India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఎదురయ్యే కష్టాలను ప్రశాంత్ కిని అనే జ్యోతిషుడు 9 నెలల కిందటే సరిగ్గా అంచనా వేశారు. ‘హసీనా 2024 మే- ఆగస్టు మధ్య జాగ్రత్తగా ఉండాలి. ఆమెపై హత్యాయత్నాలు జరగొచ్చు’ అని అతను గత ఏడాది డిసెంబర్‌లో ట్వీట్ చేశారు. ఆయన చెప్పినట్లే ఈ నెలలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ పోస్టు వైరలవుతోంది.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆమె సెమీఫైనల్ చేరారు. ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానాను వినేశ్ 7-5 తేడాతో ఓడించారు. ఇవాళ రాత్రి జరిగే సెమీస్‌లో వినేశ్ తలపడనున్నారు. అందులో గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయం కానుంది.

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా గెలిచి బంగారు పతకాన్ని సాధించాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. అయితే, ఆయన గెలిస్తే ఎంతో మందికి ఉచితంగా ఒక్కరోజు వీసా లభించనుంది. నీరజ్ గోల్డ్ సాధిస్తే ఉచితంగా వీసా అందిస్తామని ‘అట్లిస్’ CEO మొహక్ నహ్తా హామీ ఇచ్చిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఫ్రీ వీసా కోసం ఆయన <

బంగ్లాదేశ్‌లో నహీద్ ఇస్లామ్ అనే యువకుడు పీఎం షేక్ హసీనా పదవి కోల్పోయేటట్లు చేశాడు. తోటి ఉద్యమకారులతో కలిసి ఆయన రిజర్వేషన్లపై పోరాడాడు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను నుదిటికి కప్పుకుని ఉద్యమాల్లో పాల్గొనేవాడు. భారీ ఆందోళనలు నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. కాగా 26 ఏళ్ల నహీద్ ఢాకాలో జన్మించాడు. ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ విద్యార్థి. ఆయన తండ్రి ఓ టీచర్. ఆయన తమ్ముడు నఖీబ్ కూడా ఉద్యమకారుడే.

AP ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోందని TDP MP శ్రీకృష్ణదేవరాయలు బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో అన్నారు. కేంద్రం అండగా ఉండి, రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని కోరారు. ఇప్పటికే AP ఆర్థిక పరిస్థితిపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. దేశంలోని ఆక్వా ఎగుమతుల్లో 70% AP నుంచే జరుగుతున్నాయని, PM మత్స్య సంపద యోజన కింద ఆక్వా రైతులను ఆదుకోవాలని MP విజ్ఞప్తి చేశారు.

యూకే వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లండన్‌లోని భారత హై కమిషన్ అప్రమత్తమైంది. భారత్ నుంచి వచ్చినవారు యూకేలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్కడున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. పోలీసుల సూచనలు పాటించాలని, గొడవలు జరిగే ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే inf.london.@mea.gov.inను సంప్రదించాలని పేర్కొంది.

TG: ఓడిన కాంగ్రెస్ నేతలను అధికారిక కార్యక్రమాలకు ఎలా పిలుస్తారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రశ్నించారు. ప్రజాపాలనలో BRS MLAలకు నిత్యం అవమానాలే ఎదురవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ నిబంధనలేమైనా మార్చారా? అని సందేహం వ్యక్తం చేశారు. అలంపూర్‌లోని తుమ్మిళ్ల కెనాల్ నీటి విడుదల కార్యక్రమాన్ని ఓడిన కాంగ్రెస్ MLA అభ్యర్థి సంపత్ కోసం వాయిదా వేయడంపై KTR ఇలా స్పందించారు.

బంగ్లాలో ఏర్పాటయ్యే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉండేందుకు ప్రముఖ సామాజికవేత్త మహమ్మద్ యూనస్ అంగీకరించినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. బంగ్లాలో మహిళలను పేదరికం నుంచి బయటపడేసేందుకు యూనస్ గ్రామీణ బ్యాంకు ద్వారా చేసిన కృషికి గుర్తింపుగా 2006లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈయన అమెరికాకు అనుకూలుడనే ముద్ర ఉంది.

దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో 203 లైట్‌హౌస్‌లు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో 10 రాష్ట్రాల్లోని 75 లైట్‌హౌస్‌లను గుర్తించి వాటిని పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. ఏపీలోని రామాయపట్నం, మచిలీపట్నం, అంతర్వేది, శాక్రామెంటో, వాకలపూడి, సంతపల్లి, కళింగపట్నం, బారువ, వాడరేవు, పూడిమడక తీరప్రాంతాల్లో లైట్‌హౌస్‌లను అభివృద్ధి చేసినట్టు తెలిపింది.

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. 96 ఏళ్ల ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా జులై తొలి వారంలోనూ అద్వానీ అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందారు.
Sorry, no posts matched your criteria.