News March 28, 2024

అచ్చెన్నాయుడుకు ఊరట

image

AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అచ్చెన్న దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది.

News March 28, 2024

వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారు: పురందీశ్వరి

image

AP: వైసీపీ పాలనను అంతం చేసేందుకే TDP-JSPతో పొత్తు పెట్టుకున్నామని BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, అందుకే పేదరికం తగ్గుతోందని చెప్పారు. మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News March 28, 2024

నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం: క్లాసెన్

image

ఉప్పల్ స్టేడియంలో విధ్వంసం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్ తెలుగు అభిమానుల మనసు గెలుచుకున్నారు. 34 బంతుల్లోనే 80* రన్స్ చేసిన అతడు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘నా గడ్డం ఆరెంజ్. నేను ధరించే షూ ఆరెంజ్. ఇక నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం’ అని తెలిపారు. మరోవైపు అతణ్ని గోల్డ్ కలర్‌లో ఉన్న భారీ మెడల్‌తో SRH సత్కరించడంతో కావ్య మారన్ గిఫ్ట్ ఇచ్చారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 28, 2024

భారీ జీతంతో రైల్వేలో 9,144 ఉద్యోగాలు

image

ఇండియన్ రైల్వేలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలకు ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. జులై 1 2024 నాటికి వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్‌-1కు రూ.29,200-రూ.92,300, గ్రేడ్-3కి రూ.19,900-రూ.62,200 పే స్కేల్ లభించనుంది. విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 28, 2024

జపానా మజాకా.. ల్యాండర్ మళ్లీ మేల్కొంది!

image

జనవరిలో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన జపాన్ ల్యాండర్ ఇంకా సమర్థంగా పనిచేస్తుండటం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ప్లాన్ ప్రకారం ల్యాండింగ్ జరగకున్నా విజయవంతంగా పనిచేయసాగింది. రెండు వారాల లూనార్ నైట్ తర్వాత యాక్టివేటై జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీకి (JAXA) ఫొటోలు పంపింది. తాజాగా మరో 2 వారాల లూనార్ నైట్ పూర్తిచేసుకున్న ల్యాండర్ మళ్లీ మేల్కొంది. ఈ లేటెస్ట్ ఫొటోలను JAXA ఎక్స్‌లో షేర్ చేసింది.

News March 28, 2024

హిందూపురం నుంచి కదలను: పరిపూర్ణానంద

image

AP: హిందూపురం నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు పరిపూర్ణానంద స్వామిజీ. టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. స్వామీజీ అయిన తనకు టికెట్ ఇస్తే ముస్లింల ఓట్లు పోతాయని చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పారని తెలిపారు. ముస్లింల ఓట్ల కోసం జనాభాలో ఎక్కువ శాతం ఉన్న హిందువుల ఓట్లు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

News March 28, 2024

ఘోరం.. పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదని పొడిచేశారు

image

మహారాష్ట్రలోని భివండీలో దారుణ ఘటన జరిగింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదనే కారణంతో ఓ విద్యార్థిపై ముగ్గురు క్లాస్‌మేట్స్ దాడి చేశారు. తర్వాత కత్తితో పొడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2024

జాక్‌పాట్: లాటరీలో రూ.9,400 కోట్లు గెలిచాడు..

image

అమెరికా లాటరీలో ఓ వ్యక్తికి జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.9,400 కోట్లు గెల్చుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు. మెగా మిలియన్స్ అనే లాటరీ గేమ్‌లో మంగళవారం డ్రా తీశారు. అందులో ఒక వ్యక్తి ఆ మొత్తం గెల్చుకున్నారని గేమ్ అధికారులు తెలిపారు. అయితే అతడి పేరు వెల్లడించలేదు. కాగా జాక్‌పాట్ చరిత్రలో ఇది ఐదో అతిపెద్ద లాటరీ. విజేత మొత్తం డబ్బును ఒకేసారి లేదా 29 వార్షిక వాయిదాలలో పొందే అవకాశం ఉంది.

News March 28, 2024

సంక్రాంతి బరిలో కాంతార 2!

image

అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా ‘కాంతార’. ₹20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ₹400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అప్పటి నుంచి ఈ సినిమా ప్రీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే కొంత కాలంగా ఈ ప్రీక్వెల్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండో పార్ట్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట.

News March 28, 2024

ఫోన్ ట్యాపింగ్‌కు వారిద్దరే మూల కారకులు: ఎంపీ లక్ష్మణ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై CM రేవంత్ స్పందించి CBIతో విచారణ చేయించాలని BJP MP కె.లక్ష్మణ్ అన్నారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరు. KCR కూడా ఎవరినీ నమ్మలేదు. అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్‌కు KCR, KTR మూల కారకులు. కేంద్రం అనుమతి లేకుండా ట్యాపింగ్ చేశారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్కులు, డేటా ధ్వంసం చేశారు’ అని ఆరోపించారు.