EastGodavari

News July 5, 2025

మరో రెండు రోజులు గోదావరి వరద ఉద్ధృతి

image

గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మరో రెండు రోజులు వరద ప్రవాహం ఇదే తరహాలో ఉంటుందని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. సీలేరుతో కలిపి శనివారం గోదావరి ఇన్‌ఫ్లో 1,70,929 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. 3 డెల్టాలకు సాగునీటి అవసరాల నిమిత్తం 12,100 క్యూసెక్కులు విడిచిపెడతామన్నారు. మిగిలిన 1,60,218 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలనున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News July 5, 2025

రాజమండ్రిలో మహిళ హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు

image

రాజమండ్రికి చెందిన మహిళ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. 2013 డిసెంబర్ 2న లక్ష్మీవారపు పేటకు చెందిన నాగభారతిని మహేశ్‌, లక్ష్మణరావు, మరో వ్యక్తి బంగారం కోసం హత్య చేశారు. మహిళ భర్త ప్రసాదరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాదనలు విన్న పదో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు కమ్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఉమశునంద ముగ్గురు హత్య చేశారని నిర్ధారించి శుక్రవారం తీర్పు చెప్పారు.

News July 5, 2025

పీఎం ఫసల్ బీమా యోజన నమోదు ప్రక్రియ ప్రారంభం

image

పీఎం ఫసల్ బీమా యోజన సార్వా పంటకు నమోదు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DAO ఎస్ మాధవరావు తెలిపారు. జిల్లాలో వరి, మినుము, అరటిపంటను నోటిఫై చేసినట్లు వివరించారు. వరి ఎకరాకు రూ.570, మినుము రూ.300, అరటి ఎకరాకు రూ.3వేల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. ఆగస్టు 15 వరకు మినుము, ఈనెల 15లోపు అరటి పంటకు ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. రైతులు ఈ-క్రాఫ్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.

News May 8, 2025

తూ.గో: అవార్డు అందుకున్న కలెక్టర్

image

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆంధ్రపదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా ప్రశంపా పత్రం స్వీకరించారు. 2022-23 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఇండియన్ రెడ్‌ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం కోసం చేసిన కృషిని గుర్తింపు లభించింది.

News May 7, 2025

రాజానగరం: ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు కేంద్రాలు ఏర్పాటు

image

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించే ఏపీ పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షకు గైట్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రెండు పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రామానుజం, వైస్ ప్రిన్సిపల్ టి.రామారావు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GIET కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,791 మంది పరీక్ష రాయనున్నట్టు పేర్కొన్నారు.

News May 7, 2025

దేవరపల్లి: తల్లిదండ్రులకు నెలకు 5,000 చెల్లించండి

image

తల్లితండ్రులను వృద్ధాప్య దశలో చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ప్రశాంతి మండిపడ్డారు. శనివారం దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన కోలా వరలక్ష్మి, కృష్ణమూర్తి వయోవృద్ధుల పోషణ సంక్షేమ ట్రిబ్యునల్‌లో నమోదు అయ్యింది. కలెక్టర్ ఛాంబర్‌లో ఆర్డీవో రాణి సుస్మిత, ఫిర్యాదుదారుడి సమక్షంలో కోర్టు నిర్వహించారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు ప్రతి నెల ఐదు వేలు చెల్లించాలని ఆదేశించారు.

News May 7, 2025

రాజానగరం: ‘అమ్మ మమ్మల్ని చంపేస్తుంది.. నాన్న దగ్గరికి వెళ్లిపోతాం’

image

‘అమ్మ వేరొకరితో ఉంటుంది. అతను మమ్మల్ని బెల్టుతో కొడుతున్నాడు. ఆ బాధలు తట్టుకోలేకపోతున్నాం. మా నాన్నకు అప్పగించండి, లేకుంటే అమ్మ మమ్మల్ని చంపేస్తుంది’ అంటూ రాజానగరం(M) కొంతమూరు చెందిన తేజకిరణ్ (10) భానుప్రకాశ్(8) అనే చిన్నారులు పోలీసులను వేడుకున్నారు. గ్రామానికి చెందిన మహిళకు ప్రవీణ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడగా.. పిల్లలను పట్టించుకోకుండా వారిని కొడుతున్నారని SI నారాయణమ్మ తెలిపారు.

News May 7, 2025

రాజమండ్రి జైలుకి రైలులో దోచేస్తున్న దొంగలు

image

రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి చేసి సెల్‌ఫోన్ అపహరించి, బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులను తెనాలి జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిడుబ్రోలుకు చెందిన దేవర సాయి, యర్రంశెట్టి వంశీ కాకినాడ- తిరుపతి రైలులో ప్రయాణిస్తున్న సంతోష్ కుమార్‌ను కొట్టి సెలోఫోన్ దొంగిలించారు. ఈ కేసులో టెక్నాలజీ పరంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం రాజమండ్రి జైలుకి తరలించారు.

News May 7, 2025

గోకవరంలో వ్యభిచార గృహంపై దాడి

image

గోకవరం మేజర్ గ్రామపంచాయతీ శివారులో వ్యభిచారం జరుగుతున్న గృహంపై ఎస్ఐ పవన్ కుమార్ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రైడ్ చేశారు. ఈ రైడ్‌లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మగవాళ్లు, ఆడవాళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యభిచార నిర్వాహకురాలు బదిరెడ్డి పద్మావతిని అదుపులో తీసుకున్నారు. గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జైలుకు పంపిస్తానని SI తెలిపారు.

News May 7, 2025

తూ.గో: ప్రేమజంట సూసైడ్.. ఏం జరిగిందంటే?

image

నెల్లూరులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొవ్వూరుకు చెందిన జోసఫ్, కైకలూరుకు చెందిన శ్రావణి 21న నెల్లూరు సింహపురి హోటల్లో రూము తీసుకున్నారు. తర్వాత రోజు బయటకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత రూము నుంచి బయటకు రాలేదు. విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం వరకు బయటకు రాకపోవడం, రూము నుంచి దుర్వాసన వెదజల్లడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇలా చేశారని సమచారం.