news

News March 13, 2025

అమెరికా మాజీ అధ్యక్షుడి నిర్మాణంలో ‘టైగర్ వుడ్స్’ బయోపిక్

image

స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ జీవితంపై బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘వెరైటీ’ మ్యాగజైన్ కథనం ప్రకారం.. US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఆ సినిమాను నిర్మిస్తారు. వుడ్స్ జీవితంపై కెవిన్ కుక్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉండనుంది. గోల్ఫ్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన వుడ్స్, ఆ తర్వాత వివాహేతర సంబంధాలు సహా పలు వివాదాల్లో చిక్కుకున్నారు.

News March 13, 2025

‘జన్మభూమి’ ఇక సికింద్రాబాద్‌లో ఆగదు! వివరాలివే

image

విశాఖ-లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వచ్చే నెల 25 నుంచి సికింద్రాబాద్‌లో ఆగదు. దాని ప్రయాణమార్గాన్ని మళ్లిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ ప్రకటించింది. శాశ్వత ప్రాతిపదికన లింగంపల్లి నుంచి చర్లపల్లి-అమ్ముగూడ-సనత్ నగర్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్లవైపు వెళ్లదని, ప్రయాణికులు గుర్తుంచుకోవాలని కోరింది.

News March 13, 2025

బేర్స్ గ్రిప్‌లోకి Nifty IT: రూ.8.4లక్షల కోట్ల నష్టం

image

దేశీయ ఐటీ సూచీ బేర్స్ గ్రిప్‌లోకి జారిపోయింది. 2024, DEC 4న 45,995 వద్ద NiftyIT సూచీ ప్రస్తుతం 36,271 స్థాయికి చేరింది. 62 సెషన్లలోనే ఏకంగా 10,200 pts (22%) పతనమైంది. దీంతో ఈ ఒక్క రంగంలోనే రూ.8.4లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. TCS రూ.3.79లక్షల కోట్లు, ఇన్ఫీ రూ.1.69లక్షల కోట్లు, HCL TECH రూ.1.21లక్షల కోట్ల మేర నష్టపోయాయి. సాధారణంగా ఏ సూచీ అయినా 20% పతనమైతే బేర్స్ గ్రిప్‌లోకి వెళ్లినట్టు భావిస్తారు.

News March 13, 2025

మతం మారమని బలవంతం చేసేవారు: డానిష్ కనేరియా

image

మైనారిటీలపై వివక్ష కారణంగానే తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నారు. పాక్‌ తరఫున ఆడుతున్న సమయంలో మిగిళిన వాళ్లతొ సమానంగా విలువదక్కేది కాదని, ఆప్రీది,షోయబ్ అక్తర్ తరచుగా మతం మారమని బలవంతం చేసేవారని తెలిపారు. ఇంజమామ్ మాత్రం తనకు మద్దతుగా ఉండేవారన్నారు. ఆ కారణంగానే USAలో స్థిరపడాల్సి వచ్చిందన్నారు. పాక్ తరఫున ఆడిన హిందు క్రికెటర్లలో డానిష్ కనేరియా 2వ వారు.

News March 13, 2025

విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో?: అమర్‌నాథ్‌

image

AP: వైసీపీ అధినేత జగన్‌పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన <<15734998>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. ‘విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో? ఒకరిపై ప్రేమ పుడితేనే మరొకరిపై మనసు విరుగుతుంది. జగన్ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే ఇలా మాట్లాడేవారా? విజయసాయి వ్యవసాయం చేయరని, రాజకీయం మాత్రమే చేస్తారని నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్థమైంది’ అని కౌంటర్ ఇచ్చారు.

News March 13, 2025

పిల్లలను దండించే అధికారం గురువులకు లేదా?

image

1990, 2000లలో గురువులంటే పిల్లలకు ఎంతో గౌరవం, భయం ఉండేవి. పిల్లలు సరిగా చదవకున్నా, అల్లరి చేసినా మందలించమని తల్లిదండ్రులు టీచర్లకు చెప్పేవారు. వారి భరోసాతో ఉపాధ్యాయులు విద్యార్థులను దారిలోకి తెచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లలపై చేయి వేద్దామంటేనే <<15742695>>ఉపాధ్యాయులు<<>> జంకాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులకూ పిల్లలపై నియంత్రణ ఉండట్లేదు. మీ కామెంట్?

News March 13, 2025

Q-కామర్స్‌లో 5.5 లక్షలమందికి కొలువులు!

image

భారత్‌లో క్విక్ కామర్స్ రంగం వచ్చే ఏడాది లోపు 5.5 లక్షల కొత్త కొలువుల్ని సృష్టించొచ్చని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేసింది. ‘క్యూ కామర్స్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది చివరికి 5 బిలియన్ డాలర్ల వ్యవస్థగా మారనుంది. వ్యాపార సంస్థలు తమ ఉద్యోగుల నైపుణ్యాల్ని మరింత మెరుగుపరచాలి’ అని ఓ నివేదికలో పేర్కొంది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటివి క్విక్ కామర్స్ సంస్థల కిందకు వస్తాయి.

News March 13, 2025

21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

image

భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్‌వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్‌లో డయ్యర్‌ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i-Azam అనే బిరుదు వచ్చింది.

News March 13, 2025

Stock Markets: ఆ రెండు రంగాల షేర్లు అదుర్స్

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,504 (32), సెన్సెక్స్ 74,166 (140) వద్ద చలిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సీజ్‌ఫైర్, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడమే ఇందుకు కారణాలు. CPSE, PSE, ఎనర్జీ, చమురు, PSU బ్యాంకు, ఇన్ఫ్రా, కమోడిటీస్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. స్మాల్, మిడ్‌క్యాప్, ఆటో, రియాల్టి, మీడియా, ఐటీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. BEL, ONGC టాప్ గెయినర్స్.

News March 13, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.81,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరగడంతో రూ.88,580కు చేరింది. అటు వెండి ధర కూడా నిన్న రూ.2వేలు, ఇవాళ రూ.1000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.