India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యువతుల ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో అమెరికన్ ప్రముఖ ర్యాపర్ సీన్ కాంబ్స్(డిడ్డీ పేరుతో ప్రసిద్ధి)పై కేసు నమోదైంది. అతనిపై పలువురు మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా వంటి ఆరోపణలు చేశారు. దీంతో అతని ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతని ప్రియురాలు కాసాండ్రా 2016లో డిడ్డీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసేవాడని పేర్కొన్నారు.
సివిల్ సర్వీసెస్ మోజులో చాలా మంది యువత తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ తెలిపారు. ‘దేశానికి బ్యూరోక్రసీ అవసరమే. కానీ ఆ పోస్టుల కోసం లక్షల మంది ఏళ్ల తరబడి ప్రిపేర్ కావడం సరికాదు. అదే కృషిని మరో రంగంలో కనబరిస్తే గొప్ప వైద్యులో, దర్శకులో, శాస్త్రవేత్తలో వచ్చేవారు. నిజంగా అడ్మినిస్ట్రేషన్ మీద ఆసక్తి ఉన్న వారు మాత్రమే UPSCకి సన్నద్ధం కావాలి’ అని పేర్కొన్నారు.
AP: అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థి ఎంపికపై TDPలో స్పష్టత కొరవడింది. సామాజిక, ఆర్థిక సమీకరణాలు లెక్కలతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా మాజీ MP జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి పేరు టికెట్ రేసులో వినిపిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో బోయ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ వర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు, రాజేష్, మాజీ ZP ఛైర్మన్ పూల నాగరాజు పేర్లను పరిశీలిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో BRS MLC కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు.
AP: అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చెప్పారు. మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరమని, ఇదొక త్రివేణి సంగమమని అభివర్ణించారు. వైసీపీ నేతలు అన్ని రంగాల్లో అవినీతి చేశారని ఆరోపించారు. ‘నా ఎస్సీ, ఎస్టీ, బీసీలని చెప్పే సీఎం జగన్.. ఆయా వర్గాల నిధులను దారి మళ్లించారు’ అని మండిపడ్డారు.
TG: రేపు ఉప్పల్‌లో SRH-ముంబై మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో RTC ఎండీ సజ్జనార్ క్రికెట్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకుల కోసం నగరంలోని పలు ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ బస్సులు ప్రారంభమవుతాయన్నారు. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
AP: వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతూ శ్రీకాళహస్తి TDP అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన <<12923028>>వ్యాఖ్యలు<<>> ఆయన వ్యక్తిగతమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లను కొనసాగించడంతోపాటు మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలను కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని మేం సమర్థించం’ అని చెప్పారు.
తమిళనాడు మాజీ CM, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఉనికి కోసం పోరాడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. BJP సైతం వ్యూహాత్మకంగా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకుండా పన్నీర్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో ఈ స్థానం తమిళనాట హాట్‌టాపిక్‌గా మారింది. BJP మద్దతుతో పాటు, అన్నాడీఎంకేలోని చీలిక వర్గం మద్దతుతో సులువుగా గెలుస్తానని పన్నీర్ ధీమాగా ఉన్నారు.
దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో ఇప్పటికే పలు పోర్టులను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ తాజాగా మరో పోర్టును దక్కించుకోనుంది. రూ.3,080 కోట్లతో ఒడిశాలోని గోపాల్‌పుర్ పోర్టు (GPL) కొనుగోలుకు సిద్ధమైంది. GPLలో ఎస్‌పీ గ్రూప్‌కు ఉన్న 56%, ఒడిశా స్టీవ్‌డోర్స్ లిమిటెడ్‌కు చెందిన 39% వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. కాగా ప్రస్తుతం పశ్చిమ తీరంలో 7, తూర్పు తీరంలో ఏడు పోర్టులు అదానీ పరిధిలో ఉన్నాయి.
TG: ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని, ప్రణీత్ రావు ఎవరో తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రణీత్ రావు కూడా చెప్పారని పేర్కొన్నారు. ఏం జరిగిందో విచారణలో తేలుతుందని చెప్పారు. ఇతర పార్టీలో చేరాలని ఆఫర్లు వస్తున్నా.. తనకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.