India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. BIEAP అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ప్రధాన నిందితుడు ముస్సావిర్ షాజీబ్ హుస్సేన్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. బాంబు పేలుళ్ల తర్వాత అతడు అస్సాం, పశ్చిమబెంగాల్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.
కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఎవరూ ఫెయిల్ కావాలని, మార్కులు తక్కువ రావాలని పరీక్షలు రాయరు. కానీ అనుకోని ఫలితం ఎదురైతే ఒత్తిడికి గురయ్యే యువ హృదయాలకు తల్లిదండ్రులు అండగా నిలవండి. నిరాశ చెందే మీ పిల్లలకు జీవితం అంటే ఇది మాత్రమే కాదని, ఇక్కడితోనే అంతా ఆగిపోదని భరోసానివ్వండి. భయాందోళనలో ఉండే మీ పిల్లలను కనురెప్పల్లా కాపాడుకోండి తప్ప.. భరించలేని భారంగా వారికి కన్పించవద్దని మనవి.
AP: ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఉండి టికెట్‌పై ఆయన స్పష్టత తీసుకునేందుకు చర్చలు జరపనున్నారు. కాగా ఉండి టికెట్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబుపై రామరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెబల్‌గానైనా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
దేశ యువత ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ఓటు హక్కు కోసం యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే 18-19ఏళ్ల యువతలో 40% కంటే తక్కువ మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. ఓటు హక్కుపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా యువత తీరు దేశాన్ని కలవరపరిచేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
TG: ఉద్యోగుల పదవీ విరమణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్ నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అదే అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ పద్ధతిని అమల్లోకి తేనుంది. గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో చాలా రిటైర్మెంట్లు ఆగిపోయాయి. మార్చి 31 నుంచి రిటైర్మెంట్లు మళ్లీ మొదలవడంతో ఖాళీలు ఏర్పడనున్నాయి.
నెట్స్‌లో జస్ప్రీత్ బుమ్రా తన యార్కర్లతో నా కాళ్లను పచ్చడి చేసేవాడని.. లేదంటే బ్యాట్ విరగ్గొట్టేవాడని ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మేమిద్దరం రెండు మూడేళ్లుగా కలిసి ఆడుతున్నామని.. అప్పటినుంచి ఇదే పరిస్థితి అని చెప్పారు. కాగా నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. తన యార్కర్లతో RCB బ్యాటర్లకు చుక్కలు చూపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు.
AP: రాష్ట్రంలో సంచలనం రేపిన 1996 నాటి శిరోముండనం కేసులో ఇవాళ విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు బెంచ్ తుది తీర్పు వెలువరించనుంది. 27 ఏళ్ల కిందట కోనసీమ జిల్లా వెంకటాయ పాలెంలో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. ఇద్దరికి గుండు కొట్టించి, కనుబొమ్మలు గీయించారు. బాధితుల్లో ఒకరు మరణించగా.. మిగతా నలుగురు న్యాయం కోసం కోర్టుకెళ్లారు. YCP MLC తోట త్రిమూర్తులు సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
భారతీయుల దెబ్బకు మాల్దీవులు దిగొచ్చింది. భారత పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మాలేలో భారత హైకమిషనర్‌తో చర్చలు జరిపింది. భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఇరుదేశాల మధ్య పర్యాటక సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
TG: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. గతనెల ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లిదండ్రులు ఇవాళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంకన్నగూడెంకు చెందిన అనిల్, దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కుటుంబ కలహాలతో వారు గతనెల పిల్లలిద్దరికీ పురుగుమందు తాగించి హత్య చేసి పరారయ్యారు. ఇప్పుడు స్థానిక అడవిలో ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.