India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫారిన్ కరెన్సీ బాండ్ల ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ కోసం $1 బిలియన్‌ను సమీకరించేందుకు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందట. జూన్ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తికానుంది. మరోవైపు గుజరాత్‌లోని ముంద్రాలో తొలి కాపర్ రిఫైనరీ ప్లాంట్‌ను నేడు ప్రారంభించడం ద్వారా మెటల్ ఇండస్ట్రీలోకి అదానీ గ్రూప్ అడుగుపెట్టింది.
TG: బీజేపీ ఎంపీ బండి సంజయ్ సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోడుప్పల్ సమీపంలోని చెంగిచర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకుగాను ఈ కేసు నమోదైంది. కాగా హోలీ పండగ నాడు హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు బండి సంజయ్ నిన్న అక్కడకి చేరుకున్నారు. బండి సంజయ్‌ను పోలీసులు అనుమతించకపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయన జైలులో ఉన్నందున సీఎంగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా ఇవాళ్టితో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అచ్చెన్న దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది.
AP: వైసీపీ పాలనను అంతం చేసేందుకే TDP-JSPతో పొత్తు పెట్టుకున్నామని BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, అందుకే పేదరికం తగ్గుతోందని చెప్పారు. మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉప్పల్ స్టేడియంలో విధ్వంసం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్ తెలుగు అభిమానుల మనసు గెలుచుకున్నారు. 34 బంతుల్లోనే 80* రన్స్ చేసిన అతడు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘నా గడ్డం ఆరెంజ్. నేను ధరించే షూ ఆరెంజ్. ఇక నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం’ అని తెలిపారు. మరోవైపు అతణ్ని గోల్డ్ కలర్‌లో ఉన్న భారీ మెడల్‌తో SRH సత్కరించడంతో కావ్య మారన్ గిఫ్ట్ ఇచ్చారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియన్ రైల్వేలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలకు ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. జులై 1 2024 నాటికి వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్-1కు రూ.29,200-రూ.92,300, గ్రేడ్-3కి రూ.19,900-రూ.62,200 పే స్కేల్ లభించనుంది. విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ <
జనవరిలో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన జపాన్ ల్యాండర్ ఇంకా సమర్థంగా పనిచేస్తుండటం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ప్లాన్ ప్రకారం ల్యాండింగ్ జరగకున్నా విజయవంతంగా పనిచేయసాగింది. రెండు వారాల లూనార్ నైట్ తర్వాత యాక్టివేటై జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీకి (JAXA) ఫొటోలు పంపింది. తాజాగా మరో 2 వారాల లూనార్ నైట్ పూర్తిచేసుకున్న ల్యాండర్ మళ్లీ మేల్కొంది. ఈ లేటెస్ట్ ఫొటోలను JAXA ఎక్స్‌లో షేర్ చేసింది.
AP: హిందూపురం నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు పరిపూర్ణానంద స్వామిజీ. టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. స్వామీజీ అయిన తనకు టికెట్ ఇస్తే ముస్లింల ఓట్లు పోతాయని చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పారని తెలిపారు. ముస్లింల ఓట్ల కోసం జనాభాలో ఎక్కువ శాతం ఉన్న హిందువుల ఓట్లు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
మహారాష్ట్రలోని భివండీలో దారుణ ఘటన జరిగింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదనే కారణంతో ఓ విద్యార్థిపై ముగ్గురు క్లాస్‌మేట్స్ దాడి చేశారు. తర్వాత కత్తితో పొడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.