India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్లు అర్జున్ తరఫున కోర్టులో వైసీపీ రాజ్యసభ ఎంపీ, న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నేతల కేసులను వాదిస్తుంటారు. ఆచార్య, ఘాజీ, క్షణం వంటి పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. షో నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టు జరిగినట్లు అర్థం అవుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తోందనే విషయాన్ని ఈ అరెస్ట్ గుర్తుచేస్తోందని ట్వీట్ చేశారు.
సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంది. తదుపరి విచారణను JAN 11కు వాయిదా వేసింది. అలాగే క్వాష్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.
ఆస్ట్రేలియాపై ఆడేందుకు భయపడట్లేదని భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించారు. ‘గెలవకపోవడం వల్ల భయపడుతున్నామంటే అర్థం ఉంది. మేం చివరిగా ఇక్కడ ఆడినప్పుడు గెలిచాం. భారత్‌లోనూ ఆస్ట్రేలియాను ఓడించాం. బౌలింగ్ ఎవరు చేస్తున్నారన్నది మా జనరేషన్ పట్టించుకోదు. కేవలం బంతినే చూస్తుంది. ఓ టీమ్‌గా ఎలా పోరాడాలన్నదానిపైనే ప్రస్తుతం జట్టు దృష్టిపెట్టింది. మా దృష్టిలో ఇక ఇది 3 టెస్టుల సిరీస్’ అని పేర్కొన్నారు.
నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తనపై కేసులు కొట్టేయాలని బన్నీ క్వాష్ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి కేసులన్నీ కొట్టేయలేమన్నారు. అయితే తాత్కాలిక ఊరటగా రూ.50 వేల పూచీకత్తుతో 4 వారాల ‘పరిమిత కాల బెయిల్ ఇస్తాం’ అని ఆదేశాలిచ్చారు. కాగా బన్నీని పోలీసులు ఇప్పటికే చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోశ్కు సీల్దా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో మరో నిందితుడైన తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అభిజిత్ మోండల్‌కు కూడా కోర్టు రూ.2 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో 90 రోజుల తర్వాత కూడా సీబీఐ తన ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడమే దీనికి కారణం.
అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ తొలగింపునకు విపక్షాలు శుక్రవారం రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. కపిల్ సిబల్, వివేక్ తన్ఖా, దిగ్విజయ్ సింగ్ సహా 55 మంది తీర్మానంపై సంతకాలు చేశారు. దీనిని ఎంపీలందరూ కలిసి రాజ్యసభ కార్యదర్శికి అందజేశారు. దేశంలో మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే పాలన జరగాలని శేఖర్ యాదవ్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఏపీ మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడంపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతణ్ని బాధ్యుణ్ని చేయడం ఎంతవరకు సమంజసం? ఈ ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు’ అని ట్వీట్ చేశారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా TGలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న ₹1800కోట్ల గ్రాంటును విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలను CM రేవంత్ కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి AP, TG మధ్య రుణాల పంపిణీ విషయంలో TG నుంచి ₹2547cr రికవరీకి కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలిచ్చిందని, దీనిపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందడంతో హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో ఆయన ప్రమేయం లేకుండా జరిగిన ప్రమాదంలో బన్నీని అరెస్ట్ చేయడం ఏంటని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. యూపీలోని హాథ్రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయినా ‘భోలే బాబా’ను అరెస్ట్ చేయలేదని, బన్నీనైతే మాత్రం అరెస్ట్ చేస్తారా? అని గుర్తుచేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.