News April 21, 2024

పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్

image

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ టామీ బ్యూమాంట్ పెళ్లి చేసుకున్నారు. ప్రియుడు కల్లమ్ డేవీని ఆమె పెళ్లాడారు. కొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని టామీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమెకు సహచర క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

News April 21, 2024

ఒం‘గోల్’ కొట్టేదెవరో?

image

AP: ఈసారి ఒంగోలులో జెండా ఎగురవేయాలని అటు YCP ఇటు TDP కసితో ఉన్నాయి. ఇందుకు ఇరు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. YCP నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి.. TDP నుంచి దామచర్ల జనార్దన్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ పోటీ పడడం ఇది నాలుగోసారి. 1999 నుంచి ఒక్కసారి మినహా అన్ని సార్లూ బాలినేనినే విజయం వరించింది. ఒక్కసారే దామచర్ల గెలిచారు. ఈసారి వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. <<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

భారీ వరదలు.. అప్రమత్తంగా ఉండండి: చైనా

image

వందేళ్లలో ఒకసారి వచ్చే స్థాయి వరదలు రానున్నాయని, అప్రమత్తంగా ఉండాలని చైనా తమ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయి వర్షాలు కురుస్తున్నాయి. మున్ముందు అవి తీవ్ర స్థాయికి చేరతాయని చైనా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో అత్యవసరంగా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. పెరల్ నది డెల్టా ప్రాంతంలో 19 అడుగుల ఎత్తు వరకు వరద ప్రవాహం రావొచ్చని సర్కారు హెచ్చరించడం గమనార్హం.

News April 21, 2024

ఆ మూవీలో హీరోయిన్‌గా ఫస్ట్ నన్నే అడిగారు: మానుషీ

image

‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్‌’లో ప్రీతి పాత్ర కోసం తొలుత తననే సంప్రదించారని ప్రపంచ మాజీ సుందరి మానుషీ చిల్లర్ తెలిపారు. అయితే షాహిద్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ అని తెలియక, వేరే కమిట్‌మెంట్స్ కారణంగా మిస్ చేసుకున్నానని వివరించారు. డైరెక్టర్ సందీప్ వంగా సినిమాలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. యానిమల్‌ మూవీలో రష్మిక యాక్టింగ్ అద్భుతమని కొనియాడిన ఆమె.. అలాంటి పాత్రలు చేయాలని ఉందని అన్నారు.

News April 21, 2024

ఫ్రూట్ విలేజ్.. ఏడాదికి రూ.50కోట్ల ఆదాయం!

image

మహారాష్ట్రలోని ధుమల్‌వాడీ గ్రామం ‘ఫ్రూట్ విలేజ్’గా ప్రభుత్వ గుర్తింపు పొందింది. 250 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఒకప్పుడు గోధుమలు, జొన్నలు సాగు చేసేవారు. పంటలు సరిగా పండకపోవడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించి, సీజన్‌ను బట్టి 20 రకాల పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు. ఏడాదికి దాదాపు రూ.40-50కోట్ల ఆదాయం పొందుతున్నారు. దీంతో ఇక్కడి యువ రైతులకు పిల్లనివ్వడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడుతున్నారట.

News April 21, 2024

రేపు ‘సత్యభామ’ నుంచి అప్‌డేట్

image

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ ‘సత్యభామ’. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రేపు సాయంత్రం 4.05 గంటలకు అప్‌డేట్‌ ఇవ్వనన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

News April 21, 2024

హంతకులకు ఓటు వేయొద్దు: వైఎస్ సునీత

image

AP: నేర చరిత్ర కలిగిన హంతకులకు ఎన్నికల్లో ఓటు వేయొద్దని వైఎస్ సునీత కోరారు. ‘క్రిమినల్ కేసులు ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చిందో వైసీపీ చెప్పాలి? నేర చరిత్ర ఉన్న వారికి టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీ వెబ్‌సైట్‌లో పేర్కొనాలి. అవినాశ్ నేరచరిత్రపై ఈసీకి ఎందుకు తెలపలేదు? అభ్యర్థిపై క్రిమినల్ కేసులుంటే అఫిడవిట్‌లో తెలపాలి. కానీ ఈ నిబంధనలన్నీ వైసీపీ తుంగలో తొక్కింది’ అని ఆమె విరుచుకుపడ్డారు.

News April 21, 2024

25 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్లు

image

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆడుజీవితం(ది గోట్ లైఫ్)’. ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

News April 21, 2024

RCB ముందు భారీ టార్గెట్

image

కోల్‌కతా 222 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్ సాల్ట్ శుభారంభాన్ని ఇచ్చారు. 14 బంతుల్లోనే 48 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లే తర్వాత చకచకా వికెట్లు పడటంతో కెప్టెన్ అయ్యర్ 50 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. చివర్లో రమణ్‌దీప్ 9 బంతుల్లో 24* రన్స్‌తో రాణించారు. RCB బౌలర్లలో గ్రీన్, యశ్ చెరో రెండు వికెట్లు తీశారు.

News April 21, 2024

గులకరాయి డ్రామాను ప్రజలు ఛీ కొడుతున్నారు: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ గులకరాయి డ్రామాను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని TDP చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘బీ ఫామ్ అందుకున్న ప్రతీ అభ్యర్థి గెలిచి రావాలి. 3 పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. కొత్త అభ్యర్థులు పార్టీ నిబంధనలు పాటించాలి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్నదే నా ఆశయం. ప్రజాగళానికి వస్తున్న ఆదరణ చూసి జగన్ వణికిపోతున్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేకే జగన్ డ్రామాలాడుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు.