India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మోదీ, BJPని ఇంటికి పంపేవరకూ నిద్రపోయేది లేదని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. DMKకి నిద్రలేని రాత్రులు వచ్చాయని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘గ్యాస్ సిలిండర్ 2014లో రూ.450 ఉంటే మీరు రూ.1,200 చేశారు. ఎన్నికలు రాగానే రూ.100 తగ్గించి డ్రామాలాడుతున్నారు. ఎన్నికలు ముగిస్తే సిలిండర్లపై మళ్లీ రూ.500 పెంచుతారు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
బీజేపీ టికెట్ నిరాకరించడంతో భంగపడ్డ వరుణ్ గాంధీని కాంగ్రెస్ ఆహ్వానించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరీ ప్రకటన చేశారు. ‘వరుణ్ కాంగ్రెస్‌లోకి వస్తే సంతోషిస్తాం. అతను మంచి విద్యావేత్త. పారదర్శకత, గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉండటం వల్లే బీజేపీ వరుణ్‌కు సీటు ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. కాగా వరుణ్ తల్లి మేనకా గాంధీ మరోసారి సుల్తాన్‌పుర్ నుంచి బరిలో దిగేందుకు BJP అవకాశం ఇచ్చింది.
తొలి విజయంతో ఊపుమీదున్న CSK ఇవాళ గుజరాత్‌తో తలపడనుంది. ఈ మేరకు తుది జట్టు కూర్పుపై కసరత్తు చేస్తోంది. పేసర్ పతిరణ జట్టుతో కలవడం, మొదటి మ్యాచ్‌లో ముస్తాఫిజర్ 4 వికెట్లతో అదరగొట్టడంతో ఈ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. గత సీజన్ ట్రోఫీ విజయంలో పతిరణ కీలక పాత్ర పోషించారు. ఇక ఆర్సీబీ మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న తుషార్ దేశ్ పాండే స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు ఛాన్స్ దక్కే అవకాశముంది.
పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుందని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ ఝక్కర్ ప్రకటించారు. శిరోమణి అకాలీ దళ్‌తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోవట్లేదని.. మొత్తం 13 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అకాలీ దళ్, BJP మధ్య పొత్తు ఉండొచ్చని ప్రచారం సాగుతున్న వేళ ఈ ప్రకటన చేశారు. ప్రజలు, పార్టీ శ్రేణుల అభిప్రాయం తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. కాగా జూన్ 1న పోలింగ్ జరగనుంది.
TG: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే వర్షాలు ఆగిపోయాయని ఆమె అన్నారు. ‘గత BRS ప్రభుత్వం చెరువుల పూడికతీతకు రూ.వేల కోట్లు ఖర్చు చేసింది. మరి ఇప్పుడు ఆ చెరువుల్లో నీళ్లు ఎందుకు లేవు. ఈ కరువు బీఆర్ఎస్ తెచ్చిందే’ అని ఆమె అన్నారు.
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ కాదట. కేవలం మూడు భాషల్లోనే రిలీజ్ చేయబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ‘జరగండి’ సాంగ్‌ను తెలుగు, తమిళ్, హిందీలో విడుదల చేయనున్నట్లు రిలీజ్ పోస్టర్‌లో పేర్కొనడంతో ఈ చర్చకు బలం చేకూరినట్లైంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై మరో దేశం స్పందించింది. ఆయన అరెస్టుపై న్యాయమైన, పారదర్శక విచారణ జరగాలని ఆమెరికా పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు అంశాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఆయన అరెస్టు విషయంలో జర్మనీ స్పందించిన విషయం తెలిసిందే. దానిపై భారత ప్రభుత్వం కూడా ఘాటుగానే ప్రతిస్పందించింది. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
TG: రాష్ట్రంలోని పెట్రోల్ పంప్స్ డీలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధనంపై కమీషన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తూ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. 10రోజుల్లో కేంద్రం స్పందించకుంటే పెట్రోల్ బంక్స్ ప్రతి రోజు కేవలం 12గంటలే తెరిచి నిరసనలు తెలపనున్నారు. అంటే ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే పెట్రోల్ పంపులు తెరిచి ఉంటాయి.
US అధ్యక్ష ఎన్నికలకు ప్రస్తుతం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే టెక్సాస్‌కు చెందిన మాజీ సైనికుడు డస్టిన్ ఈబే వీరిపై ఇప్పుడు పోటీకి సిద్ధమయ్యారు. సామాన్యులకు ప్రత్యామ్నాయం అవసరమన్న ఈబే ఇందుకోసం తన పేరును ‘లిటరల్లీ ఎనీబడీ ఎల్స్’ (ఎవరైనా సరే)గా మార్చుకున్నానని అన్నారు. కాగా బ్యాలెట్‌లో పేరు నమోదు కావడానికి ఈబేకు మద్దతుగా టెక్సాస్‌లో 1,13,000 సంతకాలు అవసరం.
స్టార్‌డమ్ అనేది శాశ్వతంగా ఉండదని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అన్నారు. అందుకే సామాన్యురాలిగా బతకడమే బెస్ట్ అని చెప్పారు. ఇప్పటికీ తానే స్వయంగా మార్కెట్‌కి వెళ్లి నచ్చినవి తెచ్చుకుంటానని చెప్పారు. అందరితో కలిసి పావ్ బాజీ తింటానని.. అందులోనే ఆనందం ఉందన్నారు. ఇటీవల ఫ్యాన్స్‌తో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఈ అమ్మడిని ‘మోస్ట్ స్టైలిష్ ఫ్యాన్ ఫేవరెట్ సూపర్ స్టార్’ అవార్డుతో సత్కరించారు.
Sorry, no posts matched your criteria.