India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పంజాబ్‌తో మ్యాచులో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో నికోలస్ పూరన్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. రాహుల్‌కు రెస్ట్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
PBKS: ధావన్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, కరన్, జితేష్, శశాంక్, బ్రార్, హర్షల్, రబడా, చాహర్, అర్ష్‌దీప్
LSG: డీకాక్, రాహుల్, పడిక్కల్, బదోనీ, పూరన్, స్టోయినిస్, కృనాల్, బిష్ణోయ్, మొహ్సిన్, మయాంక్ యాదవ్, మణిమారన్
AP: పెళ్లైన కొన్ని గంటల్లోనే ఓ నవ వధువు మృతిచెందారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డలో జరిగింది. నిన్న రాత్రి 10 గంటలకు ఓ యువకుడితో అఖిల (20) వివాహం జరిగింది. ఆ తర్వాత నీరసంగా ఉందంటూ నిద్రపోయారు. కాసేపటి తర్వాత కుటుంబసభ్యులు పిలిచినా స్పందించకపోవడంతో వెంటనే ఆమెను సాలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు.
వ్యాయామం శరీరానికి మేలు చేసినట్టే చదువు కూడా చేస్తుందట! మూడు తరాలకు చెందిన 3,101 మందిపై US, నార్వే, UKకు చెందిన నిపుణులు పరిశోధించి ఈ విషయం కనుగొన్నారు. విద్యపై ఎంత ఎక్కువ కాలం గడిపితే వృద్ధాప్యం అంత నెమ్మదిగా వస్తుందట. శరీరంలోని కణాలు డ్యామేజ్ కావడాన్ని తగ్గిస్తుందని, ఫలితంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. ఇది కచ్చితంగా ఎలా జరుగుతోందనే విషయంపై పరిశోధన చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును BCCI ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. WC కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ICC గడువిచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు BCCI సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా IPL స్టార్లపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు టాక్. ఈ టోర్నీలో రాణించిన ఒకరిద్దరికి జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
AP: గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై APPSC సభ్యుడు పరిగె సుధీర్ కీలక అప్డేడ్ ఇచ్చారు. త్వరలో గ్రూప్-2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదలవుతాయని వెల్లడించారు. ఫిబ్రవరి 25న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 4 లక్షల మంది హాజరయ్యారు.
AP: ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది.
ఎండిన పంటలను పరిశీలించేందుకు BRS అధినేత KCR రేపట్నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉ.8:30గంటలకు ఎర్రవల్లి నుంచి బయలుదేరుతారు. 10:30కు ధరావత్ తండాకు(జనగామ), 11:30కి తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాలు(సూర్యాపేట), మ.2గంటలకు సూర్యాపేట MLA ఆఫీసులో భోజనం, 3గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్, సా.4:30లకు నిడమనూరు మండలం, సా.6గంటలకు ఎర్రవల్లికి బయల్దేరతారు.
TG: కాంగ్రెస్‌లో తాను ఏక్‌నాథ్ షిండే అవుతానంటూ BJP MLA మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటరిచ్చారు. ‘నాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సత్యదూరమైనవి. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరతానని ఆయనే అడిగారు. మాకు మెజార్టీ ఉంది కాబట్టి అవసరం లేదని చెప్పా. పార్టీలో చేర్చుకోలేదని ఏదేదో మాట్లాడుతున్నారు. అమిత్ షా, గడ్కరీ వద్దకు వెళ్లి ఏదో చెప్పానని అంటున్నారు’ అని మండిపడ్డారు.
క్లిష్టమైన పరీక్షల్లో సివిల్స్ ఒకటి. ఈ పరీక్షలో ఫెయిల్ అయినా.. IAS అయిన కేరళకు చెందిన అబ్దుల్ నాసర్ గురించి మీకు తెలుసా? ఆయన 5 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగారు. ఎన్నో సవాళ్ల నడుమ పీజీ పూర్తి చేశారు. 1994లో ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన.. వృత్తిపరంగా కనబర్చిన నిబద్ధత, కృషికి గాను 2006 నాటికి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. 2017లో IAS హోదా పొంది తన కలను నెరవేర్చుకున్నారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు పోలీస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరిద్దరూ 48 గంటలపాటు జైలులో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.