news

News February 28, 2025

సెల్‌ఫోన్ల రికవరీలో అనంతపురం టాప్

image

AP: సెల్‌ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రికవరీ చేసిన 1183 ఫోన్లను బాధితులకు అప్పగించారు. 2022 నుంచి మొత్తం 11,378 మొబైల్స్‌ రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు. మొబైల్ చోరీకి గురైనా/పోయినా <<10494424>>CEIR పోర్టల్‌లో<<>> రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

News February 28, 2025

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. మార్చి 9న ఆయన ప్రధానితో సహా పలు పార్టీ నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని కోరనున్నట్లు సమాచారం. అంతకుముందు మార్చి 6న రాష్ట్ర కేబినెట్ భేటీ అయి ఈ బిల్లుకు ఆమోదం తెలపనుంది. మరోవైపు మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

News February 28, 2025

$280కి బదులుగా $81 ట్రిలియన్ల జమ.. చివరికి!

image

అమెరికాకు చెందిన citi బ్యాంక్ ఓ ఘోర తప్పిదం చేసింది. ఓ కస్టమర్ అకౌంట్‌లో 280 డాలర్లకు బదులుగా పొరపాటున $81 ట్రిలియన్లను జమ చేసింది. దీన్ని ఇద్దరు సిబ్బంది గుర్తించలేకపోయారు. మరో ఉద్యోగి దాదాపు 90 నిమిషాల తర్వాత పసిగట్టి తప్పును సరిదిద్దారు. ఇంత భారీ మొత్తంలో పేమెంట్ ప్రాసెస్ పూర్తికాలేదని, అయినా వెంటనే దోషాన్ని గుర్తించామని కంపెనీ తెలిపింది.

News February 28, 2025

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, హడ్కో రుణాలు ఇస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దీనికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని చెప్పారు. ఇప్పటికే రూ.48వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, మార్చి 10న ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. మేలో తల్లికి వందనం, ఆ తర్వాత అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

News February 28, 2025

వారికే నామినేటెడ్ పోస్టులు: రేవంత్

image

TG: ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని స్పష్టం చేశారు. సమర్థులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పదవులు పొందిన వారు కష్టపడితే రెన్యువల్ చేస్తామని లేకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని తెలిపారు.

News February 28, 2025

AUSvsAFG: ఆసీస్ టార్గెట్ 274 రన్స్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా అటల్ 85, అజ్మతుల్లా 67, ఇబ్రహీం 22, హష్మతుల్లా 20, రషీద్ 19 రన్స్ చేశారు. బెన్ 3, స్పెన్సర్, జంపా చెరో రెండు, ఎల్లిస్, మ్యాక్సీ చెరో వికెట్ పడగొట్టారు. విజయం కోసం కంగారూలు 274 రన్స్ చేయాల్సి ఉంది. ఈ వన్డేలో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు వెళ్తుంది.

News February 28, 2025

రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తిరస్కరించా: నటి

image

తనకు గతంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశాయని, వాటిని సున్నితంగా తిరస్కరించానని నటి ప్రీతి జింటా తెలిపారు. సోషల్ మీడియాలో తాను ఏం కామెంట్ చేసినా రాజకీయాలతో ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశమేమీ లేదని, వాటిపై ఆసక్తి కూడా లేదని స్పష్టం చేశారు. కాగా ఈ సీనియర్ హీరోయిన్ IPLలో పంజాబ్ జట్టుకు సహ యజమానిగా ఉన్నారు.

News February 28, 2025

రంజీల్లో చరిత్ర సృష్టించాడు

image

విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే రంజీల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు(69) తీసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అశుతోష్ అమన్(68W-2018/19), జయదేవ్ ఉనద్కత్(67W-2019/20), బిషన్ బేడీ(64W-1974/75), గణేశ్(62W-1998/99) ఉన్నారు. కాగా కేరళతో జరుగుతున్న రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్సులో దూబే 3 వికెట్లు తీశారు. విదర్భ తొలి ఇన్నింగ్సులో 37 పరుగుల ఆధిక్యంలో ఉంది.

News February 28, 2025

సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

AP: వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులన్నింటినీ భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మార్కెట్ యార్డులు, దేవస్థానాల కమిటీలకు పేర్లు ఇవ్వాలని టీడీఎల్పీ సమావేశంలో పార్టీ నేతలను ఆదేశించారు. సాధికార కమిటీ సభ్యులకే పదవులు దక్కుతాయని, మహానాడు లోపు ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, అనవసర విషయాలు మాట్లాడొద్దని హెచ్చరించారు.

News February 28, 2025

రేపు SLBCకి బీజేపీ ఎమ్మెల్యేల బృందం

image

TG: శ్రీశైలం SLBC టన్నెల్ వద్దకు రేపు బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్లనుంది. ప్రమాద స్థలాన్ని నేతలు పరిశీలించనున్నారు. రెస్క్యూ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు నిన్న బీఆర్ఎస్ నేతలను ప్రమాదస్థలికి అనుమతించని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిని అనుమతిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా రెస్క్యూ సిబ్బంది బురద, శకలాలను బయటకు పంపిస్తున్నారు.