news

News March 8, 2025

మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం: సీఎం

image

AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు వారికి శుభాకాంక్షలు తెలిపారు. TDP ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, భద్రత, గౌరవం కోసం కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. 2025-26 బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమం కోసం ₹4,332Cr కేటాయించామని గుర్తుచేశారు. దీపం-2 కింద 90L మందికి ఉచిత సిలిండర్లు, పెన్షన్లు, అంగన్వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.

News March 8, 2025

ఉచితాలపై చర్చ జరగాలన్న సీఎం.. మీరేమంటారు?

image

TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందంటూనే <<15677567>>ఉచిత పథకాల<<>>పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉచితాలు పంచడం తన ఒక్కడి సమస్యే కాదని, ఢిల్లీలోనూ బీజేపీ ఉచితాలు ప్రకటించిందని వెల్లడించారు. ఈ ఉచిత పథకాల కారణంగా మౌలిక సదుపాయాలపై రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

News March 8, 2025

స్టార్టప్‌లలోనూ నారీ శక్తి

image

రాజకీయ, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా ధైర్యంగా స్టార్టప్ కంపెనీల నిర్వహణలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. రిటైల్, ఎడ్‌టెక్, ఈకామర్స్, ఫ్యాషన్ తదితర రంగాల్లో సంస్థలను వృద్ధి చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దేశంలో నారీమణుల సారథ్యంలో 7వేలకు పైగా అంకుర సంస్థలున్నాయి. మొత్తం స్టార్టప్‌లలో వీటి వాటా 7.5 శాతం. ఇవి ఇప్పటి వరకు $26 బిలియన్లను సమీకరించినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

News March 8, 2025

తెలంగాణలో కొత్త ESI డిస్పెన్సరీలు

image

తెలంగాణలో పలు జిల్లాలకు ESIC డిస్పెన్సరీలు మంజూరు చేసింది. మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, హనుమకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. కొత్తగా 20 డిస్పెన్సరీలు అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రతిపాదనలు రూపొందించారు. తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాక ఆర్థిక శాఖ అనుమతితో జీవో జారీ కానుంది.

News March 8, 2025

స్టార్ షిప్ ఎఫెక్ట్: 240కి పైగా విమానాలకు అంతరాయం

image

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ షిప్ నిన్న ఉదయం భూకక్ష్యలో ప్రవేశించే సమయంలో ముక్కలైపోయిన సంగతి తెలిసిందే. దాని శకలాలు ఫ్లోరిడా, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై పడ్డాయి. దీంతో తమ దేశవ్యాప్తంగా 240 విమానాల రాకపోకలు నిలిచిపోయాయని అమెరికా ఏవియేషన్ యంత్రాంగం తెలిసింది. మియామీ, ఫోర్ట్ లాడర్‌డేల్, ఓర్లాండో, పామ్ బీచ్ ఎయిర్ పోర్టులు ప్రధానంగా సమస్యల్ని ఎదుర్కొన్నాయని పేర్కొంది.

News March 8, 2025

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినకపోతే?

image

ఆరోగ్యకరమైన జీవనానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కానీ అల్పాహారాన్ని స్కిప్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే టిఫిన్ తినకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జీవక్రియ మందగించి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తలనొప్పి, వికారం, వాంతులు రావచ్చు. ఊబకాయం, అల్సర్, గ్యాస్ సమస్యలకూ దారితీస్తుంది. నిద్ర లేచిన రెండు గంటల్లోగా అల్పాహారం తీసుకోవడం బెటర్.

News March 8, 2025

ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్‌’కు నామినీలు ఎవరంటే..

image

ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ప్రతి నెలా అత్యుత్తమ ఆటగాళ్లకు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పురస్కారం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరికి గిల్, స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిప్స్ పేర్లను నామినేట్ చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. గిల్ గత నెలలో 5 వన్డేలాడి 406 పరుగులు చేశారు. స్మిత్ 2 టెస్టుల్లో 2 సెంచరీలు, 4 వన్డేల్లో 12, 29, 5, 19 రన్స్ చేశారు. ఇక ఫిలిప్స్ 7 వన్డేల్లో ఓ సెంచరీతో కలిపి 318 రన్స్ చేశారు.

News March 8, 2025

18 లేదా 19న తెలంగాణ బడ్జెట్?

image

TG: ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.. అనంతరం ఈ నెల 18 లేదా 19న బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్, శాఖల వారీ పద్దులపై చర్చ అనంతరం 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది.

News March 8, 2025

తగ్గిన విదేశీ మారక నిల్వలు

image

భారత ఫారెక్స్ నిల్వలు FEB 28 నాటికి $1.8 బిలియన్లు తగ్గి $636.7 బిలియన్లకు చేరినట్లు RBI వెల్లడించింది. విదేశీ కరెన్సీ ఆస్తులు $493 మిలియన్లు క్షీణించి $543.4 బిలియన్లకు, గోల్డ్ నిల్వలు $1.3 బిలియన్లు తగ్గి $73.3 బిలియన్లుగా ఉన్నట్లు పేర్కొంది. కాగా గత ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ హై $704.9 బిలియన్లకు చేరగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

News March 8, 2025

నేడు ఈ మండలాల్లో వడగాల్పులు

image

AP: రాష్ట్రంలోని <>80 మండలాల్లో<<>> ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మన్యం, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. శ్రీకాకుళం-5, విజయనగరం-12, మన్యం-14, అల్లూరి-7, కాకినాడ-5, తూర్పుగోదావరి-10, ఏలూరు-5, కృష్ణా-7, NTR-6, గుంటూరు-5, పల్నాడు జిల్లాలోని 4 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.