India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపూరం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:40 గంటలకు పుట్టపర్తి సత్య సాయిబాబా విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6 సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ భారీ బహిరంగ సభను ఘనంగా జరుపుకునేందుకు కూటమి నేతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. రాళ్ల దాడిలో దెబ్బతిన్న కారును పోలీసులు పరిశీలించారు.

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.

అనంతపురం జిల్లాకు ఈనెల 10న CBN విచ్చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం నగరానికి సమీపాన ఉన్న వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా NH-44 జాతీయ రహదారికి మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

చంద్రబాబు పాల్గొనే సూపర్-6 సూపర్ హిట్ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో కలిసి ముందస్తు ఏర్పాట్ల, సెక్యూరిటీ పరిశీలన చేస్తున్నామన్నారు. హెలిప్యాడ్, ప్రధాన వేదిక, ముఖ్యమంత్రి వెళ్లే రూట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 600 నుంచి 800 మధ్య జ్వర పీడితులు ఉన్నట్లు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతపురం GGHలో 1,267 బెడ్స్ ఉన్నాయని చెప్పారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా బెడ్స్ కేటాయిస్తున్నామని అన్నారు. నార్పల, పెద్దవడుగూరు, యాడికి, బెలుగుప్ప, కళ్యాణదుర్గం ప్రాంతాల నుంచి జ్వర కేసులు వస్తున్నాయని తెలిపారు.

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వినోద్‌కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.

జిల్లాలో యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం రాప్తాడు మండలం అయ్యవారిపల్లి రోడ్‌లో ఉన్న మార్క్‌ఫెడ్ స్టాక్ స్టోర్ గోడౌన్‌ను తనిఖీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉన్న యూరియాపై అధికారులతో ఆరా తీశారు. యూరియా పంపిణీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. అనంతపురంలోని బెంగుళూరు జాతీయ రహదారి పక్కన ప్రసన్నాయపల్లి గేటు వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎస్పీ వెంకటేసులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.