News March 28, 2024

BJP నేత దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు

image

ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన BJP నేత దిలీప్ ఘోష్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనకు ఈసీ నోటీసులు ఇచ్చింది. మమతా బెనర్జీపై ‘ఎవరి కూతురో?’, ‘బెంగాల్‌కు సొంత కూతురే కావాలి’ వంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ టీఎంసీ నేతల ఫిర్యాదుతో ఘోష్‌పై కోల్‌కతాలోని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది.

News March 28, 2024

ఆ రూ.100 కోట్లు ఎక్కడికి పోయాయి?: కేజ్రీవాల్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనను ఇరికించడమే ఈడీ లక్ష్యమని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులో సొంతంగా వాదనలు వినిపిస్తూ.. ‘ఈ కేసులో సీబీఐ 31 వేల పేజీలు, ఈడీ 21 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశాయి. అందులో ఎక్కడా నా పేరు లేదు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 వాంగ్మూలాలలో ఆరింట్లో నా పేరు లేదు. లిక్కర్ కేసులో రూ.100 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు.. మరి ఆ డబ్బు ఎక్కడుంది?’ అని ప్రశ్నించారు.

News March 28, 2024

తీర్పు రిజర్వ్

image

లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్‌ను మరో 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. తనపై ఆరోపణలు లేకున్నా అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ స్వయంగా వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి కావేరీ బవేజా తీర్పును రిజర్వ్ చేశారు.

News March 28, 2024

ప్రధాని మోదీ కార్లకు అనుమతి నిరాకరించిన NGT

image

ప్రధాని మోదీ కాన్వాయ్‌కు చెందిన మూడు కార్లకు రిజిస్ట్రేషన్ పొడిగించాలన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) విజ్ఞప్తిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. పదేళ్లకు మించిన డీజిల్ కార్లను 2018లో సుప్రీంకోర్టు నిషేధించడమే ఇందుకు కారణంగా పేర్కొంది. రెనాల్ట్ ఎండీ-5 మోడల్‌కు చెందిన ఈ కార్లకు 2014లో రిజిస్ట్రేషన్ అయింది. తక్కువ కిలోమీటర్లే తిరగడంతో వీటి రిజిస్ట్రేషన్ పొడిగించమని SPG కోరింది.

News March 28, 2024

అగ్నివీర్ స్కీమ్‌లో అవసరమైతే మార్పులు చేస్తాం: రాజ్‌నాథ్

image

భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్నివీర్ పథకంలో అవసరమైతే మార్పులు తీసుకొస్తామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నివీర్‌ల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే చెప్పారు. అగ్నివీర్‌ల సర్వీస్ కాలం నాలుగేళ్లు కాగా మెరిట్ ఆధారంగా ప్రతి బ్యాచ్‌లో 25% మందిని 15 ఏళ్లు పొడిగిస్తారు.

News March 28, 2024

సీఎం జగన్‌కు చంద్రబాబు ఏడు ప్రశ్నలు

image

AP: 90 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకునే సీఎం జగన్ తన ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ‘ప్రత్యేక హోదా తెస్తాను అన్నావు.. తెచ్చావా? మద్య నిషేధం చేయనిదే ఓట్లు అడగను అన్నావు.. చేశావా? సీపీఎస్ రద్దు ఏమైంది? ఏటా జాబ్ క్యాలెండర్? మెగా డీఎస్సీ? కరెంట్ ఛార్జీల తగ్గింపు? పోలవరం పూర్తి చేస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి’ అని చంద్రబాబు నిలదీశారు.

News March 28, 2024

ఏపీకి ఎన్నికల పరిశీలకుల నియామకం

image

ఏపీ ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురిని నియమించింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్‌గా రామ్‌మోహన్ మిశ్రా, పోలీసు వ్యవహారాల పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నీనా నిగమ్‌ నియమితులయ్యారు. వచ్చే వారంలో రాష్ట్రానికి రానున్న వీరు.. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.

News March 28, 2024

SRH ప్లేయర్ సరికొత్త రికార్డు

image

IPLలో అత్యధిక జట్లకు ఆడిన భారత ఆటగాడిగా SRH బౌలర్ జయదేవ్ ఉనద్కత్ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో మనీశ్ పాండే 7 జట్లకు ప్రాతినిధ్యం వహించగా, జయదేవ్ 8 టీమ్స్(KKR, DC, RCB, పుణె, RR, MI, LSG, SRH) తరఫున ఆడారు. అలాగే IPLలో రెండు అత్యధిక స్కోర్లు చేసిన జట్లలో భాగస్వామిగా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచారు. ఆరోన్ ఫించ్ అత్యధికంగా 9 జట్ల(RR, DC, పుణె, SRH, MI, గుజరాత్ లయన్స్, పంజాబ్, RCB, KKR)కు ఆడారు.

News March 28, 2024

స్వయంగా వాదనలు వినిపిస్తున్న కేజ్రీవాల్

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. ‘రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. నాపై ఆరోపణలు లేకున్నా అరెస్టు చేశారు’ అని చెబుతుండగా జడ్జి కావేరీ బవేజా ‘మీ వాదనలను రాతపూర్వకంగా ఇవ్వండి’ అని అడిగారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్ ‘కాసేపు మాట్లాడనివ్వండి మేడమ్’ అని వాదనలు కొనసాగిస్తున్నారు.

News March 28, 2024

బీజేపీ తరఫున పోటీ చేసేది టీడీపీ నేతలే: సజ్జల

image

AP: చంద్రబాబు ఇచ్చే హామీలకు విలువ లేదని, ఆయన ఏది చెప్పినా అమలు చేయరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. బీజేపీ తరఫున కూడా టీడీపీ నేతలే పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ బస్సు యాత్రలో ఉపయోగించే ప్యాంట్రీ వెహికల్‌కు ఈసీ అనుమతి తీసుకున్నామని చెప్పారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.