India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అయోధ్యలో ప్రతిష్ఠాపన సమయంలో రామ్ లల్లా మాట్లాడినట్లు అనిపించిందని పీఎం మోదీ తెలిపారు. ‘అయోధ్యకు వెళ్లాక నన్ను నేను ప్రధానిగా కాక సాధారణ పౌరుడిగానే భావించాను. అది చాలా భావోద్వేగ క్షణం. రాముడిని తొలిసారి చూడగానే అలా చూస్తూ ఉండిపోయా. పండితులు ఏం చెబుతున్నారో వినిపించలేదు. భారత్‌కు స్వర్ణయుగం మొదలైందని రాముడు చెప్పినట్లు అనిపించింది. 140కోట్లమంది కలల్ని రాముడి కళ్లలో చూశాను’ అని వివరించారు.

తనకు నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘దిల్’ సినిమా ఏప్రిల్ 5నే విడుదలైందని దిల్ రాజు అన్నారు. దీంతో ఆ తేదీ తనకు లక్కీగా మారిందని చెప్పారు. అదే తేదీన విడుదల చేస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ బిగ్ హిట్ అవుతుందన్నారు. తాను తీసిన కుటుంబ కథా చిత్రాల్లో ‘శ్రీనివాస కళ్యాణం’ మినహా మిగతావన్నీ హిట్ అయ్యాయని తెలిపారు. ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో 70% ప్రేమ కథ, 30% ఫ్యామిలీ డ్రామా ఉంటుందన్నారు.

గూగుల్ పాడ్‌కాస్ట్ యాప్ ఏప్రిల్ 2 నుంచి పని చేయదు. ఈ నేపథ్యంలో యూజర్లు తమ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఈ పాడ్‌కాస్ట్ తరహా సేవలు యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో అందించనుంది. పాడ్‌కాస్ట్ డేటా యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే.. పాడ్‌కాస్ట్ యాప్‌లో ఎక్స్‌పోర్ట్స్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ యూట్యూబ్ మ్యూజిక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

TG: కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు కేసీఆర్ సిగ్గుపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్.. వారి హయాంలోనే కుప్పకూలిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10వేల కోట్లు అవుతుందని చెప్పారు. సాగునీటి రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌కు రూ.1700కోట్ల పన్ను నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సొమ్ము రికవరీపై తాము ఎలాంటి చర్యలు చేపట్టమని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ తాము ఏ పార్టీకి ఆటంకాలు కలిగించాలని అనుకోవట్లేదని తెలిపింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేయాలని కోర్టుకు ఐటీ శాఖ విజ్ఞప్తి చేసింది.

TG: మాజీ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. వాటిని ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ చీఫ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భయాందోళనలతో కేసీఆర్ పొలం బాట పట్టారని విమర్శించారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు.

AP: పింఛన్ల పంపిణీపై వైసీపీ, టీడీపీ మధ్య ట్విటర్ వార్ జరుగుతోంది. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకులకు సెలవులు కావటంతో ఈ నెల పింఛన్లు 3న ఇస్తామని గత నెల 28న సాక్షిలో వార్త రాశారు. ఇప్పుడేమో రాజకీయాల కోసం అవ్వాతాతలను మోసం చేస్తున్నారు’ అని టీడీపీ ట్వీట్ చేసింది. దీనికి ‘చంద్రబాబు, నిమ్మగడ్డ పన్నిన కుట్రకు అవ్వాతాతలు బలయ్యారు. ఎన్నికల్లో టీడీపీని అవ్వాతాతలు తరమడం ఖాయం’ అని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అక్కడి 30 ప్రాంతాలకు తమ భాషలో కొత్త పేర్లను పెట్టింది. ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ప్రకారం.. ఈ 30 ప్రాంతాల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఒక సరస్సు, పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయి. వచ్చే నెల 1 నుంచి ఈ పేర్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అరుణాచల్ తమదేనంటూ చైనా చాలాకాలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

APలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సీఈసీ ఖరారు చేసింది. కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల పోటీ చేయనుండగా.. ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడలో పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో ఉండనున్నారు. ఇక 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టింది.

ఏపీలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నాయి. కడప, నంద్యాల, కర్నూలు, ATP జిల్లాల్లో 40-43 డిగ్రీలు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 40-44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, SKLM, కాకినాడ, తూ.గో జిల్లాల్లోనూ 40- 42 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వడగాల్పులు అధికంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Sorry, no posts matched your criteria.