News May 11, 2024

నివాసం ఎన్టీఆర్ జిల్లా.. ఓటు ఏమో కృష్ణా జిల్లా!

image

AP: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం ఈ ఎన్నికల్లో వైవిధ్యభరితమైన పాత్ర పోషించనుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈ మండలం NTR జిల్లాలో అంతర్భాగమైనప్పటికీ కృష్ణా జిల్లాతో ఎన్నికల సంబంధాన్ని కలిగి ఉంది. ఈ మండలంలోని 16 గ్రామాలు NTR జిల్లాలో, మరో 9 గ్రామాలు కృష్ణా(D)లోకి చేరాయి. దీంతో ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్‌కి ఓటేయనున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News May 11, 2024

ప్రజ్వల్ వ్యవహారం బయటపెట్టిన బీజేపీ నేత అరెస్ట్

image

సంచలనం రేపిన ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారాన్ని బయటపెట్టిన బీజేపీ నేత దేవరాజే గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ స్థలాన్ని విక్రయించే విషయంలో గౌడ తనను లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు. కాగా దేవరాజే గౌడ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో BJP తరఫున పోటీ చేసి ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ చేతిలో ఓడిపోయారు.

News May 11, 2024

చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17 సీజన్

image

ఐపీఎల్-17 సీజన్‌ మరో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. మరే సీజన్‌లోనూ ఇన్ని శతకాలు నమోదు కాలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు గిల్, సుదర్శన్ సెంచరీలు చేయడంతో ఈసారి శతకాల సంఖ్య 14కు చేరింది. కాగా 2023 సీజన్‌లో 12 సెంచరీలు నమోదయ్యాయి. అలాగే 2022లో 8, 2016లో 7, 2008/11/12/19లో ఆరు శతకాలు రికార్డుల్లోకి చేరాయి.

News May 11, 2024

ఓటు వేసే సమయంలో వచ్చే సమస్యలు

image

ఓటేసే సమయంలో కొన్నిసార్లు అన్ని సర్టిఫికేట్లు సరిగ్గా ఉన్నా ఓటర్లపై ఏజెంట్లు సందేహం వ్యక్తం చేసి నకిలీ వ్యక్తని ఓటేయనివ్వరు. అప్పుడు పోలింగ్ అధికారికి రూ.2 చెల్లించి FORM-14లో పేరు, అడ్రెస్ రాసిచ్చి వారి ఐడెంటిటీని నిరూపించుకొని ఓటేయొచ్చు. దీంతోపాటు మీ ఓటు ఆల్రెడీ ఇంకెవరో వేశారంటే వెంటనే పోలింగ్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేయాలి. టెండర్ ఓటును డిమాండ్ చేయొచ్చు. టెండర్ ఓటు పడితే రీపోలింగ్‌కు అవకాశం ఉంది.

News May 11, 2024

గిల్‌కు రూ.24 లక్షల ఫైన్

image

నిన్న CSKతో మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా GT కెప్టెన్ గిల్‌కు BCCI రూ.24 లక్షల ఫైన్ వేసింది. అలాగే 10 మంది టీమ్ సభ్యులకు, ఇంపాక్ట్ ప్లేయర్లకు రూ.6 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ సీజన్‌లో GT ప్లేయర్లకు జరిమానా వేయడం ఇది రెండోసారి. కాగా నిన్నటి మ్యాచులో గిల్, సాయిసుదర్శన్ సూపర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో GT 35 రన్స్ తేడాతో గెలుపొందింది.

News May 11, 2024

ఓటేసేందుకు ఇదే ఉత్సాహం చూపిస్తారా?

image

AP: ఎన్నికల వేళ మద్యం కోసం మందుబాబులు షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఓట్ల కోసం నేతలు డబ్బులు పంచడం, మద్యం అమ్మకాలపై ఈసీ ఆంక్షలు విధించడం, వైన్స్ షాపుల్లో స్టాక్ ఉండకపోవడం దీనికి కారణమని తెలుస్తోంది. నిన్న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ వైన్ షాప్ వద్ద జనం ఇలా లైన్‌లో కనిపించారు. దీంతో మద్యం కోసం చూపే ఈ ఉత్సాహాన్ని ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చూపించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

News May 11, 2024

TSRTC: ఆ ఉద్యోగులు టీషర్ట్, జీన్స్ వేసుకోవద్దు!

image

TG: ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో జీన్స్, టీ షర్టులు వేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫామ్ ధరిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్స్‌లోనే కార్పొరేషన్‌, డిపోలకు వస్తున్నారు. ఈక్రమంలో అందరూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మల్స్, యూనిఫామ్‌లో రావాలని ఎండీ సూచించారు.

News May 11, 2024

సంక్రాంతి సందడి తెచ్చిన ఓట్ల పండుగ

image

తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన హైదరాబాద్-విజయవాడ హైవే సంక్రాంతి రద్దీని తలపిస్తోంది. తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంతూళ్లకు భారీ సంఖ్యలో బయల్దేరుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు, బస్సులు బారులు తీరాయి. మరోవైపు విజయవాడలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. మరి మీరూ ఓటేసేందుకు వెళ్తున్నారా? కామెంట్ చేయండి.

News May 11, 2024

శుభ్‌మన్ గిల్ మరో రికార్డు

image

GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో మరో ఘనత సాధించారు. తక్కువ మ్యాచుల్లో (103) నాలుగు సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఏడు సెంచరీలతో బట్లర్ 2వ, ఆరు శతకాలతో క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, KL రాహుల్, డేవిడ్ వార్నర్ తలో నాలుగు సెంచరీలతో ఉన్నారు.

News May 11, 2024

Postal Ballot: 2019తో పోలిస్తే డబుల్

image

AP: 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. గురువారం వరకు దాదాపు 5 లక్షల ఓట్లు పోల్ కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2.38 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. 6 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఉద్యోగులు, టీచర్లు ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పెరిగిన ఓటింగ్ దేనికి సంకేతమనే చర్చ నడుస్తోంది.