News September 29, 2024

CPM తాత్కాలిక సమన్వయకర్తగా ప్రకాశ్ కారత్

image

సీపీఎం పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నాయకుడు ప్రకాశ్ కారత్ వ్యవహరించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యించారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో మ‌ధురై వేదికగా సీపీఎం 24వ‌ అఖిల‌భార‌త మ‌హాస‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. పార్టీ నూత‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఈ మహాసభల సందర్భంగా ఎన్నుకోనున్నారు.

News September 29, 2024

IPL: అక్టోబర్ 31 లాస్ట్ డేట్?

image

అక్టోబర్ 31 సాయంత్రం 5 గంటలలోగా అన్ని ఫ్రాంచైజీలు తమ ఫైనల్ రిటెన్షన్ల లిస్టును సమర్పించాలని బీసీసీఐ నిర్దేశించినట్లు తెలుస్తోంది. రిటెన్షన్‌లో గరిష్ఠంగా ఐదుగురు క్యాప్‌డ్, గరిష్ఠంగా ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు అనుమతించినట్లు సమాచారం. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు రూ.4 కోట్ల జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా బీసీసీఐ కాంట్రాక్టు పొందని వారిని అన్‌క్యాప్‌డ్‌గా భావిస్తారని సమాచారం.

News September 29, 2024

హైదరాబాద్‌లో ప్రతిపాదిత మెట్రో మార్గాలివే

image

☞ కారిడార్-4: నాగోల్-RGIA(36.6కి.మీ)
☞ కారిడార్-5: రాయదుర్గం-కోకాపేట్(11.6కి.మీ)
☞ కారిడార్-6: MGBS-చాంద్రాయణగుట్ట(7.5కి.మీ)
☞ కారిడార్-7: మియాపూర్-పటాన్‌చెరు(13.7కి.మీ)
☞ కారిడార్-8: ఎల్బీనగర్-హయత్‌నగర్(7.1కి.మీ)
☞ కారిడార్-9: RGIA-ఫోర్త్ సిటీ(40కి.మీ)
☞☞ 116.2కి.మీ మార్గాన్ని రూ.32,237 కోట్ల <<14226006>>అంచనాతో <<>>ప్రతిపాదించి కేంద్రానికి ప్రభుత్వం పంపనుంది.

News September 29, 2024

చరిత్ర సృష్టించిన శ్రీలంక

image

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత ఆ జట్టు కివీస్‌పై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 88కే ఆలౌటైన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 360కే పరిమితమైంది. కాన్వే(61), బ్లండెల్(60), ఫిలిప్స్(78), శాంట్నర్(67) అర్ధ సెంచరీలతో రాణించారు. నిశాన్ పెరీస్ 6 వికెట్లతో చెలరేగి లంకకు విజయాన్ని కట్టబెట్టారు.

News September 29, 2024

త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: మంత్రి

image

TGSRTCలో త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం <<14225767>>ప్రభాకర్ <<>>వెల్లడించారు. ఉద్యోగులకు PRC, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు. కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా HYD రింగ్ రోడ్డు లోపల డీజిల్‌తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. HYD సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సు సర్వీసులు నడపాలన్నదే తమ లక్ష్యమన్నారు.

News September 29, 2024

రూ.32,237 కోట్ల అంచనాతో మెట్రో ఫేజ్-2

image

HYD మెట్రో రెండో దశ DPRకు ప్రభుత్వం ఫైనల్ టచ్ ఇస్తోంది. రూ.32,237 కోట్ల అంచనాతో మొత్తం 116.2 KM మార్గం నిర్మించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40KM, ఆరాంఘర్-కొత్త హైకోర్టు(రాజేంద్రనగర్) మీదుగా ఎయిర్‌పోర్టుకు కొత్త లైన్, కారిడార్-4 భాగంగా నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36.6KM కొత్త మార్గాలు నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో దాదాపు 1.6కి.మీ మేర భూగర్భంలో మెట్రో లైన్ నిర్మిస్తారు.

News September 29, 2024

దసరాలోపు బకాయిలు చెల్లించే ప్రయత్నం: పొన్నం

image

TG: ఆర్టీసీ కార్మికులకు బకాయిపడ్డ అన్నిరకాల అలవెన్సులను దసరా లోపు చెల్లించే ప్రయత్నం చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్‌లో 33 ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. పదేళ్లుగా ఆర్టీసీ‌లో ఉద్యోగులు, బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. గతంలో కష్టాల‌ను ఎదుర్కొన్న సంస్థను రక్షించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు.

News September 29, 2024

తెలంగాణపై మోదీ ప్రశంసలు

image

తెలంగాణ ప్రజలపై 114వ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారని చెప్పారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయన్నారు. మొక్కల్లో అమ్మను చూసుకుంటున్నారని వెల్లడించారు. జూన్ నుంచి ఇప్పటివరకు 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామన్నారు. దీంతో తగ్గిపోతున్న వన సంపద మళ్లీ పెరుగుతోందన్నారు.

News September 29, 2024

IND vs BAN: మూడో రోజూ వర్షార్పణమే

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. మైదానం ఇంకా చిత్తడిగా ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కాగా ఇవాళ ఉదయం నుంచీ వర్షం కురవకపోయినా మైదానం చిత్తడిగానే ఉంది. అంపైర్లు రెండు సార్లు ఇన్‌స్పెక్షన్ చేసి ఆట నిర్వహణకు అనువుగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

News September 29, 2024

నస్రల్లా హత్య.. రంగంలోకి ‘బ్లాక్ యూనిట్’

image

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు బ్లాక్ యూనిట్ ప్రతీకారం తీర్చుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిని షాడో యూనిట్ లేదా యూనిట్ 910గా కూడా వ్యవహరిస్తారు. ఇది హెజ్బొల్లాలో కోవర్ట్ వింగ్. అప్పట్లో హెజ్బొల్లా చీఫ్ ముసావి హత్య అనంతరం ఈ యూనిట్ ప్రతీకార దాడులకు పాల్పడింది. లెబనాన్ బయట ఇది దాడులకు దిగుతుంది. యూదులు, దౌత్య కార్యాలయాలు, ఇజ్రాయెలీ పర్యాటకులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు చేస్తుంది.