India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీసమేతంగా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 11గంటలకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ దంపతులు చింతమడకకు వెళ్తారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్‌లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో సతీసమేతంగా ఓటేయనున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి దంపతులు నేడు కొడంగల్‌కు వెళ్లనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలానికి వెళ్లనున్న రేవంత్, రెండు రోజుల పాటు సతీసమేతంగా అక్కడే ఉంటారని తెలుస్తోంది. గడచిన రెండు నెలలుగా ఆయన సహా రాజకీయ నేతలందరూ ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో భాగంగా నేడు KKR, GT అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి. కోల్‌కతా ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరింది. గుజరాత్‌కు మాత్రం ఇది చావో రేవో అన్న పరిస్థితి. ఈరోజు ఓడితే జీటీ కచ్చితంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సీఎస్కేపై హోం గ్రౌండ్‌లో గెలిచి ఊపుమీదున్న ఆ జట్టు అదే ఫామ్‌ను కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరం. కేకేఆర్ ఈరోజు గెలిస్తే పాయింట్స్ టేబుల్‌లో కచ్చితంగా తొలి 2 స్థానాల్లో నిలుస్తుంది.

ఉత్తర గాజాలోకి కొత్త సరిహద్దును తెరచినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అమెరికా ప్రభుత్వంతో సమన్వయం అనంతరం ‘పశ్చిమ ఈరెజ్’ సరిహద్దును తెరిచినట్లు వివరించింది. గాజాకు ఇప్పటి వరకు ఉన్న సరిహద్దుల నుంచి ఎటువంటి సాయం లోపలికి వెళ్లడం లేదంటూ UN ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ గాజాలోని రఫాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.

AP: ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధాని ఆహ్వానించారు. ఏపీలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి కూడా ఆహ్వానం అందింది. ఈక్రమంలో ఎల్లుండి ప్రత్యేక విమానంలో ఆయన వారణాసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎన్డీయే మిత్రపక్షాల సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. ఓటేయనివారిపై భారత్‌లో చర్యలు పెద్ద లేవు కానీ కొన్ని దేశాల్లో ఓటేయకపోతే పలు రకాలైన పర్యవసానాలు ఉంటాయని తెలుసా? అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఉరుగ్వే, టర్కీ తదితర దేశాల్లో ఓటు వేయకపోతే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది సంతృప్తికరంగా లేకపోతే జరిమానా తప్పదు. బెల్జియంలో వరసగా 4 ఎన్నికల్లో ఓటేయకపోతే జైలుకే. పెరూలో ఓటేయకపోతే రేషన్ ఇవ్వరు.

రికార్డు స్థాయిలో ఆరోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్, అధికారంలోకి రాగానే రక్షణమంత్రి షోయిగూను తొలగించారు. మాజీ ఉప ప్రధాని ఆండ్రీ బెలౌసోవ్‌ను కొత్త రక్షణ మంత్రిగా ప్రతిపాదించారు. 2012 నుంచి మంత్రిగా ఉన్న షోయిగూను రష్యా భద్రత మండలి కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఆ పదవిలోనే కొనసాగుతారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.

నిన్న CSKvsRR మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఫీల్డర్ త్రోకు అడ్డు రావడంతో అంపైర్ ఔట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. SRHతో మ్యాచ్‌లోనూ జడ్డూ ఇదే తరహాలో అడ్డు రాగా ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నారు. కానీ ఈసారి తాము చేసింది కరెక్టేనని RR కోచ్ సంగక్కర స్పష్టం చేశారు. జడ్డూ వెనక్కి సరాసరి పరిగెత్తకుండా బంతికి అడ్డువచ్చేందుకు యత్నించారని, అందువల్ల అతడి ఔట్ సరైనదేనని తేల్చిచెప్పారు.

జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు తర్వాత తొలిసారిగా శ్రీనగర్‌లో ఈ నెల 25న లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అగా రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి వహీద్ ఉర్ రెహమాన్‌కు మధ్య మాత్రమే పోటీ నెలకొంది. స్థానికులు 3 దశాబ్దాల్లో తొలిసారిగా హింసాత్మక బెదిరింపులకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటం విశేషం.

AP: పోలింగ్ కోసం ఎన్నికల సిబ్బంది పలు రకాలైన ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఈలచెట్ల దిబ్బ దీవికి సిబ్బంది నిన్న పడవల్లో చేరుకున్నారు. ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పంచుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గవ దశ ఎన్నికలు నేడు రాష్ట్రంలో జరగనున్నాయి.
Sorry, no posts matched your criteria.