India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

APలో నెల్లూరు(D) దగదర్తి, చిత్తూరు(D) కుప్పం, పల్నాడు(D) నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు/ఎయిర్‌స్ట్రిప్‌ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు CM చంద్రబాబు సూచించారు. భూసేకరణ కూడా పూర్తైన ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. తాడిపత్రి, తునిలోనూ ఎయిర్‌పోర్టులు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని CM కోరారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వంటివి తీసుకురావాలన్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీస్‌లో క్యూబా రెజ్లర్‌తో జరిగిన పోరులో ఆమె 5-0 తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో భారత్‌కు పతకం ఖాయమైంది. రేపు జరిగే ఫైనల్లో గెలిస్తే గోల్డ్, ఓడితే సిల్వర్ మెడల్ దక్కుతుంది. మరోవైపు ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ చరిత్ర లిఖించారు.

‘కేజీఎఫ్-2’ తర్వాత యశ్ నటించిన సినిమాల కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు గుడ్ న్యూస్. రాకింగ్ స్టార్ యశ్ నటించబోయే ‘Toxic’ సినిమా షూటింగ్ ఈనెల 8వ తేదీన ప్రారంభం అవుతుందని సినీవర్గాలు తెలిపాయి. యశ్‌కు ‘8’ నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పుట్టిన తేదీ కూడా ఎనిమిదే. అందుకే 8వ నెలలో 8వ తేదీన షూటింగ్ ప్రారంభించేందుకు ఆయన మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

AP: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న మున్సిపాలిటీల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ నెలాఖరులోగా మరో 83 క్యాంటీన్లు, సెప్టెంబర్ నెలాఖరులోగా మరో 20 క్యాంటీన్లు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్యాంటీన్ల ద్వారా రూ.5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని ప్రభుత్వం అందించనుంది.

గౌతం అదానీతో పాటు మరికొందరు టాప్ బిజినెస్‌మెన్ టెలికాం సర్వీసెస్‌లోకి అడుగుపెడతారనే వార్తల నేపథ్యంలో జియో తన యూజర్ల కోసం కొన్ని పాత రీఛార్జ్ ప్లాన్లను పునరుద్ధరించింది. ₹299(28 రోజులు, 1.5GB, మొత్తం 42GB), ₹249(28 రోజులు, 1GB, మొత్తం 28GB), ₹209(22 రోజులు, 1GB, మొత్తం 22GB), ₹199(18 రోజులు, 1.5GB, మొత్తం 27GB). అన్ని ప్లాన్లలోనూ జీయో ఎంటర్‌టైన్మెంట్ సర్వీస్ లభిస్తుంది.

TG: అమెరికా పర్యటనలో ఉన్న CM రేవంత్ రెడ్డిని టీమ్ ఇండియా అంధ క్రికెటర్లు కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం తరఫున క్రికెటర్లకు సాయం చేస్తామని రేవంత్ ప్రకటించారు. కాగా అంధుల క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ఆటగాళ్లు US వెళ్లారు. ఆ దేశం తరఫున కూడా అంధుల క్రికెట్ జట్టు ఏర్పాటు చేసేందుకు వీరు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా USలోని 8 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా పారిస్ ఒలింపిక్స్‌పై ఫన్నీ ట్వీట్ చేశారు. జావెలిన్ త్రోలో నీరజ్ ఫైనల్ దూసుకెళ్లడాన్ని ఉద్దేశిస్తూ మనకు గోల్డ్ రావాలంటే ప్రార్థనలు మాత్రమే సరిపోవు అంటూ పైనున్న ఫొటో షేర్ చేశారు. అందులో నీరజ్‌కు దిష్టి తగలకుండా దిష్టి చుక్కలు పెట్టినట్లు ఎడిట్ చేశారు. నిమ్మకాయ, పచ్చిమిర్చి వేలాడదీసినట్లు ఫొటోలో ఉంది. <<-se>>#Olympics2024<<>>

AP: సీఎం చంద్రబాబు రేపు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం జాండ్రపేట హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగే చేనేత సదస్సులో ఆయన పాల్గొననున్నారు. నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ సభలో చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

రియల్టీ, ఇన్వెస్టర్లకు కేంద్రం ఉపశమనం కల్పించింది. LTCGని పాత, కొత్త పద్ధతుల్లో లెక్కించి ఎందులో తక్కువొస్తే దాని పైనే పన్ను చెల్లించేలా ఆర్థిక బిల్లులో మార్పులు చేసినట్టు తెలిసింది. అయితే 2024 జులై 23 వరకు కొన్న భూమి, ఇళ్లు, ప్లాట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. బడ్జెట్లో కేంద్రం ఇండెక్సేషన్ రద్దు చేసి LTCG ట్యాక్స్‌ను 20 నుంచి 12.5 శాతానికి సవరించింది. దీనిని ప్రజలు తీవ్రంగా విమర్శించారు.

తమను HYDలో అడ్డుకుంటున్నారని APకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ఇచ్చిన వినతిపై డిప్యూటీ CM పవన్ స్పందించారు. ‘AP డ్రైవర్లను HYD విడిచి వెళ్లమనడం భావ్యం కాదు. తోటి డ్రైవర్లకు మానవతా థృక్పధంతో TG డ్రైవర్లు సహకరించాలి. 2వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. TG ప్రభుత్వం స్పందించి, సమస్యను పరిష్కరించాలి’ అని సూచించారు. అటు అమరావతి పనులు మొదలయ్యాయని, ఇక్కడా అవకాశాలు పెరుగుతాయని ఆయన వారికి భరోసా ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.