India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్స్ మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, అస్టన్ అగర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. 2024-25 సీజన్‌కు గానూ వీరి సెంట్రల్ కాంట్రాక్టును సీఏ రద్దు చేసింది. జేవియర్ బార్ట్‌లెట్, అరోన్ హార్డీ, మాథ్యూ షార్ట్, నాథన్ ఎల్లిస్‌కు తొలిసారి కాంట్రాక్ట్ కట్టబెట్టింది. వీరందరూ గతేడాది జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఏప్రిల్ 6న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ‘నా దగ్గర ‘‘అంత డబ్బు’’ లేకపోవడం వల్లే ఎన్నికలకు దూరంగా ఉంటున్నా’ అని ఆమె చెప్పారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ చేస్తున్న నేతలంతా తాను చెప్పిన ‘అంత డబ్బు’ ఖర్చు చేస్తున్నారా?, మరి డబ్బు లేని వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదనేదే తన ఉద్దేశమా అని అంటున్నారు. దీనిపై మీ కామెంట్? .
TG: BRS సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్‌లో చేరే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ఈనెల 30న హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. కేకేతో పాటు ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కాసేపటి క్రితమే కేకే.. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీ మారేందుకు ఆయన అనుమతి తీసుకునేందుకు కేకే వెళ్లినట్లు తెలుస్తోంది.
TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాంబోలో తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీలో మురళీ శర్మ, ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన పద్మరాజన్ పోటీ చేస్తుంటారు. సర్పంచ్ నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకూ బరిలోకి దిగుతారు. ఇప్పటివరకు ఆయన 238 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఎలక్షన్ కింగ్‌గా పిలిచే పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాజ్‌పేయీ, మన్మోహన్, మోదీ, రాహుల్ మీద పోటీకి దిగారు. డిపాజిట్ల రూపంలో రూ.లక్షలు నష్టపోయారు. ప్రస్తుతం ఆయన ధర్మపురి నుంచి MPగా పోటీ చేస్తున్నారు.
ఢిల్లీ సీఎంగా కొనసాగడంలో భారీ ఊరట లభించిన కాసేపటికే అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కోర్టు ఆయనకు మరో 4 రోజుల ఈడీ కస్టడీని పొడిగించింది. దీంతో కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 1 వరకు కస్టడీలో ఉండనున్నారు.
FY24 ఆర్థిక ఏడాది చివరి వర్కింగ్ డేను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 1100 పాయింట్లు తాకి 74,105కు చేరగా, నిఫ్టీ 350 పాయింట్లు లాభపడి 22,500 మార్క్ టచ్ చేసింది. అయితే ఒడుదొడుకుల కారణంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 655 పాయింట్ల లాభంతో 73,651 వద్ద.. నిఫ్టీ 219 పాయింట్లు పెరిగి 22,343 వద్ద స్థిరపడ్డాయి. గుడ్ ఫ్రైడే కావడంతో రేపు మార్కెట్లకు సెలవు ఉండనుంది.
హీరోయిన్ అదితీ రావు హైదరీతో పెళ్లి ప్రచారంపై హీరో సిద్ధార్థ్ స్పందించారు. ‘She Said YES! E. N. G. A. G. E. D’ అని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అదితి కూడా ‘He Said YES! E. N. G. A. G. E. D’ అని పోస్టు చేశారు. రింగ్స్ మార్చుకున్న ఫొటో షేర్ చేశారు. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. కాగా.. వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలో వీరి పెళ్లి జరిగినట్లు వార్తలు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.