India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG:కుమార్తెతో గొడవ పెట్టుకున్నాడనే కోపంతో అల్లుడిపై అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన ఇది. పాల్వంచ(మ) దంతెలబోరకు చెందిన గౌతమ్‌కు రామచంద్రునిపేటకు చెందిన కావ్యతో 3 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇటీవల భర్తతో గొడవ కావడంతో ఆమె పుట్టింటికెళ్లింది. భార్యను తీసుకెళ్లేందుకు FEB 2న వచ్చిన గౌతమ్‌కు ఆమె కుటుంబ సభ్యులతో గొడవైంది. ఆగ్రహంతో అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పంటించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు.

AP: GBS వైరస్ కారణంగా ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ <<15484094>>మరణించడం<<>> కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే 14 మందే చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. <<15225307>>లక్షణాలు<<>> కనిపించిన వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

పేరు ఎంపిక/మార్చుకోవడం రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యాశాఖ తన స్కూలు సర్టిఫికెట్‌లోని పేరును మార్చడానికి నిరాకరించిందంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ కింద వాక్ స్వాతంత్ర్యం, 21వ అధికరణ కింద వ్యక్తిగత స్వేచ్ఛ, 14వ అధికరణ కింద పేరు మార్పు వ్యక్తిగత స్వేచ్చ, ప్రాథమిక హక్కులో ఒకటని HC పేర్కొంది.

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తీసిన కొన్ని సినిమాలకు లాజిక్ అవసరం లేదన్నారు. కథపై పూర్తి విశ్వాసం ఉంచి ప్రేక్షకులకు నమ్మకం కలిగించేలా సినిమాలను రాజమౌళి తెరకెక్కిస్తారని ప్రశంసించారు. గొప్ప సినిమాలకు లాజిక్‌తో పని లేదన్నారు. RRR, గదర్, యానిమల్ వంటి సినిమాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని రేవంత్ ఆకాంక్షించినట్లు సీఎంవో Xలో తెలిపింది. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంగా, సుఖశాంతులతో చిరకాలం జీవించాలని కోరుకుంటున్నట్లు పొన్నం ట్వీట్ చేశారు.

AP: తాను బీజేపీలోకి వెళ్తున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ కేశినేని నాని ఖండించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత ఏడాది జూన్‌లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్స్ అవసరం లేదనే విషయాన్ని తాను నమ్ముతానని పేర్కొన్నారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా విజయవాడ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటానని తెలిపారు.

ఉత్తరాదిలో భూకంపం భయాందోళనలు సృష్టించింది. ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లో భూమి కంపించగా, తర్వాత యూపీ, బిహార్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. బిహార్‌లోని శివాన్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైనట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే <<15486384>>ప్రధాని మోదీ<<>> ప్రజలకు సూచించారు.

నిరుద్యోగ యువతకు శుభవార్త. పీఎం ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన వారు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలలోపు ఉండాలి. దీని ద్వారా టాప్-500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద రూ.6000 ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <

కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ సర్క్యూట్ బెంచ్ నేడు విజయవాడలో ప్రారంభం కానుంది. క్యాట్ ఛైర్మన్ జస్టిస్ రంజిత్ వీ మోరే వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఏపీలో ఇప్పటివరకు సర్క్యూట్ బెంచ్ లేకపోవడంతో రాష్ట్ర ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసు అంశాల్లో ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ లేదా HYD క్యాట్‌ను ఆశ్రయిస్తూ వచ్చారు. ఇకపై వారి కష్టాలు తీరనున్నాయి.

AP: మధ్యభారతం మీదుగా వీస్తున్న పొడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీలు నమోదయ్యాయి. మరోవైపు అల్లూరి జిల్లా కుంతలంలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.