819>>ట్వీట్<<>> చేసిన విషయం తెలిసిందే.

News June 2, 2024

ఎగ్జిట్ పోల్స్: ఒడిశాలో BJP, బీజేడీ మధ్య టఫ్ ఫైట్

image

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో BJP, బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని India Today Axis My India ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. ఇరు పార్టీలకు 62-80 సీట్ల చొప్పున వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏ పార్టీ గెలుస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ 5-8 స్థానాల్లో గెలుస్తుందని అభిప్రాయపడింది. అత్యధికంగా BJDకి 42%, బీజేపీకి 41%, కాంగ్రెస్‌కు 12%, ఇతరులకు 4-5 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది.

News June 2, 2024

చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు

image

AP: మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోనూ సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని CBN నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

News June 2, 2024

అది రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా: హరీశ్ రావు

image

TG: తాను అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్లు నిరూపిస్తే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తానని <<13362849>>మంత్రి <<>>కోమటిరెడ్డికి BRS ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి ముక్కు నేలకు రాయాలని ప్రతి సవాల్ చేశారు. తాను కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లానని ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి వెళ్లాననే వివరాలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. మంత్రి రుజువులతో రావాలని డిమాండ్ చేశారు.