India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పీసీబీ, ఏపీఎండీసీ ఫైళ్లు తగలబెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న విషయం మర్చిపోయారా అని టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు. అవసరమైతే సీబీఐ, సీఐడీతో విచారణ చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఫైళ్లను ఏమైనా వైసీపీ కార్యాలయంలో తగలబెట్టామా అని ఆయన నిలదీశారు.

ముంబైలో టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీకి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. లక్షలాదిగా తరలిరావడంతో ముంబై వీధులు సముద్రాన్ని తలపించాయి. ఇంతటి ప్రజాదరణ 2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు బ్యూనస్ ఎయిర్స్‌లో లభించింది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో ఈ రెండు పరేడ్స్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని అభిమానులు అంటున్నారు.

ఇజ్రాయెల్‌పై లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇవాళ 200కు పైగా రాకెట్లు, 20కిపైగా ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. హెజ్బొల్లా దాడుల అనంతరం ఇజ్రాయెల్ కూడా విరుచుకుపడింది. రామ్యెహ్, హూలాలోని మిలిటరీ నిర్మాణాలపై దాడులు జరపగా ఒకరు మృతి చెందారు. కాగా హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతోంది. ఈ సంస్థకు ఇరాన్ సాయం చేస్తోంది.

స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సెబీ, సెక్యూరిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (SAT)కు CJI జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. మార్కెట్ విస్తరిస్తున్న వేళ వెన్నెముక లాంటి వ్యవస్థ స్థిరత్వం కోల్పోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌లు నెలకొల్పాలని అభిప్రాయపడ్డారు. ముంబైలో SAT కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో టాప్-10 అత్యుత్తమ, చెత్త వంటకాల లిస్టును ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసింది. మ్యాంగో లస్సీ, చాయ్ మసాలా, బటర్ గార్లిక్ నాన్, అమృత్ సారి కుల్చా, బటర్ చికెన్, హైదరాబాదీ బిర్యానీ, షాహీ పనీర్, చోలే బటూరే, తందూరీ చికెన్, కుర్మా టాప్-10 తినదగిన.. జల్జీరా, గజక్, తెంగై సాదమ్, పాంటా భాట్, ఆలూ బైంగన్, తాండాయ్ కీర్, అచ్చప్పం, మిర్చి కా సాలన్, మాల్పువా, ఉప్మా టాప్-10 చెత్త వంటకాలుగా నివేదించింది.

నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ నుంచి మూవీ టీమ్ సెకండ్ లుక్‌ను విడుదల చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఆగస్టు 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇతర భాషల్లో ఈ సినిమాకు ‘సూర్యస్ సాటర్‌డే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

AP: గత YCP ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గుడ్ల కాంట్రాక్టర్లకు ₹112.5 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు ₹66 కోట్ల బకాయిలు పెట్టిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ కారణంగానే కొన్ని స్కూళ్లకు సరఫరా నిలిచిపోయిందన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన ఆయన.. బకాయిలను అతి త్వరలో చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు. విద్యార్థులకు గుడ్లు అందేలా చూడాలని ఆదేశించారు.

టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు బస చేసిన ITC మౌర్య హోటల్‌లో వారి కోసం రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ బఫే ఉంచారు. రోహిత్‌కు వడాపావ్, కోహ్లీకి చోలే బటూరే అందించారు. చాక్లెట్ ట్రఫుల్ రోల్స్, నాన్ ఖాటాయ్, సినామన్ సుగర్ పాల్మీర్, సన్డ్రీడ్ టమాటా, అమర్‌నాథ్ పిన్‌వీల్ స్నాక్స్‌తోపాటు మామిడి, చెర్రీ వంటి పండ్లను కూడా బఫెలో పెట్టారు.

తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాను ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి UP పోలీసులు చెప్పిన సమాధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘సేవాదార్ వేద్ ప్రకాశ్ మధుకర్ పేరిట సత్సంగ్ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు. అందుకే నిర్వహణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేశాం. భోలేబాబాను కూడా విచారిస్తాం. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియడంలేదు’ అని తెలిపారు. బాబా వెనకాల రాజకీయ శక్తులుండటంతోనే ఆయనను అరెస్ట్ చేయడంలేదని ఆరోపణలొస్తున్నాయి.

వడ్డీరేట్లు, ఆర్థిక విధానాల కంటే కూడా నీటి కొరత ఆర్థిక వ్యవస్థను ఎక్కువ ప్రభావితం చేస్తుందంటున్నారు విశ్లేషకులు. ‘ఢిల్లీ వాసులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. రాజస్థాన్‌లో పలు చోట్ల నాలుగు రోజులకోసారి ట్యాప్ వాటర్ వస్తుంటే, మహారాష్ట్రలో కొన్ని చోట్ల నీటి కోసం 1.5kmపైన వెళ్లాల్సి వస్తోంది. దీనిపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో నీటి కొరతకు వ్యవసాయ, పరిశ్రమ రంగాలు దెబ్బతింటాయి’ అని హెచ్చరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.