news

News April 12, 2025

రాబోయే 3 రోజుల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది.

News April 12, 2025

‘స్పిరిట్’ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా?

image

సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్/అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్క్రీన్ ప్లే రాసేందుకు డైరెక్టర్ 6 నెలల సమయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో రెబల్ స్టార్ పోలీసుగా కనిపించనుండగా, స్టంట్స్‌తో కూడిన భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

News April 12, 2025

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ షెడ్యూల్

image

AP: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి.
*మే 12- సెకండ్ లాంగ్వేజ్
*మే 13- ఇంగ్లిష్
*మే 14- మ్యాథ్స్-1A, 2A, బోటని, సివిక్స్
*మే 15- మ్యాథ్స్- 1B, 2B, జువాలజీ, హిస్టరీ
*మే 16- ఫిజిక్స్, ఎకనామిక్స్
*మే 17- కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ
**మే 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్ ఉ.9-మ.12 వరకు, సెకండియర్ మ.2.30-సా.5.30 వరకు.

News April 12, 2025

IPL: సాయి సుదర్శన్.. కన్సిస్టెన్సీ కా బాప్..!

image

లక్నోపై GT ఓపెనర్ సాయి సుదర్శన్(56) మరోసారి అదరగొట్టారు. IPLలో అద్భుత ప్రదర్శనతో మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్‌గా అనిపించుకుంటున్నారు. ఈ సీజన్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 329 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నారు. లాస్ట్ 10 IPL మ్యాచుల్లో కేవలం రెండుసార్లే సింగిల్ డిజిట్ స్కోర్ చేసి.. ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశారు. త్వరలోనే సాయి టీమిండియాలో చోటు దక్కించుకుంటాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

News April 12, 2025

ICICI నుంచి లోన్లు తీసుకోలేదు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: ICICI బ్యాంకు నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. AI వీడియోలు పోస్ట్ చేసి HYDకు పెట్టుబడులు, ఉద్యోగాలు రావొద్దని కుట్ర చేస్తున్నారు. స్టూడెంట్స్‌ను ప్రభావితం చేసి సర్కార్ పనుల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు.

News April 12, 2025

15 నుంచి రాష్ట్రంలో చేపల వేట నిషేధం

image

AP: ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మత్స్య సంపద వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరబోట్లు, మెకనైజ్డ్, మోటార్ బోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీవో నం.129 విడుదల చేశారు.

News April 12, 2025

సోనియా, రాహుల్ ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం

image

‘నేషనల్ హెరాల్డ్’ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేయనుంది. ఢిల్లీ, లక్నో, ముంబైలోని రూ.661 కోట్ల ఆస్తులపై అక్కడి రిజిస్ట్రార్స్‌కు నోటీసులు పంపింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ₹2000 కోట్ల ప్రాపర్టీస్‌ను సోనియా, రాహుల్‌కు చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కేవలం రూ.50 లక్షలకు అక్రమంగా దక్కించుకుందన్న ఆరోపణలపై ఈడీ 2021 నుంచి దర్యాప్తు చేస్తోంది.

News April 12, 2025

బెంగాల్‌లో అల్లర్లు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

image

వక్ఫ్ చట్టం సవరించిన నేపథ్యంలో బెంగాల్‌లో కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ‘చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. మేం కాదు. మీరు కేంద్రంతోనే తేల్చుకోండి. సవరించిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే చెప్పాం. కాబట్టి అన్ని మతాల ప్రజలు శాంతించండి’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ అల్లర్లలో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు.

News April 12, 2025

CSK మరో చెత్త రికార్డు

image

ఐపీఎల్-2025లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ (245) ఆడిన జట్టుగా CSK నిలిచింది. నిన్న KKRతో ఆడిన మ్యాచులోనే 61 డాట్ బాల్స్ ఆడటం గమనార్హం. ఈ లిస్టులో CSK తర్వాత వరుసగా KKR (245), RR (206), RCB (202), MI (198), SRH (191), LSG (186), GT (167), PBKS (145), DC (123) ఉన్నాయి. ఐపీఎల్‌లో ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 మొక్కలను నాటుతున్న సంగతి తెలిసిందే.

News April 12, 2025

గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

image

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.